HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >I Cant Say What My Future Plans Are Right Now Kavitha

Jagruthi Janam Bata : భవిష్యత్తు కార్యాచరణ ఇప్పుడే చెప్పలేను – కవిత

Jagruthi Janam Bata : “సామాజిక తెలంగాణ సాధనమే మా లక్ష్యం” అని కవిత స్పష్టం చేశారు. ఆమె మాట్లాడుతూ.. “ప్రజల సమస్యలు మా అజెండా కంటే ముఖ్యమైనవి. ఎవరైనా మా ఆలోచనలను అంగీకరించకపోయినా, వారిని కూడా స్వాగతిస్తాం

  • Author : Sudheer Date : 04-11-2025 - 2:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Jagruthi Janam Bata
Jagruthi Janam Bata

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో జరుగుతున్న “జాగృతి జనం బాట” కార్యక్రమం ఆదిలాబాద్ జిల్లాకు చేరుకుంది. ఈ పర్యటనలో ఆమె ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటూ, పరిష్కార మార్గాలను అన్వేషించారు. “సామాజిక తెలంగాణ సాధనమే మా లక్ష్యం” అని కవిత స్పష్టం చేశారు. ఆమె మాట్లాడుతూ.. “ప్రజల సమస్యలు మా అజెండా కంటే ముఖ్యమైనవి. ఎవరైనా మా ఆలోచనలను అంగీకరించకపోయినా, వారిని కూడా స్వాగతిస్తాం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొన్నిసమస్యలు పరిష్కరమయ్యాయి కానీ ఇంకా అనేక సమస్యలు మిగిలే ఉన్నాయి. అందుకే ఈ నాలుగు నెలలపాటు ప్రజల్లో తిరిగి వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకుంటాం” అని తెలిపారు.

Operation Kagar : 20 ఏళ్లకే మావోయిస్టు గా మారిన యువతీ..కట్ చేస్తే రూ.14 లక్షల రివార్డు

కవిత ప్రత్యేకంగా పత్తి రైతుల సమస్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ రైతులు మొంథా తుఫాన్ ప్రభావంతో తీవ్రంగా నష్టపోయారని, కానీ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదని ఆమె విమర్శించారు. పత్తి రైతులకు తేమ శాతం ఆధారంగా తక్కువ ధర ఇవ్వడం అన్యాయమని పేర్కొంటూ, “రైతు యార్డ్‌కి పత్తి తీసుకురాగానే కాకుండా, అది ఆరిన తర్వాత తేమ శాతం చూసి కొనాలి” అని అన్నారు. కలెక్టర్‌తో ఈ విషయంపై చర్చించి పరిష్కారం సాధించినట్టు తెలిపారు. అలాగే చనాఖా-కొరటా, కుప్తి ప్రాజెక్టులు పూర్తి చేయడంలో ఆలస్యం జరుగుతుండటంపై ఆవేదన వ్యక్తం చేశారు. “మహారాష్ట్రలో బండ్లు కట్టారు కానీ మన వైపు నిర్లక్ష్యం. 50 వేల ఎకరాలకు నీరు అందించగల ఈ ప్రాజెక్ట్‌ త్వరగా పూర్తి కావాలి” అని డిమాండ్ చేశారు. ఆదివాసీల భూమి సమస్య, బోథ్‌లో మౌలిక వసతులు, ఆస్పత్రులు, విద్యా సంస్థల సమస్యలపై కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

జైనత్ దేవాలయం అభివృద్ధి, రైల్వే బ్రిడ్జిలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి అంశాలపై కూడా కవిత సూటిగా స్పందించారు. “బీజేపీ నాయకులు ఎన్నికల సమయంలో దేవుళ్ల పేర్లు తీసుకుంటారు కానీ ఆలయాల అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయరు” అని విమర్శించారు. విద్యా రంగంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ నిలిచిపోవడం వల్ల పేద విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, ప్రైవేట్ కాలేజీలు బంద్ చేయాల్సిన పరిస్థితి రావడం సిగ్గుచేటు అని పేర్కొన్నారు. రైతు ఆత్మహత్యలు, మహిళల సాధికారత, ఆరోగ్య సదుపాయాల లోపం వంటి సమస్యలను కూడా ప్రస్తావించారు. “నాలుగు నెలల్లో ప్రజలతో కలసి తిరిగి కనీసం నాలుగు ప్రధాన సమస్యలైనా పరిష్కారం చేయగలిగితే మా జీవితం ధన్యమవుతుంది. సామాజిక తెలంగాణ కోసం జాగృతి పునరుద్ధరణ ప్రారంభమైంది” అని కవిత స్పష్టం చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Jagruthi
  • Jagruthi Janam Bata
  • kavitha
  • Kavitha Adilabad

Related News

Kavitha

Kavitha : నేను ఎప్పటికైనా సీఎం అవుతా – కవిత కీలక వ్యాఖ్యలు

Kavitha : తెలంగాణ రాజకీయాల్లో జాగృతి నాయకురాలు కవిత చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. తాను ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి (CM) అవుతానని, 2014 నుంచి రాష్ట్రంలో జరిగిన అన్ని విషయాలపై విచారణ జరిపిస్తానని ఆమె సంచలన ప్రకటన చేశారు

    Latest News

    • మీ కూరలో ఉప్పును తగ్గించే అద్భుతమైన చిట్కాలీవే!

    • కోల్‌కతా నైట్ రైడర్స్‌కు కొత్త కెప్టెన్ రాబోతున్నారా?

    • ఈ ఏడాది నెటిజన్లు అత్యధికంగా వెతికిన బిజినెస్ లీడర్లు వీరే!

    • ఐపీఎల్ 2026 వేలం.. అత్యంత భారీ ధర పలికిన ఆట‌గాళ్లు వీరే!

    • యువ ఆట‌గాళ్ల‌పై కాసుల వ‌ర్షం.. ఎవ‌రీ కార్తీక్ శ‌ర్మ‌, ప్ర‌శాంత్ వీర్‌?

    Trending News

      • మతీషా పతిరానాను రూ. 18 కోట్లకు దక్కించుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్

      • రికార్డు ధరకు అమ్ముడైన కామెరాన్ గ్రీన్.. రూ. 25.20 కోట్లకు దక్కించుకున్న కేకేఆర్!

      • ఐపీఎల్ 2026 మినీ వేలం.. ఏమిటీ ఆర్‌టీఎం కార్డ్? ఈ వేలంలో దీనిని వాడొచ్చా?

      • ఐపీఎల్ 2026 మినీ వేలం.. మరోసారి హోస్ట్‌గా మల్లికా సాగర్, ఎవ‌రీమె!

      • నేడు ఐపీఎల్ 2026 మినీ వేలం.. పూర్తి వివ‌రాలీవే!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd