CS Instructions: ప్రజాపాలన- ప్రజా విజావిజయోత్సవాల ముగింపు వేడుకలు.. సీఎస్ కీలక ఆదేశాలు
ప్రముఖ సంగీత కళాకారులు వందేమాతరం శ్రీనివాస్, రాహుల్ సిప్లీగంజ్, ప్రముఖ సినీ సంఘీత దర్శకులు థమన్ ల సంగీత కార్యక్రమాలకు పెద్ద సంఖ్యలో అభిమానులు హాజరయ్యే అవకాశం ఉన్నందున వేదికల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు.
- By Gopichand Published Date - 10:03 PM, Fri - 6 December 24

CS Instructions: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన- ప్రజా విజావిజయోత్సవాల ముగింపు వేడుకల సందర్భంగా డిసెంబర్ 7, 8, 9 తేదీలలో జరిగే కార్యక్రమాలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి (CS Instructions) అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో ముగింపు వేడుకల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. మూడు రోజులు జరిగే కార్యక్రమాలపై ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాల ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని సమాచార పౌరసంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ హరీష్ ను ఆదేశించారు.
మూడు రోజుల పాటు జరిగే ఈ ముగింపు వేడుకలకు ప్రముఖులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉన్నందున పారిశుధ్యం, తాగునీరు, టాయిలెట్స్ మొదలగు మౌళిక వసతుల ఏర్పాటుపై ప్రత్యేక శ్రద్ద వహించాలన్నారు. ఎక్కడ ఎలాంటి సమస్యలు రాకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ట్యాంక్ బండ్ వద్ద 8 వ తేదీన జరిగే ఎయిర్ షోకు భారత వైమానిక దళం అధికారుల సమన్వయంతో ఏర్పాట్లు చేయాలన్నారు. 9వ తేదీన ట్యాంక్ బండ్ పై నిర్వహించే డ్రోన్ షో కూ ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు.
Also Read: Degradable Plastic: హైగ్రేడ్ బయో డిగ్రేడబుల్ ప్లాస్టిక్‌ను ఆవిష్కరించిన కేంద్ర మంత్రి
ప్రముఖ సంగీత కళాకారులు వందేమాతరం శ్రీనివాస్, రాహుల్ సిప్లీగంజ్, ప్రముఖ సినీ సంఘీత దర్శకులు థమన్ ల సంగీత కార్యక్రమాలకు పెద్ద సంఖ్యలో అభిమానులు హాజరయ్యే అవకాశం ఉన్నందున వేదికల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. కళాకారుల సౌకర్యార్ధం వారికి ప్రత్యేక గ్రీన్ రూం ఏర్పాటుతో పాటు ఇతర సదుపాయాలు కల్పించాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమాలను అందరూ వీక్షించేందుకు వీలుగా రోడ్డుకు ఇరు వైపులా ఎల్ ఈ డి స్క్రీన్ లను ఏర్పాటు చేయాలన్నారు.
డిసెంబర్ 9వ తేదీన సచివాలయ ప్రాంగణంలో జరిగే తెలంగాణ తల్లి విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమం, బహిరంగ సభలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. బహిరంగ సభకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో పాటు, మంత్రులు, ప్రముకులు, ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉన్నందున ప్రత్యేక భద్రతా ఏర్పాట్లను చేయాలన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, ప్రభుత్వ సలహాదారు శ్రీనివాస రాజు, హోమ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవి గుప్తా, డీజీపీ జితేందర్, మున్పిపల్ శాఖ ప్రత్యేక కార్యదర్శి దాన కిషోర్, జీఏడి కార్యదర్శి రఘునందర్ రావు, జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి, సెర్ప్ సీఈఓ దివ్య, సమాచార పౌరసంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ హరీశ్, మెట్రో వాటర్ వర్క్స ఎండీ అశోక్ రెడ్డి, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరిక్రిష్ణ, వైమానిక దళ అధికారులు పాల్గొన్నారు.