HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Telangana Ex Deputy Speaker Padma Rao Goud Hospitalized Heart Attack

Padma Rao Goud: ఎమ్మెల్యే పద్మారావు గౌడ్‌కు గుండెపోటు.. ఆస్పత్రిలో చేరిక

Padma Rao Goud: ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ గుండెపోటుకు గురైయ్యారు. డెహ్రాడూన్ పర్యటనలో ఉన్న సమయంలో ఆయనకు గుండెపోటు రావడంతో, కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అత్యవసర పరీక్షలు నిర్వహించి స్టంట్ అమర్చారు.

  • Author : Kavya Krishna Date : 21-01-2025 - 9:05 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Padmarao Goud
Padmarao Goud

Padma Rao Goud: తెలంగాణ మాజీ డిప్యూటీ స్పీకర్ , సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ గుండెపోటుకు గురైయ్యారు. డెహ్రాడూన్ పర్యటనలో ఉన్న సమయంలో ఆయనకు గుండెపోటు రావడంతో, కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అత్యవసర పరీక్షలు నిర్వహించి స్టంట్ అమర్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కుటుంబ సభ్యులు వెల్లడించారు. పద్మారావు గౌడ్‌కు గుండెపోటు వచ్చిన వార్త బీఆర్ఎస్ కార్యకర్తలు , అభిమానుల్లో ఆందోళనకు గురి చేసింది.

APPSC : గ్రూప్-1 మెయిన్స్ షెడ్యూల్ విడుదల

వ్యక్తిగత , రాజకీయ జీవితం
పద్మారావు గౌడ్ తెలంగాణలో గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలో బలమైన రాజకీయ నేతగా గుర్తింపు పొందారు. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిలర్‌గా తన రాజకీయ జీవన ప్రస్థానాన్ని ప్రారంభించి, ఆయన ఒక్కో మెట్టుగా ఎదిగారు. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన ఆయన, 2004లో తొలిసారి సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు.

2009లో సనత్ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయినప్పటికీ, 2014లో మళ్లీ సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి గెలిచారు. 2014-2018 మధ్య ఎక్సైజ్ , స్పోర్ట్స్ శాఖ మంత్రిగా పనిచేశారు. 2019 ఫిబ్రవరిలో తెలంగాణ రెండో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా నియమించబడ్డారు. 70 ఏళ్ల వయసులో కూడా పద్మారావు గౌడ్ బీఆర్ఎస్ పార్టీకి శక్తివంతమైన నేతగా కొనసాగుతున్నారు.

CM Revanth Davos Tour : తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు యూనిలీవర్ గ్రీన్ సిగ్నల్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • BRS Leaders
  • deputy speaker
  • heart attack
  • Padma Rao Goud
  • Padma Rao Health Update
  • political news
  • Secunderabad MLA
  • telangana
  • telangana politics

Related News

Kavitha warns the Congress government.

Kavitha: కాంగ్రెస్ ప్రభుత్వానికి కవిత వార్నింగ్

ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని సింగరేణి జేవీఆర్ ఓపెన్ కాస్ట్ (JVR OC) గని వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బిఆర్ఎస్ నాయకురాలు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టిన సింగరేణి ‘బాయిబాట’ ముగింపు కార్యక్రమం సందర్భంగా ఈ హైడ్రామా చోటుచేసుకుంది. భద్రతా కారణాల దృష్ట్యా కవితను గని లోపలికి అనుమతించలేమంటూ సింగరేణి అధికారులు, పోలీసులు ఆమెను గేటు వద్దే అడ్డుకున్న

  • CM Revanth Reddy issues a strong warning to KTR.

    Cm Revanth: కేటీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

  • Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

    ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

  • Telangana government takes a serious view of irregularities in the Dharani portal.

    Dharani: ధరణి పోర్టల్ అక్రమాల పై తెలంగాణ సర్కార్ సీరియస్

  • Good news for Singareni workers: Union Minister Kishan Reddy

    Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Latest News

  • INS Mahendragiri: భారత నౌకాదళంలో చేరిన ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి

  • Gold Rate: పసిడి ప్రేమికులకు పండగే.. కుప్పకూలిన బంగారం ధరలు

  • Sreeleela: శ్రీలీల ఆదాయం ఎంత? ఒక నెలకు సంపాదన ఎంతంటే?

  • Businessman Missing: స్విట్జర్లాండ్ విహారయాత్రలో అదృశ్యమైన హైదరాబాద్ దంపతులు.. రూ. 50 కోట్ల కుంభకోణంలో పోలీసుల దర్యాప్తు!

  • Home Loan Rates: ఇల్లు కొనాలనుకుంటున్నారా? జూలై నెలలో హోంలోన్లపై రుణ వడ్డీ రేట్లు ఎంత ఉందంటే?

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd