HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Bus Accidents In Telugu States Everywhere

Accidents : ఈరోజు కూడా తెలుగు రాష్ట్రాల్లో బస్సు ప్రమాదాలు..ఎక్కడెక్కడంటే !!

Accidents : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వరుస రోడ్డు ప్రమాదాలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఈ తెల్లవారుజామున రెండు రాష్ట్రాల్లో మూడు వేర్వేరు బస్సు ప్రమాదాలు చోటుచేసుకోవడంతో

  • Author : Sudheer Date : 04-11-2025 - 8:05 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bus Accidents Oct 4th
Bus Accidents Oct 4th

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వరుస రోడ్డు ప్రమాదాలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఈ తెల్లవారుజామున రెండు రాష్ట్రాల్లో మూడు వేర్వేరు బస్సు ప్రమాదాలు చోటుచేసుకోవడంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది. మొదటి ప్రమాదం కరీంనగర్ జిల్లా రేణికుంట వద్ద జరిగింది. ఉదయం 5 గంటల సమయంలో మెట్పల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వడ్ల బస్తాలతో వెళ్తున్న ట్రాక్టరును వెనుక నుంచి ఢీకొట్టింది. ఢీ కొట్టిన తీవ్రతకు బస్సు ముందు భాగం ధ్వంసమై, 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదం చోటుచేసుకున్న రహదారి కొద్దిసేపు మూసివేయబడగా, పోలీసులు ట్రాఫిక్‌ను సర్దుబాటు చేశారు.

1.2 Lakh Jobs: లక్ష్యం 120 జీసీసీలు.. 1.2 లక్షల ఉద్యోగాలు: మంత్రి

ఇక మరో ప్రమాదం నల్గొండ జిల్లా బుగ్గబావిగూడెం వద్ద చోటుచేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కూడా ట్రాక్టరును వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో ట్రాక్టర్‌లో ఉన్న నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. వారిని స్థానికులు వెంటనే 108 అంబులెన్స్ సాయంతో నల్గొండ జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రహదారిపై పొగమంచు, రాత్రి వేళ దృశ్యమానత తగ్గడం, అలాగే వాహనదారుల నిర్లక్ష్యం ఈ ప్రమాదాలకు కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇరు ప్రమాదాలపై కేసులు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లోని సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం దామాజిపల్లి సమీపంలో మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న జబ్బార్ ట్రావెల్స్ బస్సు జాతీయ రహదారిపై అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉండగా, అందులో సురక్ష (30) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఐషర్ వాహనం అకస్మాత్తుగా బస్సు ముందు రావడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో మరో 8 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిని అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వరుసగా చోటుచేసుకుంటున్న ఈ రోడ్డు ప్రమాదాలు రాష్ట్రాల్లో రవాణా భద్రతపై ఆందోళనలను మళ్లీ పెంచాయి. నిపుణులు డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని, రాత్రి, తెల్లవారుజామున వేళల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Accidents
  • ap
  • Bus Accidents
  • telangana
  • telugu states

Related News

Engineering counselling in Telangana begins today.

TS EAPCET 2026: తెలంగాణలో నేటి నుంచి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్

తెలంగాణలో బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన మోస్ట్ అవేటెడ్ టీజీ ఎప్‌సెట్ 2026 మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ జూన్ 19వ తేదీ శుక్రవారం అంటే ఈరోజు నుంచే అధికారికంగా ప్రారంభమైంది. ఇంజినీరింగ్ సీటు సాధించాలనే లక్ష్యంతో ఉన్న విద్యార్థులు ఈ రోజు నుంచి ఆన్‌లైన్‌లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, తమకు అనుకూలమైన తేదీ, సమయాన్ని బట్టి ధ్రువపత్రాల పరిశీలన కోసం స్లాట్ బుక్ చేసుక

  • Alert for gas consumers: June 30 is the final deadline. These requirements must be met—otherwise, the connection will be disconnected.

    LPG Gas Subsidy: గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. జూన్ 30 వరకే డెడ్ లైన్.. ఇవి తప్పక పాటించాల్సిందే.. లేదంటే కనెక్షన్ కట్

  • Pawan Kalyan's tour in Telangana... Janasena chief to fulfill a young child's last wish.

    Pawan Kalyan: తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటన.. చిన్నారి చివరి కోరిక తీర్చనున్న జనసేనాని

  • A techie who gave up the American dream... today, she is a role model for many farmers. So, who is Sanjana Reddy? What is this interesting story?

    Sanjana Reddy Inspiring Journey: అమెరికన్ కలను వదులుకున్న టెక్కీ… నేడు ఆమె ఎందరో రైతులకు ఆదర్శం.. ఇంతకీ సంజన రెడ్డి ఎవరు? ఏంటా ఇంట్రెస్టింగ్ స్టోరీ

  • Promotions in the Endowments Department: EOs promoted to Grade-1.

    Endowments Department: దేవాదాయ శాఖలో ప్రమోషన్లు.. ఈవోలకు గ్రేడ్‌‌-1గా ప్రమోషన్లు

Latest News

  • Jnaneswari: తుని పాప మిస్సింగ్ రోజు.. CCTVలో బిగ్ ట్విస్ట్

  • Maa Inti Bangaram: సమంత మా ఇంటి బంగారం ఎలా ఉందంటే..

  • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • Meta : ‘మెటా’ నుంచి సరికొత్త పేరంటల్ అలర్ట్స్!

  • Anupama Singh: కాశ్మీర్ జోలికొస్తే ఊరుకోం.. ఐరాసలో పాకిస్థాన్‌కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్

Trending News

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd