HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Priyanka Gandhi Invites Ys Sharmila

YS Sharmila: షర్మిలపై’ DK’ ఆపరేషన్! త్వరలో ప్రియాంకతో భేటీ?

కాంగ్రెస్ (Congress) పార్టీ తెలుగు రాష్ట్రాల మీద సీక్రెట్ ఆపరేషన్ చేస్తుంది. స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి సన్నిహితుడు డీకే శివకుమార్ రంగంలోకి దిగినట్టు సమాచారం .

  • Author : CS Rao Date : 21-05-2023 - 5:57 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
YS Sharmila
E4e8be15c9

YS Sharmila: కాంగ్రెస్ పార్టీ తెలుగు రాష్ట్రాల మీద సీక్రెట్ ఆపరేషన్ చేస్తుంది. స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి సన్నిహితుడు డీకే శివకుమార్ (DK Shivakumar) రంగంలోకి దిగినట్టు సమాచారం . కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిన వెంటనే డీకే శివకుమార్ కష్టం ఫలించిందిని షర్మిల కితాబు ఇచ్చారు. ఆ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీకి దగ్గర అవుతుందని ప్రచారం మొదలయింది. పూర్వం నుంచి కాంగ్రెస్ అధిష్టానం తో వై ఎస్ కుటుంబం సన్నిహితంగా ఉండేది. క్విడ్ ప్రో కో వ్యవహారం జగన్ రూపంలో బయటకు వచ్చిన తరువాత కాంగ్రెస్ పార్టీకి దూరంగా వై ఎస్ కుటుంబం ఉంటుంది. అయితే ఇప్పుడు మారిన పరిస్తుతుల దృష్ట్యా కాంగ్రెస్ వైపు షర్మిల, విజయమ్మ దగ్గర అవుతున్నారని వినికిడి. దానికి బ్రదర్ అనిల్ ఇప్పటికే ఢిల్లీతో సంప్రదింపులు జరిపారని తెలుస్తుంది.

కర్నాటకలో ప్రియాంక (Priyanka Gandhi) కాంగ్రెస్ కోసం పెద్ద ఎత్తున ప్రచారం చేసి గెలిపించారు.ఇపుడు ఆమె చూపు రెండు తెలుగు రాష్ట్రాల మీద ఉంది. ఏపీలో కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అంతా వైసీపీ వైపు వెళ్ళిపోయింది. అందువల్ల వైఎస్సార్ లెగసీ కూడా జగన్తోనే ఉంది. ఇపుడు అందులో చీలిక తెచ్చి వైఎస్సార్ కుమార్తెను ఏపీలో ఉంచి కాంగ్రెస్ పార్టీని మళ్లీ బలోపేతం చేయడానికి కాంగ్రెస్ హై కమాండ్ మాస్టర్ ప్లాన్ వేసిందని సోషల్ మీడియాలో న్యూస్ హల్చల్ చేస్తోంది. ఈ ప్రచారంలో నిజమెంత ఉందో తెలియదు కానీ కర్నాటక విజయంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ జెండాను గట్టిగా ఏగరేయడానికి కాంగ్రెస్ నిర్ణయించుకున్నట్లే కనిపిస్తోంది. ఆ క్రమంలో షర్మిల పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారని ప్రచారం మొదలైంది. కానీ ఆమె దీనిని మీడియా మీటింగ్ పెట్టి మరీ ఖండించారు. ఈ నేపధ్యంలో మరో బిగ్ న్యూస్ బయటకు వచ్చింది. అదేంటి అంటే కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంకా గాంధీతో వైఎస్ షర్మిల సుదీర్ఘంగా ఫోన్ సంభాషణ జరిపినట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. షర్మిలను కాంగ్రెస్ లోకి ప్రియాంకా ఆహ్వానించినట్లుగా ప్రచారం అయితే సాగుతోంది. అయితే తన పార్టీని కాంగ్రెస్ లో విలీనాన్నికి షర్మిల నో చెప్పినట్లుగా తెలుస్తుంది.అదే టైం లో ప్రియాంకా గాంధీ షర్మిలను ఏపీకి వెళ్లమని కోరినట్లుగా వినికిడి.

తెలంగాణాలో వైఎస్సార్టీపీకి (YSRTP) ఓట్ల శాతం పెద్దగా లేదని అదే ఏపీలో అయితే వైఎస్సార్ లెగసీ ఉందని, అక్కడ వర్కౌట్ అయితే కనుక కాంగ్రెస్ మళ్లీ పుంజుకోవడమే కాకుండా షర్మిలకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని ప్రియాంకా గాంధీ ఆలోచనగా చెప్పినట్లుగా ప్రచారం అయితే సాగుతోంది.ఆందుకు షర్మిల కనుక ఒప్పుకుంటే ఆమెకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు ఇస్తామని కూడా ప్రియాంకాగాంధీ ప్రతిపాదన పెట్టినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ విషయంలో విభేదిస్తున్న షర్మిల తనకు తెలంగాణాలోనే పగ్గాలు కావాలని పట్టుబట్టారని అంటున్నారు. అంతే కాకుండా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో ఏ రకంగానూ లింక్ పెట్టవద్దు అని కూడా కోరారని టాక్ .

