HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Pm Modi To Virtually Flag Off Secunderabad Visakhapatnam Vande Bharat Express On 15 January

Vande Bharat Express: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఈనెల 15 నుంచే సికింద్రాబాద్ నుంచి వందేభారత్ రైలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు సంక్రాంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక కానుకలను అందించనున్నారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ కంటే నాలుగు రోజుల ముందుగానే సికింద్రాబాద్ - విశాఖపట్నంల మధ్య వందే భారత్ రైలు (Vande Bharat Express) పరుగులు పెట్టనుంది.

  • By Gopichand Published Date - 11:54 AM, Thu - 12 January 23
  • daily-hunt
Vande Bharat Express
Vande Bharat Exp

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు సంక్రాంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక కానుకను అందించనున్నారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ కంటే నాలుగు రోజుల ముందుగానే సికింద్రాబాద్ – విశాఖపట్నంల మధ్య వందే భారత్ రైలు (Vande Bharat Express) పరుగులు పెట్టనుంది. జనవరి 15న సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య వందేభారత్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభిస్తారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొంటుండగా.. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కిషన్ రెడ్డిలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ప్రారంభ కార్యక్రమానికి ప్రత్యక్షంగా హాజరుకానున్నారు.

దేశంలో ఇది ఎనిమిదో వందే భారత్ రైలు. ఇది సికింద్రాబాద్- విశాఖపట్నంల మధ్య సుమారు ఎనిమిది గంటల్లో ప్రయాణాన్ని పూర్తి చేస్తుంది. రైలుకు స్టాప్‌లలో వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి రైల్వే స్టేష్టన్లు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల మధ్య నడిచే వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. మొత్తం 1,128 మంది ప్రయాణికులు కూర్చునే సామర్థ్యం ఉంది.

A Sankranti gift to the People of Telangana & Andhra Pradesh!

In a major boost to rail connectivity in both the states, Hon'ble PM Shri @narendramodi will virtually flag off the 8th Vande Bharat Train from Secunderabad Railway Station.

📆 15th Jan, 2023
⌚ 10:00 am pic.twitter.com/dvGaJWP9xm

— G Kishan Reddy (@kishanreddybjp) January 11, 2023

52 మంది కూర్చునే మొదటి శ్రేణి కోచ్‌లు రెండున్నాయి. కోచ్‌ పొడవు 23 మీటర్లు. ప్రత్యేకంగా స్లైడింగ్‌ డోర్లు, అటెండెంట్‌ కాల్‌ బటన్లు, ఆటోమెటిక్‌ ఎగ్జిట్‌, ఎంట్రీ డోర్లు, సీసీటీవీ, పడుకునే సౌకర్యం కలిగిన కుర్చీలు ఉన్నాయి. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో స్వదేశీంగా అభివృద్ధి చేయబడిన రైలు ఢీకొనడం నివారించే వ్యవస్థ – కవాచ్‌తో సహా అధునాతన అత్యాధునిక భద్రతా ఫీచర్లు ఉన్నాయి. ఇది కేవలం 52 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. గరిష్టంగా గంటకు 180 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 15 January
  • andhra pradesh
  • pm modi
  • Secunderabad-Visakhapatnam
  • telangana
  • Vande Bharat Express

Related News

Andhra Pradesh

Andhra Pradesh: భారత్‌లో పెట్టుబడులకు అత్యుత్తమ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్: సీఎం చంద్రబాబు

2026 జనవరి నాటికి ఏపీ రాజధాని అమరావతిలో క్వాంటం కంప్యూటర్ పని చేయడం ప్రారంభిస్తుందని, ఆ తర్వాత రెండేళ్లలో క్వాంటం కంప్యూటర్ పరికరాలను ఉత్పత్తి చేసే స్థాయికి చేరుకుంటామని సీఎం తెలిపారు.

  • Uttam Kumar Reddy

    Uttam Kumar Reddy: వరి కొనుగోళ్లలో రికార్డుకు తెలంగాణ సన్నాహాలు.. కేంద్రం మద్దతు కోరిన ఉత్తమ్ కుమార్ రెడ్డి!

  • Local Body Elections Focus

    Local Body Elections Telangana : ఎన్నికల్లో ఖర్చు చేయాలా? వద్దా? అనే అయోమయంలో నేతలు

  • Kavitha

    Kavitha: నా వెనక ఏ జాతీయ పార్టీ లేదు.. కవిత సంచలన వ్యాఖ్యలు!

  • Bathukamma

    Bathukamma: గిన్నిస్ రికార్డు సాధించిన తెలంగాణ బతుకమ్మ!

Latest News

  • Small Cars: CAFE నిబంధనలు సవరణ.. చిన్న కార్లకు ఉపశమనం!

  • Daughter Killed Her Mother : ట్యాబ్లెట్లు వేసుకోలేదనే కోపంతో కన్న తల్లిని చంపిన కూతురు

  • Sajjanar Warning : వచ్చి రావడంతోనే వీఐపీలకు వార్నింగ్ ఇచ్చిన సజ్జనార్

  • Toilet: మ‌న ఇంట్లో టాయిలెట్ కంటే మురికిగా ఉండే 5 వ‌స్తువులీవే!

  • SBI కార్డ్ కొత్త ఛార్జీలు.. తెలుసుకోకపోతే మీ బ్యాంకు ఖాతా ఖాళీ !!

Trending News

    • Arattai App: ట్రెండింగ్‌లో అరట్టై.. ఈ యాప్ సీఈవో సంపాద‌న ఎంతో తెలుసా?

    • Suryakumar Yadav: చ‌ర్చ‌నీయాంశంగా సూర్య‌కుమార్ యాద‌వ్ వాచ్‌.. ధ‌ర ఎంతంటే?

    • Donald Trump: ట్రంప్ మరో సంచ‌ల‌న నిర్ణ‌యం.. సినిమాల‌పై 100 శాతం టారిఫ్‌!

    • Speed Post: 13 సంవ‌త్స‌రాల త‌ర్వాత స్పీడ్ పోస్ట్‌లో భారీ మార్పులు!

    • India: ఐసీసీ టోర్న‌మెంట్ల నుండి టీమిండియాను స‌స్పెండ్ చేయాలి: పాక్ మాజీ ఆట‌గాడు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd