Phone Tapping Case; ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పేరు.. సంచలన విషయాలు వెలుగులోకి
ట్యాపింగ్ లో కేసులో తొలిసారి మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేరును ప్రస్తావించారు టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు.కేసీఆర్, ఆయన కుటుంబసభ్యులు, పార్టీలో ఆయన సన్నిహితుల వ్యవహారాలను చక్కబెట్టేందుకే తామంతా కలిసి పని చేశామని రాధాకిషన్ రావు వాంగ్మూలంలో చెప్పినట్టు సమాచారం
- By Praveen Aluthuru Published Date - 10:57 AM, Fri - 3 May 24

Phone Tapping Case; తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ అంశం రోజుకో మలుపు తిరుగుతుంది. ఈ కేసులో ప్రధానంగా కేటీఆర్ పేరు వినిపిస్తుంది. అయితే ట్యాపింగ్ జరిగినట్టు కేటీఆర్ స్వయంగా ఒప్పుకున్నప్పటికీ విచారణలో భాగంగా తాజాగా మరో సంచలన వార్త ఒకటి బయటకు వచ్చింది. ట్యాపింగ్ లో కేసులో తొలిసారి మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేరును ప్రస్తావించారు టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు.
కేసీఆర్, ఆయన కుటుంబసభ్యులు, పార్టీలో ఆయన సన్నిహితుల వ్యవహారాలను చక్కబెట్టేందుకే తామంతా కలిసి పని చేశామని రాధాకిషన్ రావు వాంగ్మూలంలో చెప్పినట్టు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ తో కేసీఆర్ రాజకీయ ప్రత్యర్థులను, వారికి ఆర్థిక సాయం అందించే వారిని బెదిరించి లొంగదీసుకునేవాళ్లమని సంచలన విషయాలు వెల్లడించారు. సివిల్ తగాదాల్లో సెటిల్మెంట్లు చేసేవారమని, ఎన్నికల్లో వారి నగదు తరలింపును అడ్డుకునేవారమని, బీఆర్ఎస్ డబ్బు రవాణాకు సహకరించేవాళ్లమని టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు తన వాంగ్మూలంలో తెలిపారు
కాగా ఈ కేసులో కల్వకుంట్ల కుటుంబ జైలుకెళ్లడం ఖాయమాని కాంగ్రెస్ నేతలు చెపుతున్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చాలా సీరియస్ గానే ఉన్నారు. గతాంలో ఆయనను ఇదే కేసులో ఇరికించి జైలుకు పంపిన విషయం తెలిసిందే. గత కొద్దిరోజులుగా సీఎం రేవంత్ పలు ఇంటార్వ్యూలలో ఇదే విషయాన్నీ ప్రస్తావిస్తున్నారు.. గతంలో నా కూతురు వివాహానికి దూరంగా ఉంచారని, ఇప్పుడు కేసీఆర్ కూతురు జైలుకు వెళ్లిందని, అలాగే ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా ఇదే జరుగుతుందంటూ రేవంత్ ముందస్తుగానే కేసీఆర్ జైలుకెళ్లడం ఖాయమంటూ హింట్ ఇస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join
ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఇది వరకు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. నేను నా భార్య మాట్లాడుకుంటున్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసి విన్నారు ఆంటూ కేసీఆర్ పై సంచలన ఆరోపణలు చేశారు ఆయన. బీఆర్ఎస్ మంత్రుల ఫోన్లను ట్యాప్ చేసి వాళ్ళ భార్యలతో జరిపిన సంభాషణను కూడా విన్నారని చెప్పారు. అలాగే కేసీఆర్ చుట్టాలు మాట్లాడుకునేది విన్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా ఫోన్ ట్యాపింగ్ చేయడం చాలా పెద్ద నేరమని, అయితే ఈ కేసులో కేసీఆర్ కుటుంబం జైలుకు వెళ్తారనివిశ్వాసం వ్యక్తం చేశారు.
Also Read: Kurnool : 2024లో కర్నూలు ఎంపీ సెగ్మెంట్‌కు ఎవరు అధిపతి కావచ్చు..?