HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Revanth Reddy Has Become Chandrababus Bagman Harish Rao

Harish Rao: చంద్రబాబుకు రేవంత్ రెడ్డి బ్యాగ్ మ్యాన్ గా మారారు: హరీశ్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం తమ రాజకీయ ప్రయోజనాలకే ముందంజ వేస్తుందనీ, ప్రజల సంక్షేమాన్ని విస్మరించిందని ఆరోపించారు. ఇటీవల నీటిపారుదల శాఖపై ప్రగతి భవన్‌లో జరిగిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌పై కూడా హరీష్ రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

  • Author : Latha Suma Date : 02-07-2025 - 2:03 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Revanth Reddy has become Chandrababu's bagman: Harish Rao
Revanth Reddy has become Chandrababu's bagman: Harish Rao

Harish Rao : తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపు తిరిగేలా, బీఆర్ఎస్ పార్టీ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘బ్యాగ్ మ్యాన్’గా మారారని, రాష్ట్ర హక్కులు తాకట్టు పెట్టి, రాష్ట్ర ప్రజల అభిప్రాయాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారంటూ ఆయన తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం తమ రాజకీయ ప్రయోజనాలకే ముందంజ వేస్తుందనీ, ప్రజల సంక్షేమాన్ని విస్మరించిందని ఆరోపించారు. ఇటీవల నీటిపారుదల శాఖపై ప్రగతి భవన్‌లో జరిగిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌పై కూడా హరీష్ రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ ప్రజెంటేషన్ చూస్తే అది హైదరాబాద్‌లో కాకుండా అమరావతిలో జరిగినట్టే అనిపిస్తోందని, దాన్ని ఏపీ ప్రభుత్వం తయారు చేసిందనే అనుమానాలకు తావిస్తున్నదని ఎద్దేవా చేశారు.

Read Also: Vallabhaneni Vamsi : సుప్రీంకోర్టులో వల్లభనేని వంశీకి ఊరట

బనకచర్ల ప్రాజెక్టు విషయంలో కూడా హరీశ్ రావు విమర్శల దాడిని కొనసాగించారు. ఆ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను ప్రజెంటేషన్‌లో ప్రస్తావించకపోవడంపై మండిపడ్డారు. చంద్రబాబు చేపడుతున్న ప్రాజెక్టుల పట్ల రేవంత్ రెడ్డి గౌరవంతో చూస్తుండగా, వాటిని వ్యతిరేకిస్తూ పోరాడుతున్న బీఆర్ఎస్ మాత్రం నిర్లక్ష్యంగా చూపబడుతోందన్నదే ఆయన వాదన. బనకచర్ల కట్టే చంద్రబాబు, రేవంత్ రెడ్డికి దేవుడిలా కనిపిస్తున్నారు. అదే బనకచర్లను అడ్డుకుంటున్న బీఆర్ఎస్ మాత్రం చచ్చిన పాములా చూపిస్తున్నారు అంటూ తీవ్రంగా స్పందించారు.

బీఆర్ఎస్‌ను చచ్చిన పాముతో పోల్చడాన్ని తీవ్రంగా ఖండించిన హరీశ్ రావు అది నిజంగా చచ్చిన పాము అయితే, కాంగ్రెస్ నేతలు నిద్రలేచే ప్రతి రోజు దాని గురించే ఎందుకు మాట్లాడుతున్నారు? అని నిలదీశారు. పదకొండేళ్లుగా కేంద్రంలో అధికారంలో లేని కాంగ్రెస్ పార్టీ కూడా చచ్చిన పామేనా అని ప్రశ్నించారు. 2024లో ప్రజాభవన్ వేదికగా రేవంత్ రెడ్డి, బెజవాడ వేదికగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపారని హరీశ్ రావు ఆరోపించారు. ఆ తరువాత నవంబర్ 15, డిసెంబర్‌లో ఏపీ సీఎం చంద్రబాబు, బనకచర్ల ప్రాజెక్టు కోసం కేంద్రానికి లేఖలు రాసిన విషయాన్ని ప్రస్తావించారు. అయితే ఆ విషయాలపై రేవంత్ రెడ్డి ఇప్పటికీ మౌనంగా ఉండటం అనుమానాలకు తావిస్తోందని విమర్శించారు.

