HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Hyderabad Bijapur Highway Road Accidents

HYD -Bijapur Highway : ఇది దారి కాదు..యమలోకానికి రహదారి

HYD -Bijapur Highway : తెలంగాణ లో గత కొద్దీ రోజులుగా రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోయాయి. రోడ్లు బాగుండకపోవడం , నిర్లక్ష్యపు డ్రైవింగ్ ఇలా పలు కారణాలతో ప్రమాదాలు పెరిగిపోతున్నాయి

  • By Sudheer Published Date - 10:35 AM, Tue - 4 November 25
  • daily-hunt
Hyd Bijapur Road
Hyd Bijapur Road

తెలంగాణ లో గత కొద్దీ రోజులుగా రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోయాయి. రోడ్లు బాగుండకపోవడం , నిర్లక్ష్యపు డ్రైవింగ్ ఇలా పలు కారణాలతో ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌–బీజాపూర్‌ జాతీయ రహదారి (NH–163)పై ప్రయాణించడం అంటే ప్రాణాలను పణంగా పెట్టడమేనని స్థానికులు వాపోతున్నారు. ఈ మార్గం రహదారిగా కాకుండా రాకాసి రహదారిగా మారిందని వారు చెబుతున్నారు. సుమారు 46 కి.మీ. పొడవైన ఈ రోడ్డంతా గుంతలతో నిండిపోయి ఉంది. వర్షాకాలంలో ఈ గుంతలు మినీ కుంటలుగా మారి వాహనదారులకు మరింత ప్రమాదకరంగా మారుతున్నాయి. తగిన లైటింగ్ లేకపోవడం, సిగ్నల్‌లు సరిగా లేకపోవడం, స్పీడ్‌బ్రేకర్లు లేకపోవడం వల్ల రాత్రిపూట ప్రయాణం కష్టసాధ్యమవుతోంది.

Accidents : ఈరోజు కూడా తెలుగు రాష్ట్రాల్లో బస్సు ప్రమాదాలు..ఎక్కడెక్కడంటే !!

2018 నుండి ఇప్పటివరకు ఈ రహదారిపై చోటు చేసుకున్న ప్రమాదాలు 200 మందికి పైగా ప్రాణాలను బలితీసుకోగా, మరో 600 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. దాదాపు ప్రతి వారం ఈ మార్గంలో ఒకటి లేదా రెండు ప్రమాదాలు జరగడం సాధారణ విషయంగా మారింది. ట్రక్కులు, ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు — అన్నింటికీ ఇది ప్రధాన రూట్‌గా ఉండటంతో ట్రాఫిక్ కూడా అధికంగా ఉంటుంది. గుంతల వల్ల వాహనాలు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న వాహనాలకు ఢీ కొడుతున్న ఘటనలు తరచూ జరుగుతున్నాయి. రోడ్డు సంరక్షణలో నిర్లక్ష్యం, కాంట్రాక్టర్‌ ల సడలింపు, అధికారుల తగిన పర్యవేక్షణ లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Vidadala Rajani: ఉద్యోగాల పేరుతో కోట్లలో మోసం..చిక్కుల్లో విడదల రజని

ఇక తాజాగా అన్ని అడ్డంకులు తొలగడంతో రహదారి విస్తరణ పనులు ప్రారంభం కానున్నాయి. ఈ మార్గాన్ని నాలుగు లైన్లుగా విస్తరించే యోచనతో జాతీయ రహదారి ప్రాధికార సంస్థ (NHAI) ముందడుగు వేసింది. భూమి స్వాధీనం, అనుమతులు, టెండర్‌ ప్రక్రియ పూర్తికావడంతో పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. స్థానికులు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ, “ఇకనైనా ఈ రహదారి యమలోకం దారిలా కాకుండా సురక్షిత మార్గంగా మారాలని” కోరుకుంటున్నారు. విస్తరణ పనులు సకాలంలో పూర్తయితే అనేక ప్రాణాలు కాపాడతాయని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • HYD -Bijapur Highway
  • HYD -Bijapur Highway road accidents
  • road accidents
  • telangana
  • Telangana Roads

Related News

Collector Field Visit

Collector Field Visit: దెబ్బతిన్న పంటల పరిశీలనకు బైక్‌పై కలెక్టర్ క్షేత్రస్థాయి పర్యటన!

నర్సింగాపురం గ్రామంలోని తిరుమల రైస్ మిల్లును తనిఖీ చేసిన కలెక్టర్, ధాన్యం కొనుగోలులో అనవసరమైన కోతలు లేకుండా చూడాలని మిల్లు యాజమాన్యాన్ని ఆదేశించారు.

  • Hyderabad Road Damage

    Congress Govt : తెలంగాణ సర్కార్ కు ప్రజల ప్రాణాలు పోయిన ఫర్వాలేదా..?

  • Bus Accidents Oct 4th

    Accidents : ఈరోజు కూడా తెలుగు రాష్ట్రాల్లో బస్సు ప్రమాదాలు..ఎక్కడెక్కడంటే !!

  • 1.2 Lakh Jobs

    1.2 Lakh Jobs: లక్ష్యం 120 జీసీసీలు.. 1.2 లక్షల ఉద్యోగాలు: మంత్రి

  • Congress

    Congress: సీఎం రేవంత్- అజారుద్దీన్‌ల వివాదంపై కాంగ్రెస్ క్లారిటీ!

Latest News

  • Sunrisers Hyderabad: ఐపీఎల్‌ 2026 వేలానికి ముందు స‌న్‌రైజ‌ర్స్‌ నుండి స్టార్ బ్యాట‌ర్‌ విడుదల?

  • India Squad: పాక్‌తో మ‌రోసారి త‌ల‌ప‌డ‌నున్న భార‌త్.. ఎప్పుడంటే?

  • Jagruthi Janam Bata : భవిష్యత్తు కార్యాచరణ ఇప్పుడే చెప్పలేను – కవిత

  • Harassed : తెలుగు సీరియల్ నటిపై వేధింపులు

  • Honda Activa 8G : అద్భుతమైన ఫీచర్లతో మార్కెట్ లోకి హోండా యాక్టివా 8G..ధర ఎంత తక్కువో !!

Trending News

    • Net Worth: భార‌త్‌, సౌతాఫ్రికా జ‌ట్ల కెప్టెన్ల సంపాద‌న ఎంతో తెలుసా?

    • Road Accident : ఆర్టీసీ ప్రయాణానికి కూడా రక్షణ కరువేనా…? గాల్లో కలిసిపోతున్న ప్రాణాలు !!

    • Tollywood : చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. బాలకృష్ణ, నాగచైతన్య సినిమాల వాయిదా?

    • Mithali Raj : నాలుగు దశాబ్దాల కల..మిథాలీ రాజ్ చేతిలో వరల్డ్‌కప్!

    • Team India : భారత మహిళా జట్టుకు భారీ నజరానా ప్రకటించిన బీసీసీఐ.!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd