HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Spf Police Taken Charge For Security Of Telangana Secretariat

TGSPF : తెలంగాణ సచివాలయ బందోబస్తు బాధ్యతలు చేపట్టిన ఎస్పీఎఫ్‌

TGSPF : సచివాలయాన్ని ప్రారంభించిన తర్వాత మొదటగా ఎస్పీఎఫ్‌కే భద్రత బాధ్యతలు అప్పగించారు. అయితే 2023 ఏప్రిల్ 25న భద్రత నిర్వహణను తెలంగాణ స్పెషల్ పోలీస్ (టీజీఎస్పీ) లేదా బెటాలియన్ పోలీసులకు అప్పగించారు.

  • Author : Latha Suma Date : 01-11-2024 - 8:38 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
SPF Police Taken Charge For Security Of Telangana Secretariat
SPF Police Taken Charge For Security Of Telangana Secretariat

Telangana Secretariat :  ఇటీవల తెలంగాణ సచివాలయం వద్ద ఉంటున్న బెటాలియన్ కానిస్టేబుళ్లను తొలగించిన విషయం తెలిసిందే. దీంతో ఈరోజు తెలంగాణ సచివాలయం భద్రత బాధ్యతలను తెలంగాణ స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (టీజీఎస్పీఫ్‌) స్వీకరించింది. సచివాలయ భద్రత పర్యవేక్షణ అధికారిగా దేవిదాస్‌ నియమితులయ్యారు. ఆయన ఆధ్వర్యంలో నేడు సచివాలయ ఆవరణలో పూజలు నిర్వహించి బందోబస్తు బాధ్యతలను చేపట్టారు. ఈ మేరకు మొత్తం 214 మంది ఎస్పీఎఫ్‌ సిబ్బంది రక్షణ బాధ్యతలను చేపట్టారు.

ఇకపోతే..సచివాలయాన్ని ప్రారంభించిన తర్వాత మొదటగా ఎస్పీఎఫ్‌కే భద్రత బాధ్యతలు అప్పగించారు. అయితే 2023 ఏప్రిల్ 25న భద్రత నిర్వహణను తెలంగాణ స్పెషల్ పోలీస్ (టీజీఎస్పీ) లేదా బెటాలియన్ పోలీసులకు అప్పగించారు. భద్రతతో పాటు అగ్నిప్రమాదాల నుంచి రక్షణ లాంటి ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకున్న ఎస్పీఎఫ్‌నకు సచివాలయంలో భద్రత బాధ్యతలు అప్పగించాలని డీజీపీ ఆగస్టు 5న రాష్ట్ర సర్కార్‌కు ప్రతిపాదన పంపారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న రేవంత్ సర్కార్.. ఇకనుంచి టీజీఎస్పీ భద్రత బాధ్యతలు ఎస్పీఎఫ్‌ నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేశారు.

ఇటీవల ఏక్‌ పోలీస్‌ విధానం అమలు కోసం టీజీఎస్పీ కానిస్టేబుళ్లు, వారి కుటుంబాలు ధర్నాలు చేస్తుండటంతో ప్రభుత్వం ఉలిక్కిపడింది. ముఖ్యమంత్రి నివాసం, కార్యాలయం, సచివాలయం వద్ద విధుల్లో ఉన్న టీజీఎస్పీ కానిస్టేబుళ్లు ధర్నా చేస్తే అటు పరువు పోవడంతోపాటు ఇటు భద్రతకు ముప్పు కలుగుతుందని ప్రభుత్వం భావించింది. వెంటనే టీజీఎస్పీని పక్కకు తప్పించింది. మొదట సీఎం నివాసం, ఇంటివద్ద రక్షణను ఎస్పీఎఫ్‌కు అప్పగించింది. తాజాగా సచివాలయాన్ని సైతం ఎస్పీఎఫ్‌ పరిధిలోకి తీసుకెళ్లింది. కాగా, ఈ ఆందోళనలు చేపట్టిన నేపథ్యంలో పోలీస్ ఇప్పటిదాకా 49 మందిని సస్పెండ్ చేసింది. సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. అంతేకాక.. బెటాలియన్ కానిస్టేబుళ్ల సెలవుల రద్దును ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది.

Read Also Jharkhand : జార్ఖండ్ ఎన్నికలు.. కాంగ్రెస్ విజయం ఖాయం: భట్టి విక్రమార్క: 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Battalion Constables
  • protection responsibilities
  • Special Protection Force
  • SPF Commandant Devidas
  • telangana
  • telangana secretariat
  • TGSPF

Related News

bjp Mp Godam Nagesh

తెలంగాణలో మరో కొత్త ఎయిర్‌పోర్టు.. మాస్టర్‌ ప్లాన్‌ ప్రతిని విడుదల చేసిన ఎంపీ నగేష్

Bjp Mp Godam Nagesh  ఆదిలాబాద్ జిల్లా ప్రజల దశాబ్దాల కల నెరవేరబోతుంది. జిల్లాలో కొత్తగా ఎయిర్‌పోర్టు కానుంది. ఈ మేరకు ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టు మాస్టర్ ప్లాన్‌ను ఎంపీ గోడం నగేష్ విడుదల చేశారు. త్వరలోనే భూసేకరణ పనులు ప్రారంభం అవుతాయని ఎంపీ వెల్లడించారు. ఈ ఎయిర్‌పోర్టు అందుబాటులోకి వస్తే జిల్లా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. ఆదిలాబాద్ కొత్త ఎయిర్‌పోర్టు మాస్టర్ ప్ల

  • Rajya Sabha Elections

    Breaking News రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల

  • Engineering Students Telang

    Engineering Students : ప్రైవేటు ఇంజినీరింగ్ స్టూడెంట్స్ కు బిగ్ షాక్..భారీగా పెరిగిన ఫీజులు

  • New Holland Launches 'workm

    తెలంగాణ మార్కెట్లోకి ‘వర్క్‌మాస్టర్ 105’ ట్రాక్టర్‌

  • Half Day Schools

    Half-Day Schools: తెలంగాణ లో ఒంటిపూట బడులు ఎప్పటి నుండి అంటే ..!!

Latest News

  • డార్క్ షవరింగ్ అంటే ఏమిటి? దీనివల్ల ప్రయోజనాలు ఉన్నాయా?!

  • హెరిటేజ్ నాణ్యతపై భరోసా.. YCP అసత్య ప్రచారానికి ఢిల్లీ హైకోర్టు చెక్!

  • ఐటీ శాఖ టార్గెట్ లిస్ట్‌లో ప్ర‌ముఖులు!

  • అవయవ దానం అంటే ఏమిటి? ఎన్ని రకాలు?

  • ఈ ఏడాదిలో కారు కొన‌టానికి ఇదే మంచి స‌మ‌య‌మా?!

Trending News

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd