Revanth Reddy Secret Survey: గెలుపు అభ్యర్థులు పై పీసీసీ చీఫ్ రేవంత్ సర్వే.!
ఈసారి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్సేనని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సహా ఆ పార్టీ నేతలంతా ధీమా వ్యక్తం చేస్తున్నారు.
- By Maheswara Rao Nadella Published Date - 11:15 AM, Wed - 5 April 23

Revanth Reddy Secret Survey : అసెంబ్లీ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఎక్కడ మీటింగ్ పెట్టినా, ఎక్కడికెళ్లినా ఈసారి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్సేనని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) సహా ఆ పార్టీ నేతలంతా ధీమా వ్యక్తం చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే అన్ని నియోజకవర్గాల్లో ఆశావహులు ఎక్కువ సంఖ్యలో పోటీలో ఉన్నారు. ఎవరికి వారు తమకే టికెట్ వస్తుందని ఆశిస్తున్నారు. కొందరు నేతలు బహిరంగంగా ప్రకటనలూ చేస్తున్నారు. ఈ క్రమంలోనే టికెట్ ఎవరికివ్వాలనే దానిపై ఇప్పటికే రేవంత్ కసరత్తు మొదలుపెట్టినట్టు తెలుస్తున్నది. టికెట్ ఆశిస్తున్న వారిపై అన్ని నియోజకవర్గాల్లో ఆయన సొంతంగా సర్వేలు చేయిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే సునీల్ కనుగోలు టీం.. కాంగ్రెస్ కోసం పనిచేస్తున్నా, అభ్యర్థులపై రేవంత్ పర్సనల్గా సర్వే చేయిస్తున్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. బలమైన అభ్యర్థుల గురించి ఆయన సర్వే చేయిస్తున్నట్లు తెలుస్తున్నది.
Also Read: Karnataka Congress: కర్ణాటక కాంగ్రెస్‌లోకి వలసలు.. బీజేపీ ఎమ్మెల్యే చేరిక..!