PM Modi Speech at Adilabad: ఇది ఎన్నికల సభ కాదు..ప్రగతి ఉత్సవాలు: ప్రధాని మోడీ
- By Latha Suma Published Date - 01:35 PM, Mon - 4 March 24

PM Modi Speech at Adilabad Meeting: నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు అని ప్రధాని నరేంద్ర మోడీ(pm modi) తెలుగులో ప్రసంగాన్ని(Telugu Speech) ప్రారంభించారు. ఈరోజు ఆదిలాబాద్(Adilabad) లోని ఇందిర ప్రియదర్శని స్టేడియంలో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప సభ(BJP Vijaya Sankalpa Sabha)లో ప్రధాని మోడీ ప్రసంగించారు. ఇది ఎన్నికల సభ కాదు.. దేశంలో ప్రగతి ఉత్సవాలు జరుగుతున్నాయి. వికసిత్-భారత్ లక్ష్యంగా మా పాలన సాగుతోంది. ఇంత మంది ప్రజలు వికసిత్ భారత్ కోసం రావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు ప్రధాని నరేంద్ర మోడీ.
తమ పాలనలో దేశం అభిచేశాం. 15 రోజుల్లో 5 ఎయిమ్స్ సంస్థలను ప్రారంభించామని తెలిపారు. రైతుల ఖాతాల్లో వేల కోట్ల నిధులను జమ చేశాం. పెద్ద బ్రిడ్జీలు, రైల్వే ప్రాజెక్టులను జాతికి అంకితం చేశాం. ఆత్మనిర్భర్ భారత్ నుంచి వికసిత్ భారత్ వైపు అడుగు వేశామని తెలిపారు. వికసిత్ భారత్ కోసం 3వేలు సమావేశాలు నిర్వహించాం. పగలు-రాత్రి దీని కోసమే శ్రమిస్తున్నామని తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join.
దేశంలోని అనేక రాష్ట్రాలు అభివృద్ధిలో దూసుకెళ్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడి పదేళ్లు అయ్యిందని, రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందని స్పష్టం చేశారు. నేడు ఎన్టీపీసీ రెండో యూనిట్ ప్రారంభించామన్న ఆయన, ఈ రెండో యూనిట్ 800 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తుందని వివరించారు. ఈ క్రమంలోనే పేదలు, దళితులు, ఆదివాసీల అభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. గత పదేళ్లలో పేదరికం నుంచి 25 కోట్ల మంది బయటపడ్డారన్న ఆయన, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశాభివృద్ధి కోసం కృషి చేస్తుందని స్పష్టం చేశారు.
ఆదిలాబాద్ సభలో రూ.7 వేల కోట్ల విలువైన పనులను ప్రధాని మోడీ ప్రారంభించారు. పలు అభివృద్ధి పనులను వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని, రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. 800 మెగావాట్ల రెండో దశ విద్యుత్ కేంద్రాన్ని జాతికి అంకితమిచ్చారు. దాంతో పాటు పలు రైల్వే అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ప్రధానమంత్రి, అంబారి – పింపల్‌కుట్టి విద్యుదీకరణ ప్రాజెక్టు, డబ్లింగ్, విద్యుదీకరించిన సనత్‌నగర్ – మౌలాలి మార్గాలను ప్రారంభించారు.
read also : CM Revanth : భద్రాచలంలో ఈ నెల 11 న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన..?
అంతకుముందు ఆదిలాబాద్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఘన స్వాగతం పలికారు. సీఎం రేవంత్ మోడీని శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, మంత్రి సీతక్క సహా పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు.