HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Union Minister Launched High Grade Bio Degradable Plastic

Degradable Plastic: హైగ్రేడ్ బయో డిగ్రేడబుల్ ప్లాస్టిక్‌ను ఆవిష్కరించిన కేంద్ర మంత్రి

ఒక్కసారి వాడి వ్యర్థాలుగా పారేసే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ స్థానాన్ని ఈ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ భర్తీ చేసేలా, పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇటువంటి పరిశోధనలను ప్రోత్సహిస్తున్నామని కేంద్ర మంత్రి డా. జితేంద్ర సింగ్ ఈ సందర్భంగా అన్నారు.

  • Author : Gopichand Date : 06-12-2024 - 9:54 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Degradable Plastic
Degradable Plastic

Degradable Plastic: హైగ్రేడ్ బయో డిగ్రేడబుల్ ప్లాస్టిక్‌ (Degradable Plastic)ను కేంద్ర మంత్రి జితేంద్రసింగ్, రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబులు ఆవిష్క‌రించారు. గ్రీన్ వర్క్స్ బయో అనే సంస్థ హబ్సిగూడలోని సిఎస్ ఐఆర్-ఐఐసిటి సాంకేతిక సహకారంతో రూపొందించిన జీవ శైథిల్య (మట్టిలో కలిసిపోయే) ప్లాస్టిక్ ఉత్పత్తులను కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజి మంత్రి డా. జితేంద్ర సింగ్, రాష్ట్ర పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబులు సంయుక్తంగా ఆవిష్కరించారు. ఈ జీవ శైథిల్య ప్లాస్టిక్‌తో ఇళ్లలో ఉపయోగించే టేబుల్ వేర్, పరిశ్రమల అవసరాలకు తగిన విధంగా తయారు చేసిన ఉత్పత్తులను గ్రీన్ వర్క్స్ బయో మార్కెట్లోకి ప్రవేశ పెడుతుంది.

ఒక్కసారి వాడి వ్యర్థాలుగా పారేసే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ స్థానాన్ని ఈ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ భర్తీ చేసేలా, పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇటువంటి పరిశోధనలను ప్రోత్సహిస్తున్నామని కేంద్ర మంత్రి డా. జితేంద్ర సింగ్ ఈ సందర్భంగా అన్నారు. ఒక్కసారి మాత్రమే ఉపయోగపడే సింగల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల తీవ్ర మైన కాలుష్య సమస్య ఉత్పన్నమవుతోందని ఆయన వెల్లడించారు. సంప్రదాయ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి సుస్థిరాభివృద్ధి వైపు పయనించడానికి నూతన ఆవిష్కరణలు తోడ్పడతాయని ఆయన తెలిపారు.

Also Read: Mohammed Siraj: మహ్మద్ సిరాజ్ గంటకు 181.6 కిలోమీటర్ల వేగంతో బంతిని వేశాడా? నిజం ఇదే!

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. కాలుష్య రహిత ఉత్పత్తుల పరిశోధనలను తెలంగాణా రాష్ట్రం ప్రోత్సహిస్తోందని తెలిపారు. ఐక్యరాజ్య సమితి తీర్మానాల మేరకు పర్యావరణానికి పెను ప్రమాదంగా పరిణమించిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరముందని చెప్పారు. అందులో భాగంగా బయో డిగ్రేడబుల్ ప్లాస్టిక్ ఉత్పత్తులు పెద్ద ఎత్తున అందుబాటులోకి రావాలని ఆకాక్షించారు. ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు గ్రీన్ వర్క్స్ బయో లాంటి సంస్థలు ముందుకు రావడం అభినందనీయమని శ్రీధర్ బాబు ప్రశంసించారు. బయో ప్లాస్టిక్స్ వినియోగం అన్ని రంగాల్లో అవసరమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఎస్ ఐఆర్-ఐఐసిటి డైరెక్టర్ డా. డి. శ్రీనివాస రెడ్డి గ్రీన్ బయోవర్క్స్ డైరెక్టర్ రిషికారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hyderabad
  • Minister Sridhar Babu
  • telangana
  • telugu news
  • Union Minister Jitendra Singh

Related News

Rajya Sabha Elections

Breaking News రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల

Rajya Sabha Elections : రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. తెలంగాణలోని రెండు స్థానాలు సహా 10 రాష్ట్రాల్లో 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 26వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్, మార్చి 16న ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపింది. తెలంగాణ నుంచి సురేశ్ రెడ్డి, అభిషేక్ సింఘ్వీలతో పాటు 37 మంది పదవీ కాలం ఏప్రిల్ నెలతో ముగియనుంది. మహారాష్ట్రలో 7, ఒడిశా 4, తమిళనాడు 6, పశ్చిమ

  • Vijayendra Prasad

    మా పూర్వీకులు భయంకరమైన తప్పు చేశారు.. క్షమించండి: విజయేంద్రప్రసాద్‌

  • Engineering Students Telang

    Engineering Students : ప్రైవేటు ఇంజినీరింగ్ స్టూడెంట్స్ కు బిగ్ షాక్..భారీగా పెరిగిన ఫీజులు

  • New Holland Launches 'workm

    తెలంగాణ మార్కెట్లోకి ‘వర్క్‌మాస్టర్ 105’ ట్రాక్టర్‌

  • Half Day Schools

    Half-Day Schools: తెలంగాణ లో ఒంటిపూట బడులు ఎప్పటి నుండి అంటే ..!!

Latest News

  • టీ20 వరల్డ్ కప్ 2026.. నెదర్లాండ్స్‌పై భారత్ ఘనవిజయం!

  • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

  • భార‌త్ వ‌ర్సెస్ నెద‌ర్లాండ్స్ మ్యాచ్‌.. క్యాచ్ ఎలా ప‌ట్టాడో చూశారా?!

  • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

  • తిరుమల నెయ్యి టెండర్లపై ‘వైసీపీ’ దుష్ప్రచారం.. వాస్తవాలను వెల్లడించిన టీటీడీ చైర్మన్!

Trending News

    • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

    • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

    • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

    • ఆధార్ కార్డ్‌లో భారీ మార్పులు.. ఏంటంటే?

    • సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన ఇండియా-ఏ.. పాక్‌తో ఫైన‌ల్ మ్యాచ్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd