Big News : తెలంగాణలో రైతులందరికీ రైతు భరోసా
Big News : తెలంగాణ రాష్ట్ర రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. వ్యవసాయ యోగ్యమైన భూమి ఎంత ఉన్నా ప్రతి ఒక్కరికి రైతు భరోసా నిధులు జమ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
- By Kavya Krishna Published Date - 07:24 PM, Mon - 16 June 25

Big News : తెలంగాణ రాష్ట్ర రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. వ్యవసాయ యోగ్యమైన భూమి ఎంత ఉన్నా ప్రతి ఒక్కరికి రైతు భరోసా నిధులు జమ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఆరు నుంచి తొమ్మిది రోజుల్లోగా రైతుల ఖాతాల్లోకి నిధులు చేరతాయని స్పష్టత ఇచ్చారు. రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్, రైతులను పట్టుకొంటూ ప్రభుత్వం ముందడుగు వేస్తోందని తెలిపారు.
“ఇందిరమ్మ రాజ్యంలో రైతు రాజులా ఉండాలి. వ్యవసాయానికి పండగలా గుర్తింపు ఉండాలి” అని అన్నారు సీఎం. “రైతుల ఆశీర్వాదం లేకుండా ఎవ్వరూ రాజకీయంగా ఎదగలేరు. శాసనసభ నుంచి వార్డు మెంబర్ స్థాయివరకు గెలిచిన ప్రతీ ఒక్కరికి రైతుల మద్దతే ఆస్తి” అని ఆయన పేర్కొన్నారు. పాత ప్రభుత్వం తన పాలనను విమర్శిస్తోందని మండిపడ్డ సీఎం, “పదేళ్లు పాలనలో ఉన్నవారు ఇప్పుడు మమ్మల్ని నిందిస్తున్నారు. రైతుల పేరుతో వీధుల్లో నాటకాలు చేస్తున్నారు. లక్ష రూపాయల రుణ మాఫీ పేరుతో నాలుగు విడతలు ప్రకటించి, అప్పు కన్నా వడ్డీనే ఎక్కువ చేశారు. అధికారంలో రెండోసారి వచ్చినా రైతులను మోసగించారు” అని ఆయన ఆరోపించారు.
Annadata Sukhibhava Scheme : రైతులకు అన్నదాత సుఖీభవ ముఖ్య సమాచారం
మరోవైపు, తన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రుణమాఫీ అమలు చేసింది అని తెలిపారు. “మేము సత్రం నడపడం లేదు. కేసీఆర్ వరి కొనబోమని చెప్పి రూ.7 వేల కోట్లు నష్టపరిచాడు. కానీ మేము సన్నబియ్యం పండించిన రైతుల చేతుల మీదుగా ధైర్యంగా కొనుగోలు చేశాం. ఇప్పుడే కాదు, రైతులకు బోనస్ కూడా ఇచ్చాం. పేదలందరికీ సన్నబియ్యం అందించాలన్నదే మా సంకల్పం” అని చెప్పారు సీఎం.
సర్పంచులకు పెండింగ్ బిల్లులు ఇవ్వలేకపోయిన పాత పాలకులు, ఇప్పుడు రోడ్ల మీదకు వచ్చి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రంపై రూ.8.29 లక్షల కోట్లు అప్పు తెచ్చారని విమర్శించారు. “అప్పుల్లో నెట్టుకొస్తున్న రాష్ట్రాన్ని మేము బాధ్యతగా ముందుకు తీసుకెళ్తున్నాం. గత ప్రభుత్వం జీతాలిచ్చే తేదీ చెప్పలేకపోయింది. కానీ ఇప్పుడు ప్రతి నెలా 1వ తేదీన ఉద్యోగులకు జీతాలు జమ అవుతున్నాయి,” అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Israel: ఇరాన్ క్షిపణి దాడి..స్వల్పంగా దెబ్బతిన అమెరికా దౌత్య కార్యాలయం..!