ఈ కుట్రను తాను ఇప్పటికే 2024 జనవరిలో వెలికితీశానని, ఆ తరువాతే తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తేడా తేదీ పెట్టి కేంద్రానికి లేఖ రాశారని అన్నారు. బీఆర్ఎస్ చేపట్టిన నిరంతర పోరాటం వల్లే బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించిన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (టీఓఆర్) ప్రక్రియ తాత్కాలికంగా నిలిపివేయబడిందని హరీశ్ స్పష్టం చేశారు. అపెక్స్ కమిటీ సమావేశంలో బనకచర్ల అంశం చర్చకు రాలేదని, కేవలం సముద్రంలోకి వృథాగా పోతున్న 3000 టీఎంసీల నీటిపై మాత్రమే చర్చ జరిగిందన్నారు. నదీ జలాలపై సీఎం రేవంత్‌కు కనీస అవగాహన లేదని, అహంకారంతో మాట్లాడితే ప్రజలు అదృష్టాన్ని కాదు, అతినిందనని ఇచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. హరీశ్ రావు ఆరోపణలతో తెలంగాణ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. బనకచర్ల ప్రాజెక్టు అంశం ద్వారా తెలంగాణ-ఆంధ్ర రాజకీయాల్లో మళ్లీ ఉద్రిక్తతలు రాజుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి.

Read Also:  Pathamailaram : పాశమైలారం ఘటన.. మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం: సిగాచీ పరిశ్రమ

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • Banakacherla Project
  • brs
  • chandrababu naidu
  • congress
  • harish rao
  • revanth reddy
  • telangana

Related News

Kavitha

KCR సభపై కవిత దారుణమైన కామెంట్స్

జగిత్యాల వేదికగా జరిగిన సభలో కేసీఆర్ ప్రసంగాన్ని ఉద్దేశించి కవిత తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రైతాంగ సమస్యలు, నిరుద్యోగం వంటి అనేక జ్వలంత సమస్యలు ఉన్నప్పటికీ, అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు ప్రజలను

  • Jeevan Reddy Brs

    BRS : భారీ సైన్యం తో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి

  • Harish Rao Pm

    KCR Meeting In Jagtial : కెసిఆర్ సభకు హరీష్ రావు దూరం !!

  • Harish Rao Kmm

    Khammam : ఖమ్మం జిల్లా మంత్రులపై ఘాటైన వ్యాఖ్యలు చేసిన హరీష్ రావు

  • Pig Gives Birth To Elephant

    పంది కడుపున ఏనుగు పిల్ల.. అసలు నిజం ఇదీ!

Latest News

  • నేడు ర‌స‌వ‌త్త‌ర పోరు.. స‌న్‌రైజ‌ర్స్ విజ‌యాల‌కు ఢిల్లీ బ్రేక్ వేయ‌గ‌ల‌దా?

  • IPL: ‘పవర్’ప్లే లో ఎక్కువ సిక్సర్లు బాదిన ప్లేయర్లు వీరే..!!

  • Cake : వామ్మో ఒక్క కేక్ తయారీకి 3,500 గంటల సమయం!

  • ప్రధాని మోదీకి ఉల్లిపాయలు ఇష్టమేనా?

  • నేపాల్ వెళ్తున్నారా? జాగ్రత్త! రూ. 63 దాటితే చాలు ట్యాక్స్ కట్టాల్సిందే!

Trending News

    • అమెరికా-ఇరాన్ మధ్య రేపే రెండో రౌండ్ చర్చలు.. రంగంలోకి ట్రంప్?

    • పాత ఉద్యోగం పోయె.. కొత్త ఆఫర్ వెనక్కి తీసుకెళ్లె! సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆవేదన

    • మారుతున్న శాలరీ స్ట్రక్చర్.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

    • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd