KCR Tantrikam: కేసీఆర్ తాంత్రికం పై పరే’షా’న్, బీజేపీ ఆరా!
ఢిల్లీ లిక్కర్ స్కామ్ మలుపులు తిరుగుతుంది. దానికి కారణం కేసీఆర్ చతుర్ముఖ వ్యూహమా? తాంత్రిక పూజల మహత్యమా? అనేది ఇప్పుడు బీజేపీలో హాట్ టాపిక్ అయింది.
- By CS Rao Published Date - 03:15 PM, Sun - 12 March 23

ఢిల్లీ లిక్కర్ స్కామ్ మలుపులు తిరుగుతుంది. దానికి కారణం KCR చతుర్ముఖ వ్యూహమా? తాంత్రిక పూజల మహత్యమా? అనేది ఇప్పుడు బీజేపీలో హాట్ టాపిక్ అయింది. బీజేపీ వాళ్ళు ఉహించినట్టు కవితను ఈడీ అరెస్ట్ చేయలేదు. నిందితుడు రామచంద్ర పిళ్ళై వాగ్మూలం వెనక్కు తీసుకున్నాడు. కవితకు బినామీ కాదని కోర్ట్ లో పిటిషన్ వేశారు. ఆ మేరకు ఈడీ కి కోర్ట్ నోటీస్ లు ఇచ్చింది. కవితను విచారించిన కొన్ని గంటల్లోనే ఈడీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రణా రాజీనామా చేశారు. అంతే కాదు , హైద్రాబాద్ వచ్చిన అమిత్ షా విమానం చెడిపోయింది. సాంకేతిక కారణాలతో ఆ విమానం ముందుకు కదల్లేదు.
అప్పుడు బీజేపీ తెలంగాణ విభాగానికి KCR తాంత్రిక పూజలపై ఆరపోయిందట. గతంలోనూ విపక్షాలను బలహీన పరచడానికి యాగాలు చేశారు. అప్పటి నుంచి కాంగ్రెస్ తెలంగాణలో బలహీన పడుతూ వచ్చింది. బలంగా ఉండే టీడీపీ నామ రూపల్లేకుండా పోయింది. అప్పట్లో ఆయన చేసిన పూజల ఉద్దేశాన్ని కూడా ఆధ్యాత్మిక వేత్తలు వివరించారు. ఫలితంగా తిరుగులేని నాయకునిగా కేసీఆర్ ఎదిగారు. ఇప్పుడు బీజేపీ ఢిల్లీ పెద్దలను కట్టడీ చేయడానికి బీ ఆర్ ఎస్ ఆఫీస్ ప్రారంభం రోజు ప్రత్యేక పూజలు, యాగాలు చేశారని తెలంగాణ బీజేపీ చెబుతుంది.
తెలంగాణ సీఎం KCR తాంత్రిక పూజలు చేస్తున్నారని ఓ స్వామీకి తనకు చెప్పారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఇటీవల అన్నారు. టీఆర్ఎస్ పేరు మార్పు వెనుక కుట్ర ఉందని కూడా ఆ స్వామీజీ చెప్పారని ఆయన వ్యాఖ్యానించారు. మూడు నెలలకు ఒకసారి కేసీఆర్ నల్లపిల్లితో పూజలు చేస్తారని బండి చెప్పారు. ఇటీవలే తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత్ రాష్ట్ర సమితిగా మార్చటం వెనుక తాంత్రిక విద్య ఉందని అన్నారు. మాంత్రికుడి సూచనల మేరకే పార్టీ పేరును మార్చుకున్నారని చెప్పారు. అంతేగాక, కేసీఆర్ ఫాంహౌస్ లో తాంత్రిక పూజలు చేసి కొన్ని ద్రవాలను కాళేశ్వరంలో కలిపారని బండి అనుమానిస్తున్నారు.
తాజా పరిణామాలు గమనించిన తెలంగాణ బీజేపీ KCR తాంత్రిక పూజలపై కన్నేశారు. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ కాకపోవటం, పిళ్ళై వాగ్మూలం వెనక్కు తీసుకోవటం, ఈడీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజీనామా, అమిత్ షా విమానం సాంకేతిక లోపం ..వెరసి కొన్ని గంటల వ్యవధిలోనే జరిగాయి. దీంతో బీజేపీ చూపు కేసీఆర్ పూజలపై పడింది.
Also Read: Vitamin B12 Deficiency: ఈ ఆరోగ్య సమస్యలకు విటమిన్ బి12 లోపమే కారణం..

Related News

TSPSC: అభ్యర్థులకు అలర్ట్.. ఏఈఈ పరీక్ష కొత్త తేదీలు ప్రకటించిన TSPSC
టీఎస్పీఎస్సీలో పలు ప్రశ్నా పత్రాలు లీక్ అవడం ఇటీవల సంచలనం సృష్టించింది. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) మే నెలలో వివిధ విభాగాలలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE) పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ పరీక్షలను తిరిగి నిర్వహించనుంది.