HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Prajapalana Victory Celebrations Schedule

Prajapalana Victory Celebrations : ప్రజా విజయోత్సవాల షెడ్యూల్ ..

Prajapalana Vijayotsavam Celebrations : ప్రజా విజయోత్సవాల్లో భాగంగా డిసెంబరు 1 నుంచి 9 వరకు వివిధ కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్​ను విడుదల చేసింది.

  • Author : Sudheer Date : 29-11-2024 - 1:04 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Praja Palana Vijayotsavam C
Praja Palana Vijayotsavam C

తెలంగాణ(Telangana) లో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) అధికారంలోకి వచ్చి డిసెంబర్ 7వ తేదీతో సంవత్సరం పూర్తి చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన విజయోత్సవాలను(Prajapalana Victory Celebrations) ఘనంగా నిర్వహించబోతుంది. ఇప్పటికే ఈ మేరకు అన్నీ ఏర్పాట్లు చేయాలని పరిశ్రమల శాఖను ఆదేశించింది. ప్రజా విజయోత్సవాల్లో భాగంగా డిసెంబరు 1 నుంచి 9 వరకు వివిధ కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్​ను విడుదల చేసింది.

డిసెంబరు 1 : విద్యాశాఖకు సంబంధించిన ఇంటిగ్రేటెడ్​ రెసిడెన్షియల్​ పాఠశాలల రెండో దశకు శంకుస్థాపన చేస్తారు. సీఎం కప్​ 2024 పోటీలను ప్రారంభిస్తారు. ఈ పోటీలు డిసెంబరు 1 నుంచి 8వ తేదీ వరకు జరగనున్నాయి.

డిసెంబరు 2 : 16 నర్సింగ్​, 28 పారా మెడికల్​ కాలేజీలను ప్రారంభిస్తారు. అలాగే 213 కొత్త అంబులెన్స్​లను ప్రారంభించనుండా 33 ట్రాన్స్​జెండర్​ క్లినిక్​లను ప్రారంభిస్తారు. ట్రాఫిక్​ వాలంటీర్లుగా ట్రాన్స్​జెండర్ల పైలట్​ ప్రాజెక్టు చేపట్టనున్నారు.

డిసెంబరు 3 : హైదరాబాద్​ రైజింగ్​ కార్యక్రమంతో పాటు ఆరాంఘర్​-జూపార్క్​ ఫ్లైఓవర్​ను ప్రారంభిస్తారు. రూ.150 కోట్లతో చేపట్టిన సుందరీకరణ పనులను ప్రారంభించనున్నారు.

డిసెంబరు 4 : వర్చువల్​ సఫారీ, వృక్ష పరిచయం కేంద్రం ప్రారంభించనున్నారు. తెలంగాణ ఫారెస్ట్​ డెవలప్​మెంట్​ కార్పొరేషన్​ భవనానికి శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత సుమారు 9007 మందికి నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం చేయనున్నారు.(అటవీ శాఖ కార్యక్రమాలు)

డిసెంబరు 5న మహిళాభివృద్ధి కార్యక్రమాలు :

స్వయం సహాయక గ్రూపుల్లో చర్చలు
ఇందిరా మహిళా శక్తి బజార్‌ ప్రారంభం
మేడ్చల్, మల్లేపల్లి, నల్గొండలో అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్ల ప్రారంభోత్సవం
ఘట్‌కేసర్‌లో బాలికల ఐటీఐ కాలేజీ ప్రారంభం

డిసెంబరు 6న విద్యుత్‌ రంగానికి సంబంధించిన కార్యక్రమాలు :

యాదాద్రి పవర్‌ ప్లాంట్‌లో విద్యుదుత్పత్తి ప్రారంభం
244 విద్యుత్‌ ఉపకేంద్రాల శంకుస్థాపన

డిసెంబరు 7న విపత్తు నివారణ :

స్టేట్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ ప్రారంభం
మూడురోజుల పాటు తెలంగాణ కళా ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు
పోలీస్‌ బ్యాండ్‌ ప్రదర్శన

డిసెంబరు 8న స్పోర్ట్స్‌ వర్సిటీ :

డిసెంబరు 8వ తేదీన 7 ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ప్రాజెక్టుల ప్రారంభం
ఏఐ సిటీకి భూమి పూజ
130 కొత్త మీ సేవల ప్రారంభం
యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ యూనివర్సిటీకి శంకుస్థాపన

డిసెంబరు 9 : లక్షల మంది మహిళా శక్తి సభ్యుల సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేయనున్నారు. ట్యాంక్​బండ్​ మీద ప్రజాపాలన-ప్రజా విజయోత్సవాలు ముగింపు వేడుకలు నిర్వహించనున్నారు. సాయంత్రం డ్రోన్​ షో, ఫైర్​ వర్క్స్, ఆర్ట్​ గ్యాలరీ, వివిధ స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు.

Read Also : Illegally Transport : కాకినాడ పోర్టులో పవన్‌ కల్యాణ్‌ తనిఖీలు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Revanth Reddy
  • congress
  • prajapalana
  • Prajapalana Vijayotsavam Celebrations
  • telangana

Related News

Survey

ఇప్పుడు ఎన్నికలు జరిగితే దేశంలో ఎవరి ప్రభుత్వం ఏర్పడుతుందో తెలుసా?

గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి కొంత ఎదురుదెబ్బ తగిలింది. ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడినప్పటికీ బీజేపీ ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు.

  • Huge Demand for Goats and Chickens at Medaram

    మేడారం జాతరలో మేకలు, కోళ్లకు ఫుల్ డిమాండ్.. భారీగా పెరిగిన ధరలు

  • New twist in Nayeem's disproportionate assets case.. ED chargesheet in court

    నయీం అక్రమాస్తుల కేసులో కొత్త మలుపు.. కోర్టులో ఈడీ ఛార్జిషీట్

  • Medaram Sammakka Saralamma Maha jatara begins

    వనదేవతల కొలువుకు వేళాయె..మేడారంలో ఈ 4 రోజులు ఏ రోజు ఏం జరుగుతుంది?

  • Municipal Elections In Tela

    తెలంగాణ వ్యాప్తంగా అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్

Latest News

  • భారత్- న్యూజిలాండ్ 5వ టీ20.. వాతావ‌ర‌ణం ఎలా ఉంటుందంటే?!

  • పీఎం కిసాన్ ప‌థ‌కం 22వ వాయిదా విడుదల ఎప్పుడంటే?!

  • భార‌త్‌- పాక్ మ్యాచ్‌పై శ్రీలంక ప్రత్యేక దృష్టి!

  • నంది నగర్ నివాసంలోనే కేసీఆర్ విచారణ!

  • అంజనాదేవి పుట్టిన రోజు సందర్బంగా పవన్ దత్తత

Trending News

    • ఆర్థిక సర్వేను ప్ర‌వేశ పెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి.. జీడీపీ అంచ‌నా ఎంతంటే?!

    • బంగారం పై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన..ఏకంగా రూ. 12 లక్షల కోట్లు..!

    • రిటైర్మెంట్‌పై యువరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్య‌లు!

    • జాతీయ రహదారులపై నిర్మలా సీతారామన్ సంచలనం

    • యూపీఐ ద్వారా డబ్బు కట్ అయి, పేమెంట్ ఫెయిల్ అయితే ఏం జరుగుతుంది?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd