KTR Hot Comments: రేవంత్ నువ్వు నా వెంట్రుక కూడా పీకలేవు.. కేటీఆర్ సంచలన కామెంట్స్
రాష్ట్ర ప్రభుత్వం నమోదు చేసిన ఫార్ములా ఈ కేసుపైన స్పందించిన కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మేము ఉద్యమకారులం.. ఉద్యమ నాయకుడి బిడ్డలం.. ఇలాంటి అక్రమ కేసులకు అణిచివేతలకు కుట్రలకు భయపడకుండా కొట్లాడుతూనే ఉంటాం.
- By Gopichand Published Date - 11:30 PM, Thu - 19 December 24

KTR Hot Comments: ఔటర్ రింగ్ రోడ్డు టోల్ టెండర్లపై సీఎం రేవంత్ సిట్ విచారణకు ఆదేశించడంపై కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు (KTR Hot Comments) చేశారు. ‘రేవంత్ రెడ్డికి దమ్ముంటే, మగాడైతే ఫస్ట్ టెండర్ రద్దు చేయమనండి’ అని సవాల్ విసిరారు. తాము శాంతియుతంగా ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంటామని కేటీఆర్ తెలిపారు. అంతేకాకుండా తాను ఏ తప్పు చేయలేదని, రేవంత్ నువ్వు నా వెంట్రుక కూడా పీకలేడని సంచలన కామెంట్స్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం నమోదు చేసిన ఫార్ములా ఈ కేసుపైన స్పందించిన కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మేము ఉద్యమకారులం.. ఉద్యమ నాయకుడి బిడ్డలం.. ఇలాంటి అక్రమ కేసులకు అణిచివేతలకు కుట్రలకు భయపడకుండా కొట్లాడుతూనే ఉంటాం. ఈ మొత్తం వ్యవహారంలో నేను ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి న్యాయంగా కొట్లాడుతాం. కేవలం ముఖ్యమంత్రి ఆయన కుటుంబం చేస్తున్న అవినీతిని స్కాంలను ఒక్కొక్కటిగా బయటపెడుతున్నందువల్లనే మాపై రాజకీయ వేధింపులకు దిగుతున్నది ఈ ప్రభుత్వం. చట్ట ప్రకారం ముందుకు వెళ్తాము. ఈ అంశంలో మా లీగల్ సెల్ చేపట్టాల్సిన కార్యాచరణ చేపడుతుందన్నారు.
Also Read: 100 Feet NTR Statue : స్థలం మంజూరుకు సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్
శాంతియుతంగా రాష్ట్ర ప్రభుత్వం మాపైన మా పార్టీ పైన చేస్తున్న ఈ కుట్రలను ఎండగడతాం. రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని రెచ్చగొట్టాలని చూసిన ప్రజాస్వామ్యయుతంగా, న్యాయపరమైన మార్గాల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజలు ముందు నిలబెడతాం. ముఖ్యమంత్రి ఎన్ని రకాల అటెన్షన్ డైవర్షన్ పనులు చేసిన రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన 420 హామీల అమలు చేసేదాకా వదిలిపెట్టం. రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటాడుతూనే ఉంటాం. ఈరోజు నేను చెప్పిన ప్రతి మాటకి చూపించిన ప్రతి డాక్యుమెంట్ కి కట్టుబడి ఉన్నాను. కచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ మొత్తం వ్యవహారంలో భంగపాటు తప్పదని హెచ్చరించారు.
తెలంగాణ ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఆధారాలు లేకుండా అడ్డగోలుగా చేస్తున్న దుష్ప్రచారాన్ని గమనించాలని, మమ్మల్ని ఎన్నుకొని ప్రధాన ప్రతిపక్షం పాత్ర ఇచ్చిన రాష్ట్ర ప్రజలకు నిజాలు తెలియజేయాల్సి ఉన్న నేపథ్యంలోనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, తీరును రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని కుట్రలను ప్రజల ముందు ఉంచాను అని ఆయన అన్నారు. ప్రజలు నిజా నిజాలు గుర్తించి ప్రభుత్వ కుట్రలను తెలుసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యమంత్రి దివాలా కోరుతనం వల్లనే ఈ కేసు పెట్టాడు. రాష్ట్ర ప్రభుత్వం ఫార్ములా ఈ అంశంలో అవినీతి జరిగింది అని భావిస్తే అందుకు తగిన ఆధారాలు సాక్ష్యాలు ఉంటే ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీలోనే చర్చ పెట్టమని సవాలు విసురుతున్నా అని అన్నారు.