HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Smart Ration Cards In Telangana

Ration Card: తెలంగాణలో స్మార్ట్ రేషన్‌ కార్డులు

  • Author : Vamsi Chowdary Korata Date : 18-07-2026 - 11:49 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Smart Ration Cards in Telangana
Smart Ration Cards in Telangana

తెలంగాణలోని రేషన్ లబ్ధిదారులకు పారదర్శకమైన, వేగవంతమైన సేవలు అందించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సరికొత్త డిజిటల్ సంస్కరణకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా డెబిట్ కార్డు సైజులో, అత్యాధునిక క్యూఆర్ (QR) కోడ్‌తో కూడిన కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి పౌరసరఫరాల శాఖ రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే ఈ కొత్త స్మార్ట్ కార్డుల ప్రింటింగ్ ప్రక్రియ పూర్తయి, అన్ని జిల్లాల ప్రధాన కేంద్రాలకు చేరుకున్నాయి. అత్యంత నాణ్యతతో రూపొందించిన ఈ కార్డుపై కుటుంబ యజమాని ఫొటో, పేరు, పూర్తి చిరునామాతో పాటు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫొటోలను అధికారికంగా ముద్రించారు. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ సరికొత్త కార్డుల పంపిణీ కార్యక్రమం అధికారికంగా ప్రారంభం కానుంది.

ఈ సరికొత్త క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా రేషన్ పంపిణీ వ్యవస్థలో జవాబుదారీతనం మరింత పెరగనుంది. కార్డుపై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసిన వెంటనే.. సదరు లబ్ధిదారుల కుటుంబ వివరాలు, ప్రతి నెల వారు తీసుకుంటున్న రేషన్ కోటా, క్యారీ ఓవర్ బ్యాలెన్స్ వంటి పూర్తి సమాచారం కంప్యూటర్ లేదా మొబైల్ స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతుంది. దీనివల్ల రేషన్ దుకాణాల్లో జరిగే అక్రమాలకు, బినామీ కార్డుల దోపిడీకి పూర్తిగా చెక్ పడనుంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.05 కోట్ల రేషన్ కార్డులు అమల్లో ఉన్నాయి. పాత పేపర్ కార్డుల స్థానంలో రాబోతున్న ఈ స్మార్ట్ డిజిటల్ కార్డులు నిరుపేదలకు ఎంతో సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా, పర్సులో సులభంగా భద్రపరుచుకునేలా ఉండటం విశేషం.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Civil Supplies
  • CM Revanth Reddy
  • Minister Uttam Kumar Reddy
  • Ration Card Distribution
  • Smart Ration Cards Distribution
  • telangana

Related News

KTR warns CM Revanth

KTR: సీఎం రేవంత్‌కు కేటీఆర్ వార్నింగ్

తెలంగాణలో ఉద్యోగాల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం యువతను మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఎన్నికల హామీలు అమలు చేయకుండా ఉద్యోగ ‘నోటిఫికేషన్ల’ స్థానంలో ‘లూటిఫికేషన్లు’ చేస్తున్నారని విమర్శించారు. సరూర్‌నగర్‌లో నిర్వహించిన ‘యువ సంగ్రామ’ సదస్సులో మాట్లాడిన ఆయన.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘‘రేవంత్ గుర్తు పెట్

  • Good news for liquor lovers in Telangana.

    Hyderabad: తెలంగాణలో మద్యం ప్రియులకు గుడ్‌ న్యూస్‌

  • New pensions... Minister Seethakka shares good news for single women.

    Telangana Pensions: కొత్త పెన్షన్లు.. ఒంటరి మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి సీతక్క

  • Telangana government's key decision... fantastic news for Gram Panchayats...

    Telangana Govt: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. గ్రామ పంచాయతీలకు అదిరిపోయే శుభవార్త..

  • Groundwater levels falling in Telangana... Is a water crisis inevitable this summer?

    Water Scarcity: తెలంగాణలో పడిపోతున్న భూగర్భజలాలు.. ఈ వేసవిలో నీటి ఎద్దడి తప్పదా..?

Latest News

  • Joseph Ravan Remand Report: యూట్యూబర్‌ రావణ్‌కు మరోసారి రిమాండ్‌ పొడిగింపు

  • Balochistan: పాకిస్తాన్ నుండి బలూచిస్తాన్ ‘స్వాతంత్ర్యం ప్రకటించుకుంది’.. చైనా యొక్క 60 బిలియన్ డాలర్ల CPEC ప్రాజెక్టుకు అర్థం ఏమిటి?

  • Sonam Wangchuk: ‘నోటి ద్వారా లేదా IV ద్వారా మందులు వద్దు…’: చికిత్సకు ముందు కుటుంబ సభ్యుల అనుమతి తీసుకోవాలి అని సోనమ్ వాంగ్‌చుక్ భార్య డిమాండ్

  • Kuwait Desalination Plant: ఇరాన్ మొదట కువైట్ విద్యుత్, నీటి డీశాలినేషన్ ప్లాంట్ పై దాడి.. ఆపై తీవ్ర హెచ్చరిక జారీ చేసింది..

  • RAW NTR: ఎన్టీఆర్ ను కలిసే అర్హత మాకు లేదా? మేము మీడియా ముందుకు రావడానికి కారణం ఇదే!

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd