KCR Missing: ప్రతిపక్ష నేత కేసీఆర్ కనబడుట లేదు.. బీజేపీ సంచలన ట్వీట్!
10 సంవత్సరాల పాటు అధికారం అనుభవించి, తెలంగాణను దోచుకున్న ఈయన ప్రజలు ఓడించి ప్రతిపక్షంలో కూర్చొబెడితే కాంగ్రెస్ అక్రమాలను ప్రజల తరపున ప్రశ్నించకుండా పత్తా లేకుండా పోయాడని ఎద్దేవా చేసింది.
- Author : Gopichand
Date : 08-01-2025 - 6:31 IST
Published By : Hashtagu Telugu Desk
KCR Missing: తెలంగాణలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ప్రస్తుతం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోర్టులు చుట్టూ తిరుగుతున్నారు. అధికార పార్టీ కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీల మధ్య మాటలతో పాటు సోషల్ మీడియా వేదికగా ట్వీట్‌ల యుద్ధం నడుస్తోంది. నిన్న.. మొన్నటివరకు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలతో ట్వీట్‌లు చేసిన తెలంగాణ బీజేపీ తాజాగా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిపై ఆసక్తికర ట్వీట్ చేసింది.
ప్రతిపక్ష నేత కేసీఆర్ కనబడుట లేదు (KCR Missing) అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. ఇందుకు సంబంధించిన ట్వీట్ వైరల్ అవుతోంది. ట్వీట్‌లో.. పత్తా లేని పెద్దమనిషి, అధికార భోగానికే గానీ.. ప్రజల బాదరబందీలపై పట్టింపులేని దొర! రాసుకొచ్చింది. అంతేకాకుండా కనబడుట లేదు అని ఒక పోస్టర్ కూడా విడుదల చేసింది. పోస్టర్‌లో పేరు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని, హోదా ప్రతిపక్ష నేత అని పేర్కొంది. అంతేకాకుండా 10 సంవత్సరాల పాటు అధికారం అనుభవించి, తెలంగాణను దోచుకున్న ఈయన ప్రజలు ఓడించి ప్రతిపక్షంలో కూర్చొబెడితే కాంగ్రెస్ అక్రమాలను ప్రజల తరపున ప్రశ్నించకుండా పత్తా లేకుండా పోయాడని ఎద్దేవా చేసింది.
Also Read: Rishabh Pant: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో సత్తా చాటిన రిషబ్ పంత్!
పత్తా లేని పెద్దమనిషి,
అధికార భోగానికే గానీ,
ప్రజల బాదరబందీలపై పట్టింపులేని దొర !#PrashnistunnaTelangana pic.twitter.com/yxXH4qLWvW— BJP Telangana (@BJP4Telangana) January 8, 2025
తెలంగాణలో 2023లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే దిశగా కసరత్తులు చేస్తోంది. ఇందుకోసం స్థానిక సంస్థల ఎన్నికలను ఆయుధంగా చేసుకోవాలని పార్టీ పెద్దలు యోచిస్తున్నారు. ఈ క్రమంలో పార్టీలో అనేక కీలక నిర్ణయాలు ఉండనున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి తర్వాత బీఆర్ఎస్ పార్టీకి కొత్త అధ్యక్షుడు వస్తారని గతంలో మాజీ మంత్రి కేటీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే బీఆర్ఎస్ అధ్యక్ష పదవి తిరిగి కేసీఆర్‌కే ఇస్తారా? కేటీఆర్ అధ్యక్షుడు అవుతారా? లేక బీసీ నాయకుడ్ని పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం తమదైన దూకుడుతో ప్రతిపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీలకు కళ్లెం వేస్తుంది. తెలంగాణలోని ఈ ప్రధాన మూడు పార్టీలు సర్పంచ్ ఎన్నికల్లో తమ సత్తా చాటి గ్రామస్థాయిలో బలంగా ఉన్నట్లు చెప్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.