Telangana
-
Heavy rain : హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. నగరమంతా జలమయం, ట్రాఫిక్‌కు బ్రేక్
ఈ భారీ వర్షంతో నగరంలోని ప్రధాన రహదారులపై నీరు నిలిచిపోయింది. రాజ్‌భవన్ ఎదుట భారీగా వరదనీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా ఏర్పాటు చేసిన డ్రైనేజీలను వర్షపు నీరు ముంచేయడంతో మళ్లీ మున్సిపల్ వర్గాలు అప్రమత్తమయ్యాయి.
Published Date - 06:25 PM, Mon - 4 August 25 -
BJP : బీసీలకు 42% రిజర్వేషన్లకు బీజేపీ పూర్తి మద్దతు: రామచందర్ రావు
ప్రజలకు మద్దతుగా పోరాడినట్లు చూపించేందుకు, హైదరాబాద్‌లో చేసినట్టు ఇప్పుడు ఢిల్లీలోనూ నాటకాలు ఆడుతున్నారని కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. బీసీలకు న్యాయం చేయాలనే లక్ష్యంతో బీజేపీ ముందుకు సాగుతోంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం బీసీల రిజర్వేషన్ల పట్ల ఆసక్తి చూపడం లేదని విమర్శించారు. రాష్ట్రం బీసీలకు అన్యాయం చేస్తోంది.
Published Date - 04:43 PM, Mon - 4 August 25 -
Upasana : ఈ నియామకం నాకెంతో గౌరవాన్నిచ్చింది.. సీఎం రేవంత్ రెడ్డికి ఉపాసన కృతజ్ఞతలు
ఈ సందర్భంగా ఆమె ఎక్స్ వేదికగా స్పందించారు. తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కో-ఛైర్మన్‌గా నన్ను నియమించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ బాధ్యత నాకు గర్వకారణంగా ఉంది. రాష్ట్ర క్రీడా రంగ అభివృద్ధిలో భాగస్వామిగా ఉండే అవకాశం లభించడం నా జీవితంలో ఒక మైలురాయి అని ఉపాసన పేర్కొన్నారు.
Published Date - 01:50 PM, Mon - 4 August 25 -
Kaleshwaram : కాళేశ్వరం అవకతవకలకు పూర్తిబాధ్యత కేసీఆర్‌దే..పీసీ ఘోష్ కమిషన్ నివేదికలో సంచలన విషయాలు!
కమిషన్ వివరించిన ప్రకారం, కాళేశ్వరం ప్రాజెక్టులో చోటుచేసుకున్న అవకతవకలకు ప్రధాన బాధ్యత మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుది (కేసీఆర్) అని స్పష్టంగా పేర్కొంది. కేసీఆర్ ఆదేశాల వల్ల మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీలలో భారీ సమస్యలు తలెత్తినట్లు కమిషన్ నివేదికలో వెల్లడైంది.
Published Date - 12:56 PM, Mon - 4 August 25 -
BC Reservations : కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇందుకు కృషి చేయాలి: ఎమ్మెల్సీ కవిత
దీక్షకు ముందు కవిత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, మహాత్మా జ్యోతిబా ఫులే, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు పుష్పాంజలి ఘటించి, వారి ఆశయాలకు ఆమె అంకితం చేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తెలంగాణ జాగృతి కార్యకర్తలు, బీఆర్ఎస్ నాయకులు, బీసీ సంఘాలు హాజరై కవితకు మద్దతుగా నిలిచారు.
Published Date - 11:53 AM, Mon - 4 August 25 -
Congress : బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం ‘చలో ఢిల్లీ’ ..కాంగ్రెస్ ఉద్యమం ఉధృతం
ఈ ఉద్యమానికి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) తెలంగాణ ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి హజరై, జెండా ఊపి రైలును ప్రారంభించారు. ఈ "చలో ఢిల్లీ" యాత్రకు రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ జిల్లాల నుంచి కనీసం 25 మంది చొప్పున కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
Published Date - 11:23 AM, Mon - 4 August 25 -
Cabinet Meeting : ‘కాళేశ్వరం’ నివేదిక పై చర్చించేందుకు నేడు కేబినెట్ భేటీ !
ఇప్పటికే ఈ నివేదిక సారాంశాన్ని సిద్ధం చేయడం కోసం ప్రత్యేకంగా నియమించబడిన ముగ్గురు సభ్యుల సీనియర్ అధికారుల కమిటీ ఆదివారం సాయంత్రం నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో సమావేశమైంది. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు కూడా హాజరై, సారాంశ నివేదిక తుది రూపును ఆమోదించారు.
Published Date - 11:09 AM, Mon - 4 August 25 -
Komatireddy Rajagopal Reddy : నా మద్దతు మీకే.. మరోసారి సీఎం రేవంత్ కు వ్యతిరేకంగా
Komatireddy Rajagopal Reddy : తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసేలా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోషల్ మీడియా జర్నలిస్టులకు తన పూర్తి మద్దతు ప్రకటించారు.
Published Date - 10:24 AM, Mon - 4 August 25 -
Gold Price : సామాన్యుడి అందనంత ధరల్లో బంగారం, వెండి ధరలు
Gold Price : అమెరికా వాణిజ్య విధానాలు, ముఖ్యంగా ట్రంప్ ప్రభుత్వం విధించిన సుంకాల ప్రభావం భారతీయ బంగారు అభరణాల మార్కెట్‌పై స్పష్టంగా కనిపిస్తోంది.
Published Date - 08:30 AM, Mon - 4 August 25 -
Free Current : ఫ్రీ కరెంట్ రానివారికి మరో ఛాన్స్ ఇచ్చిన కాంగ్రెస్ సర్కార్
Free Current : దరఖాస్తు చేసుకునే సమయంలో లబ్ధిదారులు తమ ఆధార్ కార్డు, తెల్లరేషన్ కార్డు జిరాక్స్ ప్రతులు, గ్యాస్ కనెక్షన్ ధ్రువీకరణ పత్రాలు కౌంటర్లలో సమర్పించాల్సి ఉంటుంది
Published Date - 07:49 PM, Sun - 3 August 25 -
Jagadeesh Vs Kavitha : కవిత జ్ఞానానికి నా జోహార్లు – జగదీష్ రెడ్డి కౌంటర్
Jagadeesh Vs Kavitha : కొంతమంది ఏదో చేసేద్దామని అనుకుంటున్నారు. వ్యక్తులుగా ఏదో చేస్తామనుకుంటే అది వాళ్ళ భ్రమ. కేసీఆర్ లేకపోతే ఎవరూ లేరు. అందులో ఎలాంటి సందేహం లేదు. నేను చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు గెలిచాను. కొంతమంది అది కూడా గెలవలేదు కదా
Published Date - 07:26 PM, Sun - 3 August 25 -
MLC Kavitha : నిరాహార దీక్షకు సిద్ధమవుతున్న కవిత
MLC Kavitha : ఆగస్టు 4 నుండి 7 వరకు హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద 72 గంటల నిరాహార దీక్ష (Hunger Strike) చేపట్టనున్నట్లు ఆమె ప్రకటించారు.
Published Date - 04:06 PM, Sun - 3 August 25 -
Ganesh Idol : చోరీ కేసులో కోర్టుకు వినాయకుడు
Ganesh Idol : గణేష్ చతుర్థి సమీపిస్తున్న తరుణంలో మెదక్ జిల్లాలో విగ్రహ చోరీ ఘటన సంచలనం రేపింది. గత నెల 27న అర్ధరాత్రి సమయంలో కొందరు యువకులు ట్రాలీ ఆటో సాయంతో వినాయకుడి విగ్రహాన్ని దొంగిలించారు.
Published Date - 01:26 PM, Sun - 3 August 25 -
T Congress : కాంగ్రెస్ పార్టీలో గ్రూపులపై మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు
T Congress : మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలు పార్టీకి ఉలిక్కిపడేలా చేశాయి. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్‌లో కులాల, వర్గాల ఆధారంగా విభేదాలు తీవ్రంగా ఉన్నాయి
Published Date - 01:09 PM, Sun - 3 August 25 -
Ration Cards : రేషన్ కార్డుల తొలగింపుపై కేంద్రం సంచలన నిర్ణయం
Ration Cards : కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా రేషన్ కార్డుల జాబితా నుంచి అనర్హులను తొలగించేందుకు కఠిన చర్యలు చేపట్టింది. ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై) పథకం ద్వారా లబ్ధి పొందుతున్న వారిలో అర్హత లేని వారిని గుర్తించి, వారి కార్డులను రద్దు చేయాలని కేంద్రం రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.
Published Date - 12:57 PM, Sun - 3 August 25 -
MLC Kavitha Fire: బీఆర్ఎస్కు కొరకరాని కొయ్యగా మారుతున్న కవిత.. పార్టీ కీలక నేతపై సంచలన ఆరోపణలు!
ఈ సమావేశంలో కవిత మరో ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు. బీఆర్ఎస్లో ఒక ముఖ్య నాయకుడు తన జాగృతి సంస్థలో కోవర్టులను పెట్టి సమాచారం సేకరిస్తున్నాడని ఆరోపించారు.
Published Date - 12:03 PM, Sun - 3 August 25 -
Shocking : మూఢనమ్మకాలకు బలైన గృహిణి.. “దేవుడి దగ్గరికి వెళ్తున్నా” అంటూ
Shocking : శాస్త్ర సాంకేతికత కొత్త శిఖరాలు అధిరోహిస్తున్న ఈ కాలంలోనూ మూఢనమ్మకాల పంజా ఇంకా విడవడం లేదు. అంతరిక్షం చేరి ప్రయోగాలు చేస్తున్న మహిళలు ఒక వైపు ఉంటే, మరో వైపు నమ్మకాల పేరుతో ప్రాణాలు త్యాగం చేసే ఘటనలు మన సమాజంలో ఇంకా చోటుచేసుకుంటున్నాయి.
Published Date - 11:17 AM, Sun - 3 August 25 -
Software Employees: హైదరాబాద్‌లోని ఐటీ ఉద్యోగులకు షాకింగ్ న్యూస్!
హైదరాబాద్‌లోని ఐటీ ఉద్యోగులకు సంబంధించిన ఆందోళన కలిగించే ఆరోగ్య సమస్యల గురించి కేంద్ర ఆరోగ్య మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఇటీవల ఒక ప్రకటనలో వెల్లడించారు.
Published Date - 08:52 PM, Sat - 2 August 25 -
Criminal Case : మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు
Criminal Case : మంత్రి కొండా సురేఖ(Konda Surekha)పై క్రిమినల్ కేసు (Criminal Case) నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది
Published Date - 07:48 PM, Sat - 2 August 25 -
KTR : హస్తిన యాత్రలో రేవంత్ రెడ్డి అర్ధశతకం సాధించారు
KTR : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరచూ ఢిల్లీ పర్యటనలు చేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామరావు (కేటీఆర్) ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Published Date - 12:38 PM, Sat - 2 August 25