HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Summer Vacation For School Students In Telangana To Start From Tuesday

Telangana: తెలంగాణలోని పాఠశాలలకు మంగళవారం నుంచి వేసవి సెలవులు.. మళ్లీ జూన్ 12న ఓపెనింగ్..!

తెలంగాణ (Telangana)లోని ప్రభుత్వ, రెసిడెన్షియల్ ప్రైవేట్ ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ అనే వివిధ మేనేజ్‌మెంట్ల పరిధిలోని పాఠశాలల (Schools)కు వేసవి సెలవులు ఈ మంగళవారం ప్రారంభం కానున్నాయి.

  • Author : Gopi Date : 23-04-2023 - 9:25 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Govt Schools
Govt Schools

తెలంగాణ (Telangana)లోని ప్రభుత్వ, రెసిడెన్షియల్ ప్రైవేట్ ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ అనే వివిధ మేనేజ్‌మెంట్ల పరిధిలోని పాఠశాలల (Schools)కు వేసవి సెలవులు ఈ మంగళవారం ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 25 నుండి జూన్ 11 వరకు సెలవులు ఉంటాయి. వచ్చే విద్యా సంవత్సరానికి జూన్ 12న పాఠశాలలు తిరిగి తెరవబడతాయి. పాఠశాలల్లో ఇప్పటికే తుది పరీక్షలు పూర్తయ్యాయి. ఏప్రిల్ 24 చివరి పనిదినం. ఈ నేపథ్యంలో సోమవారం జరగనున్న పేరెంట్‌-టీచర్‌ మీటింగ్‌లో పాల్గొనాల్సిందిగా తల్లిదండ్రులందరికీ పాఠశాలలు ఆహ్వానాలు పంపాయి.

వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు జూన్ 1 నుండి ప్రభుత్వ పాఠశాలల్లో బడి-బాట (అడ్మిషన్ డ్రైవ్) ప్రారంభించాలని పాఠశాల విద్యా శాఖ భావిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకే పిల్లలను తమ పాఠశాలల్లో చేర్పించే బాధ్యతను అప్పగించారు. మన ఊరు-మన బడి కార్యక్రమం కింద చేపట్టిన పనులను కూడా వేసవి విరామ సమయంలో పూర్తి చేయాలని ఆ శాఖ యోచిస్తోంది.

Also Read: Gold Price Today: దేశ వ్యాప్తంగా నేటి బంగారం, వెండి ధరలివే.. తగ్గిన ధరలు..!

మరోవైపు.. కొత్త విద్యాసంవత్సరాన్ని ప్రారంభించడానికి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు తమ పాఠశాలల్లోకి అడుగుపెట్టినప్పుడు కొత్త కార్పొరేట్ స్టైల్ రూపాన్ని ప్రదర్శించనున్నారు. పాఠశాల యూనిఫాంలో డిజైన్ మార్పులు చేసిన పాఠశాల విద్యాశాఖ రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలతో పాటు (కేజీబీవీ) ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న 24,27,391 మంది విద్యార్థులకు ఉచితంగా రెండు జతల యూనిఫామ్‌లను సరఫరా చేస్తోంది.

24,27,391 మంది విద్యార్థులకు యూనిఫాం కుట్టడం కోసం డిపార్ట్‌మెంట్ తెలంగాణ స్టేట్ హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ (TSCO) నుండి 1,26,96,313.30 మీటర్ల యూనిఫాం క్లాత్‌ను కొనుగోలు చేసింది. మండల కేంద్రాలకు చేరిన గుడ్డను కుట్టించేందుకు పాఠశాలలకు అప్పగిస్తున్నారు. ఈసారి జిల్లాల్లో కనీసం 50 శాతం యూనిఫామ్‌లను స్థానిక టైలర్ల ద్వారా కుట్టించాలని ఆదేశాలు జారీ చేశారు. గతంలో ఈ పనిని స్వయం సహాయక సంఘాలకు అప్పగించారు. మే 31లోగా యూనిఫాం కుట్టడం పూర్తి చేసి విద్యార్థులకు పంపిణీ చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లను కోరారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • government schools
  • holidays
  • School Education Department
  • schools
  • summer vacation
  • telangana

Related News

MIssing Case

Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

ఫిన్లాండ్‌లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న హైదరాబాద్‌కు చెందిన ఓ విద్యార్థి 45 రోజులుగా అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. కుమారుడి ఆచూకీ కోసం తీవ్ర ఆందోళనకు గురైన తల్లిదండ్రులు చివరకు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. హయత్‌నగర్‌కు చెందిన గుజ్జ మణిదీప్ రెడ్డి, ఫిన్లాండ్‌లోని లాహ్తిలో ఉన్న LUT యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్నాడు. మే 5న తన కుటుంబ సభ్యులతో చివరిసారిగా మాట్లాడిన తర

  • Engineering counselling in Telangana begins today.

    TS EAPCET 2026: తెలంగాణలో నేటి నుంచి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్

  • Alert for gas consumers: June 30 is the final deadline. These requirements must be met—otherwise, the connection will be disconnected.

    LPG Gas Subsidy: గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. జూన్ 30 వరకే డెడ్ లైన్.. ఇవి తప్పక పాటించాల్సిందే.. లేదంటే కనెక్షన్ కట్

  • Pawan Kalyan's tour in Telangana... Janasena chief to fulfill a young child's last wish.

    Pawan Kalyan: తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటన.. చిన్నారి చివరి కోరిక తీర్చనున్న జనసేనాని

Latest News

  • ఈ గొప్పల దండకం ఇక చాలు.. కేటీఆర్, బీఆర్ఎస్‌లు ఈ వాస్తవాలు తనిఖీ చేసుకోవాలి !

  • Bandi Bhagirath: బండి భగీరథ్‌కు కండీషనల్ బెయిల్…

  • Mudragada Padmanabham Reddy: ముద్రగడ పద్మనాభ రెడ్డి కి తీవ్ర అస్వస్థత..!

  • Brazil Nuts: రోజూ ఈ నట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. వీటి బెనిఫిట్స్ తెలిస్తే తినకుండా ఉండలేరు!

  • Monalisa: కుంభమేళా మోనాలిసాకు భద్రత కల్పించండి హైకోర్టు కీలక ఆదేశాలు

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd