HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Pm Modi To Launch Vande Bharat Express In Telangana

PM Narendra Modi: తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోదీ.. ఎందుకంటే..?

ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఈ నెలలోనే తెలంగాణకు రానున్నట్లుగా తెలుస్తోంది.ప్రధాని మోదీ ఈ నెల 19 లేదా 20 తేదీల్లో హైదరాబాద్ వచ్చే అవకాశం ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (Vande Bharat Express) రైలు తెలంగాణలో ప్రారంభం కానుంది.

  • Author : Gopi Date : 08-01-2023 - 7:50 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Modi Vazag
Modi Vazag

ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఈ నెలలోనే తెలంగాణకు రానున్నట్లుగా తెలుస్తోంది.ప్రధాని మోదీ ఈ నెల 19 లేదా 20 తేదీల్లో హైదరాబాద్ వచ్చే అవకాశం ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (Vande Bharat Express) రైలు తెలంగాణలో ప్రారంభం కానుంది. దక్షిణ మధ్య రైల్వేకు కేటాయించిన ఈ రైలును హైదరాబాద్-విశాఖపట్నం లేదా హైదరాబాద్-ఢిల్లీ మార్గంలో నడుపుతారు. ఇదిలా ఉండగా.. ఈ వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను మోదీ ప్రారంభించనున్నారు. దీంతో పాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులను కూడా ప్రధాని ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో మోదీ ప్రసంగం జరిగే అవకాశం ఉంది. తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని మోదీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. బీజేపీ శ్రేణుల్లో కూడా కొత్త ఉత్సాహం నెలకొంది.

అయితే గతేడాది దీపావళి తర్వాత తెలంగాణలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభిస్తారని వార్తలు వచ్చినప్పటికీ అది కుదరలేదు. ఇప్పుడు ఎట్టకేలకు సంక్రాంతి తర్వాత రాష్ట్రానికి వందే భారత్ రైలు రాబోతోంది. దేశంలో ఇప్పటి వరకు ఏడు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను కేంద్రం ప్రారంభించగా, ఇది ఎనిమిదోది. ఇప్పటివరకు ప్రారంభమైన వందేభారత్ రైళ్లను ప్రధాని మోదీ స్వయంగా ప్రారంభించారు. తెలంగాణలో కూడా ప్రారంభిస్తారు. కాగా.. ఆగస్టు 15 నాటికి 75 వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. దేశంలోని వివిధ మార్గాల్లో మొత్తం 400 వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

Also Read: Shoots Rapist’s Mother: దారుణ ఘటన.. అత్యాచారం చేశాడని బాలుడి తల్లిపై కాల్పులు

మరోవైపు త్వరలో ఈ వందేభారత్ రైలు కేటాయింపుల్లో తెలుగు రాష్ట్రాలకు మరిన్ని నిధులు వచ్చే అవకాశం ఉంది. సికింద్రాబాద్, విజయవాడ, విశాఖపట్నం నుంచి ఢిల్లీ సిటీతో పాటు సికింద్రాబాద్-విజయవాడ, సికింద్రాబాద్-విశాఖపట్నం, సికింద్రాబాద్-తిరుపతి, విశాఖపట్నం-విజయవాడ, విజయవాడ-తిరుపతి రూట్లలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రైళ్లకు డిమాండ్ ఉంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లు సిద్ధమైన తర్వాత రైల్వే బోర్డు వాటిని జోన్ల వారీగా కేటాయిస్తుంది.

వందే భారత్ రైళ్ల ప్రత్యేకతలు

సున్నా నుండి 100 కి.మీ కేవలం 40 సెకన్లలోనే వేగాన్ని అందుకోవడం ఈ రైళ్ల ప్రత్యేకత. ఇవి గరిష్టంగా గంటకు 180 కి.మీ వేగంతో ప్రయాణిస్తాయి. రెండవ తరం వందే భారత్ రైళ్లు గంటకు 200 కి.మీ. వేగాన్ని ప్రవేశపెట్టేందుకు భారతీయ రైల్వే సన్నాహాలు చేస్తోంది. శతాబ్ది ఎక్స్‌ప్రెస్ స్థానంలో వీటిని ప్రవేశపెట్టనున్నారు. ఈ రైళ్లు దేశంలోని ప్రధాన నగరాల మధ్య నడుస్తాయి. ఈ రైళ్లను సిట్టింగ్‌తో పాటు స్లీపర్‌ కోచ్‌లతో రూపొందించారు. 140 కోట్ల జనాభా ఉన్న భారత్‌కు ఈ తరహా రైళ్లు అవసరమని కేంద్రం భావిస్తోంది. భవిష్యత్తులో ఈ రైళ్లకు మెట్రో తరహాలో ఎలివేటెడ్ కారిడార్లను నిర్మించే ప్రతిపాదన ఉంది. కానీ, చాలా ఖర్చు అవుతుంది.

ఈ రైళ్లు మెట్రోను మించిన అనుభూతిని కలిగి ఉంటాయి. ఏసీ రైలులో దాదాపు 16 బోగీలు ఉండగా.. ప్రతి బోగీలో వైఫై సౌకర్యం ఉంటుంది. ప్రయాణీకులు ఎక్కినప్పుడు, దిగినప్పుడు స్వయంచాలకంగా తెరుచుకునే తలుపులు, కావలసిన దిశలో తిప్పగలిగే సౌకర్యవంతమైన సీట్లు, పెద్ద అద్దాలతో కూడిన కిటికీలు, విమానాల వంటి బయో-టాయిలెట్లు ఈ రైళ్లలో అదనపు ఫీచర్లు ఉంటాయి. వందే భారత్ రైళ్లు అందుబాటులోకి వస్తే నగరాల మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • hyderabad
  • pm narendra modi
  • secunderabad
  • telangana
  • Vande Bharat Express

Related News

Heavy Rain Forecast for Telangana

తెలంగాణను తాకిన నైరుతి రుతుపవనాలు

తెలంగాణ రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. సోమవారం (జూన్ 8) ఇవి దక్షిణ సరిహద్దు జిల్లా అయిన జోగులాంబ గద్వాల జిల్లాను తాకాయి. రానున్న రెండు రోజుల్లో ఇవి రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీనికి తోడు ఉత్తరప్రదేశ్ నుండి కోస్తాంధ్ర వరకు కొనసాగుతున్న ద్రోణి కారణంగా మంగళవారం పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవ

  • KTR Delivers Strong Counter to Pawan's Remarks

    KTR: పవన్‌ వ్యాఖ్యలపై కేటీఆర్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌

  • Janasena Pawan Kalyan

    JANASENA : ప‌వ‌న్ పై జ‌డ్చ‌ర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఫైర్‌.. ప్యాకేజీ ఇస్తే..?

  • Janasena will contest in Telangana.

    Pawan Kalyan: తెలంగాణలో పోటీ చేస్తాం పవన్ కళ్యాణ్

  • Death

    Minior Girl : హైదరాబాద్‌లో మైనర్ బాలిక ఆత్మహత్య

Latest News

  • Health Care Tips: వర్షాకాలంలో రోగాలు రాకుండా ఉండాలంటే ఇలా చేయండి!

  • Depression: డిప్రెషన్ తగ్గించు కోవడానికి ఏం చేయాలి? మనమే తగ్గించుకోవచ్చు.

  • Private Colleges: ఏపీలో ప్రైవేట్ కాలేజీలకు భారీ ఊరట

  • LPG Cylinder Subsidy: సబ్సిడీతో ఇక ఏడాదికి 4 సిలిండర్లే!

  • Arjun Tendulkar: కొడుకు అర్జున్‌ ప్రదర్శనపై సచిన్‌ ప్రశంసల జల్లు

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd