HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Supreme Courts Key Verdict On Disqualification Of Mlas Who Changed Parties

Telangana : పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

ఈ వ్యవహారంలో న్యాయస్థానమే అనర్హతపై తుది నిర్ణయం తీసుకోవాలన్న విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. అపరేషన్‌ సక్సెస్‌... పేషెంట్‌ డెడ్‌ అన్న పరిస్థితి రాజకీయ వ్యవస్థలో ఉండకూడదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రజా ప్రతినిధుల మార్పిడి వ్యవహారాన్ని వ్యవస్థాపిత ప్రజాస్వామ్యానికి భంగం కలిగించే అంశంగా పేర్కొంది.

  • Author : Latha Suma Date : 31-07-2025 - 11:27 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Supreme Court's key verdict on disqualification of MLAs who changed parties
Supreme Court's key verdict on disqualification of MLAs who changed parties

Telangana : తెలంగాణ రాష్ట్రంలో పార్టీ మార్చిన ఎమ్మెల్యేల అనర్హతపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పును వెలువరించింది. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. స్పీకర్ అనర్హత పిటిషన్లపై నిర్దిష్ట గడువులోగా నిర్ణయం తీసుకోవాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంలో న్యాయస్థానమే అనర్హతపై తుది నిర్ణయం తీసుకోవాలన్న విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. అపరేషన్‌ సక్సెస్‌… పేషెంట్‌ డెడ్‌ అన్న పరిస్థితి రాజకీయ వ్యవస్థలో ఉండకూడదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రజా ప్రతినిధుల మార్పిడి వ్యవహారాన్ని వ్యవస్థాపిత ప్రజాస్వామ్యానికి భంగం కలిగించే అంశంగా పేర్కొంది.

Read Also: Vijayawada : ప్రకాశం బ్యారేజ్‌కు భారీగా పెరుగుతున్న వరద ఉధృతి.. అధికారుల హెచ్చరిక

బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ పిటిషన్లు దాఖలయ్యాయి. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌తో పాటు ఆ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద్, జీ జగదీశ్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, చింతా ప్రభాకర్, కల్వకుంట్ల సంజయ్‌లు వేర్వేరుగా సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా ఈ క్రమంలో పిటిషన్ దాఖలు చేశారు. ఇవన్నీ కలిపి 2024 జనవరి 15న సుప్రీంకోర్టు ముందుకు వచ్చాయి. మొత్తం తొమ్మిదిసార్లు ఈ కేసులు విచారణకు వచ్చాయి. చివరకు జస్టిస్‌ బీఆర్ గవాయ్, జస్టిస్ ఆగస్టీన్ జార్జ్ మసీహ్‌లతో కూడిన ధర్మాసనం వాదనలు పూర్తయిన అనంతరం ఏప్రిల్ 3న తీర్పును రిజర్వ్ చేసింది. ఈ కేసులో ప్రతివాదులుగా రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఎమ్మెల్యేలు పి.శ్రీనివాస రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలె యాదయ్య, టి.ప్రకాశ్ గౌడ్, ఎ.గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, ఎం.సంజయ్ కుమార్‌లు ఉన్నారు.

ఈ ఏడాది ఆరంభంలోనే పార్టీ మారినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే స్పీకర్ వాటిపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో పిటిషనర్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో స్పీకర్‌కు మూడు నెలల గడువులోగా తుది నిర్ణయం తీసుకోవాలని ఆదేశించిన సుప్రీంకోర్టు, ఈ వ్యవహారంలో తాము నేరుగా జోక్యం చేయలేమని స్పష్టం చేసింది. ఇదే సమయంలో “న్యాయస్థానం అనర్హతను నిర్ణయించాలన్నది రాజ్యాంగ విరుద్ధం” అంటూ వ్యాఖ్యానించిన ధర్మాసనం, ప్రజా ప్రతినిధుల అనర్హత వంటి రాజ్యాంగపరమైన అంశాల్లో రాజ్యాంగ సంస్థల పాత్రను పరిరక్షించే దిశగా కీలక సూచనలు చేసింది. ఈ తీర్పుతో తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

Read Also: Janahita Padayatra : నేటి నుంచి కాంగ్రెస్ ‘జనహిత’ పాదయాత్ర


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • congress
  • MLA Disqualification
  • Speaker
  • telangana
  • Telangana High Court Division Bench
  • telangana MLAs

Related News

Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో తెలంగాణ ప్రపంచ దేశాలకు కొత్త దిశానిర్దేశం చేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంగళవారం అన్నారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి హెచ్‌ఐసిసిలో “గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్ – ది హైదరాబాద్ కలెక్టివ్”ను ప్రారంభిస్తూ, “రాష్ట్రం పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యతలను కూడ

  • Telangana government takes a serious view of irregularities in the Dharani portal.

    Dharani: ధరణి పోర్టల్ అక్రమాల పై తెలంగాణ సర్కార్ సీరియస్

  • Good news for Singareni workers: Union Minister Kishan Reddy

    Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • National Status... Palampet Shiva Temple, Mulugu District

    Palampet Shivalaya Temple: జాతీయ హోదా.. ములుగు జిల్లా పాలంపేట శివాలయం

  • Draft Of 'core Urban Region

    GHMC : పాత జీహెచ్‌ఎంసీ చట్టానికి స్వస్తి .. హైదరాబాద్‌‌లో కొత్త రూల్స్ ..!

Latest News

  • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

  • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

  • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

  • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

  • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd