ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ మూవీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ప్రకటన!
గత కొన్ని రోజులుగా వినిపిస్తున్న వార్తలకు తెరదించుతూ ఈ సినిమా వాయిదా పడినట్లు జూనియర్ ఎన్టీఆర్ తన సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు.
- Author : Gopi
Date : 21-04-2026 - 2:25 IST
Published By : Hashtagu Telugu Desk
Jr NTR: స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలయికలో రూపుదిద్దుకుంటున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మొదట ఈ చిత్రాన్ని జూన్ 25, 2026న విడుదల చేయాలని చిత్ర బృందం భావించినప్పటికీ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. సినిమా షూటింగ్ ఇంకా చాలా భాగం మిగిలి ఉండటంతో అనుకున్న సమయానికి సినిమాను సిద్ధం చేయడం సాధ్యం కాదని మేకర్స్ నిర్ణయించారు.
2027కు మారిన రిలీజ్ డేట్
గత కొన్ని రోజులుగా వినిపిస్తున్న వార్తలకు తెరదించుతూ ఈ సినిమా వాయిదా పడినట్లు జూనియర్ ఎన్టీఆర్ తన సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. కొత్త షెడ్యూల్ ప్రకారం.. ఈ చిత్రం దాదాపు ఏడాది పాటు ఆలస్యంగా అంటే జూన్ 11, 2027న థియేటర్లలోకి రానుంది. సినిమా ప్రకటించినప్పటి నుండి విడుదల కావడానికి దాదాపు నాలుగేళ్ల సమయం పట్టనుండటం విశేషం. ఈ ఆలస్యం అభిమానులను కొంత నిరాశకు గురిచేసినప్పటికీ నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని దర్శకుడు ప్రశాంత్ నీల్ భావిస్తున్నారు.
Also Read: Allu Arjun : ముంబైకి మకాం మార్చబోతున్న అల్లు అర్జున్ ?
HIS REIGN… HIS SOIL…
JUNE 11, 2027… IT IS…. #NTRNeel pic.twitter.com/ln9Dq4BFZs— Jr NTR (@tarak9999) April 21, 2026
బర్త్‌డే సర్ప్రైజ్.. మే 20న గ్లింప్స్
నిరాశలో ఉన్న అభిమానులకు ఎన్టీఆర్ ఒక తియ్యటి వార్త చెప్పారు. తన పుట్టినరోజు సందర్భంగా మే 20, 2026న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేయనున్నట్లు ఆయన ధృవీకరించారు. దీనితో పాటు విడుదల చేసిన అనౌన్స్మెంట్ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇందులో ఎన్టీఆర్ గుబురు గడ్డం, కండలు తిరిగిన శరీరం, పవర్ఫుల్ లుక్స్‌తో ఒక యోధుడిలా కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ చూస్తుంటే ప్రశాంత్ నీల్ మరో భారీ యాక్షన్ విజువల్ వండర్‌ను సిద్ధం చేస్తున్నట్లు అర్థమవుతోంది.
మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తోంది. కె.జి.ఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌ను ‘డ్రాగన్’ అనే వర్కింగ్ టైటిల్‌తో పిలుస్తున్నారు. ఈ సినిమాతో ఎన్టీఆర్ మరోసారి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.