ఇది ప్రాధమికంగా జరిగిన టాక్ అని తొందరలోనే ప్రియాంకా గాంధీ వైఎస్ షర్మిల (YS Sharmila) ఫ్యామిలీతో గెట్ టుగెదర్ పెట్టి అన్ని విషయాలను జాగ్రత్తగా చర్చిస్తారు అని అంటున్నారు. మరి ఈ డిస్కషన్ లో ఏమి తేలుతుందో కానీ మరో వైపు చూస్తే తెలంగాణా రాజకీయం చేయాలని చూస్తున్న షర్మిల ఖమ్మం ఎంపీగా కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తారని అంటున్నారు. ఇవన్నీ పుకార్లుగానే బయటకు వస్తున్నా రాజకీయాల్లో నిప్పు లేనిదే పొగరాదని అంటున్నారు. ఇక ఇటీవల కర్నాటకలో కాంగ్రెస్ ని విజయపధంలో నడిపించిన డీకే శివకుమార్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ట్రబుల్ షూటర్ గా ఉన్నారు. ఆయన మీద తెలుగు రాష్ట్రలా బాధ్యతలను కాంగ్రెస్ హై కమాండ్ పెట్టినట్లుగా తెలుస్తోంది.
కాంగ్రెస్ కర్నాటకలో గెలిచిన వెంటనే షర్మిల బెంగళూరుకి వెళ్ళి మరీ డీకే తో భేటీ అయ్యారు. ఇక షర్మిలను కాంగ్రెస్ గూటికి చేర్చే బాధ్యతను డీకే తన భుజాల మీద వేసుకున్నారు అని అంటున్నారు. ఆయనే అటు హై కమాండ్ కి ఇటు షర్మిలకు మధ్య మధ్యవర్తిత్వం వహిస్తున్నారని టాక్. (Telangana Politics)

షర్మిల పార్టీకి జనాదరణ పెద్దగా కనిపించడంలేదు. ఆమె ఆరాటం పోరాటమే కానీ రాజకీయ పార్టీ విస్తరించినదీ లేదు జనాలకు చేరువ అయినది లేదు మరి ఈ ఏడాది చివరలో తెలంగాణాలో ఎన్నికలు ఉన్నాయి. తెలంగాణా ఎన్నికల్లో షర్మిల పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందా అనే డౌట్లు అయితే ఉన్నాయి. అలా పోటీ చేస్తే అస్తిత్వం పూర్తిగా లేకుండా పోతుందిఆమె రాజకీయాల్లో ఉన్నారు. ఒక పార్టీని పెట్టి మరీ రెండెళ్ళుగా తెలంగాణాలో కలియ తిరుగుతున్నారు. షర్మిల వైఎస్సార్టీపీని పెట్టి మూడు వేల అయిదు వందల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసినా పార్టీ ఏ మాత్రం పాపులర్ కాలేదు. దీంతో ప్లాన్ బీ వైపు షర్మిల కూడా చూస్తున్నారని తెలుస్తుంది.

Read More: Kishan Reddy: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు మారబోతున్నారా?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • DK Shivakumar
  • phone call
  • Political Operation
  • Priyanka gandhi
  • telangana politics
  • ys jagan
  • ys sharmila

Related News

Lokesh Foreign Tour

ఏపీ అభివృద్ధికి జగన్ అడ్డు వస్తున్నాడు – లోకేష్ సంచలన ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామికాభివృద్ధి మరియు ఐటీ రంగ విస్తరణ లక్ష్యంగా వస్తున్న ప్రాజెక్టులపై రాజకీయ దుమారం రేగుతోంది. మంత్రి నారా లోకేష్ తాజాగా సోషల్ మీడియా వేదికగా చేసిన ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

  • YS Jagan to meet Governor today with one crore signatures

    కోటి సంతకాలతో నేడు గవర్నర్‌ను కలవనున్న వైఎస్ జగన్

  • KTR

    కేటీఆర్ వెనుకబడిన ఆలోచనలతోనే బీఆర్‌ఎస్ పతనం.. కాంగ్రెస్ ఫైర్

  • Lok Sabha

    లోక్‌స‌భ‌లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మారుస్తూ బిల్లు!

  • Priyanka Be Given The Respo

    ప్రియాంక చేతికి ఏఐసీసీ అధ్యక్ష బాధ్యతలు?

Latest News

  • టీమిండియాకు ఎంపిక కాక‌పోవ‌టంపై ఇషాన్ కిష‌న్ కీల‌క వ్యాఖ్య‌లు!

  • 2025లో గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేయబడిన టాప్-10 భారతీయ క్రికెటర్లు వీరే!

  • MGNREGA పథకం మార్పు పై రాహుల్ సంచలన వ్యాఖ్యలు

  • అవతార్-3 మూవీ ఎలా ఉందంటే !!

  • టీం ఇండియా హెడ్ కోచ్ పై కపిల్‌ దేవ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. అసలు గంభీర్‌ కోచ్‌ కాదు!

Trending News

    • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

    • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

    • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

    • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

    • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd