HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Notifications For 531 Civil Assistant Surgeons Soon

Notifications: నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్.. పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు..?

  • Author : Gopi Date : 15-06-2024 - 11:39 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Notifications
Notifications

Notifications: ప్ర‌జారోగ్యంపై సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌త్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ వైద్యశాలలో ఖాళీగా ఉన్న 531 సివిల్ అసిస్టెంట్ స‌ర్జ‌న్‌, 193 ల్యాబ్ టెక్నీషియ‌న్‌, 31 స్టాఫ్ న‌ర్సుల భ‌ర్తీకి రంగం సిద్ధం చేశారు. అయితే త్వరలోనే వీటికి సంబంధించిన నోటిఫికేషన్ (Notifications) విడుదల కానుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్‌సీ) సివిల్ అసిస్టెంట్ స‌ర్జ‌న్ల కొర‌త ఎక్కువ‌గా ఉండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ప్ర‌జారోగ్యంపై ప్ర‌త్యేక దృష్టి పెట్టిన రాష్ట్ర ప్ర‌భుత్వం వివిధ ఆసుప‌త్రులు, విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీ చేయాలని చూస్తోంది. ఈ క్రమంలోనే ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో ఖాళీల భ‌ర్తీపై రాష్ట్ర ప్ర‌భుత్వం దృష్టి సారించింది.సివిల్ అసిస్టెంట్ స‌ర్జ‌న్లు, ల్యాబ్ టెక్నీషియ‌న్లు, స్టాఫ్ న‌ర్సుల ఖాళీల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ల విడుద‌లకు రంగం సిద్ధ‌మైంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్‌సీ) సివిల్ అసిస్టెంట్ స‌ర్జ‌న్ల కొర‌త ఎక్కువ‌గా ఉంది. స‌మ‌స్య‌ను అధిగ‌మించి ప్ర‌జ‌ల‌కు మెరుగైన సేవ‌లు అందించేందుకుగానూ సివిల్ అసిస్టెంట్ స‌ర్జ‌న్ల పోస్టులు 531 భ‌ర్తీ చేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈ మేర‌కు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య సేవ‌ల నియామ‌క బోర్డు (ఎంహెచ్ఎస్ ఆర్‌బీ) త్వ‌ర‌లోనే ఈ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేయ‌నుంది.

Also Read: Pawan Kalyan: రాష్ట్ర ప్రజలకు సేవలు అందించే భాగ్యం కలిగింది: డిప్యూటీ సీఎం పవన్

నియామ‌కాల అనంత‌రం ఆయా పీహెచ్‌సీల్లోని డిమాండ్‌కు అనుగుణంగా స‌ర్జ‌న్లను నియ‌మించ‌నున్నారు. వ్యాధి నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించే ల్యాబ్ టెక్నీషియ‌న్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ నేప‌థ్యంలోనే 193 ల్యాబ్ టెక్నీషియ‌న్ పోస్టుల భ‌ర్తీకి తెలంగాణ వైద్య విధాన ప‌రిష‌త్ త్వ‌ర‌లోనే నోటిఫికేష‌న్ జారీ చేయ‌నుంది. వివిధ ఆసుప‌త్రుల్లో రోగుల‌కు సేవ‌లు అందించే స్టాఫ్ న‌ర్సుల పోస్టుల‌ను భ‌ర్తీ చేయనున్నారు. వాటికి కూడా నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు. త్వరలోనే ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.

We’re now on WhatsApp : Click to Join

డయాగ్నస్టిక్ టెస్ట్ సెంటర్లలో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీజీవీవీపీ) 193 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనుంది. రోగులకు సేవలు అందించే స్టాఫ్ నర్సులను వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో నింపనున్నారు. TGSMHSRB త్వరలో 31 స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm revanth
  • govt jobs
  • JOB Notifications
  • jobs
  • Jobs Information
  • telangana
  • TG News
  • Ts govt

Related News

Pig Gives Birth To Elephant

పంది కడుపున ఏనుగు పిల్ల.. అసలు నిజం ఇదీ!

నాగర్‌కర్నూల్ జిల్లాలో ఓ వింత ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఓ పంది, ఏనుగును పోలిన పిల్లకు జన్మనివ్వడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. అచ్చం ఏనుగులా తొండం, పెద్ద చెవులతో జన్మించిన ఈ వింత జీవిని చూసేందుకు జనం తరలివస్తున్నారు. ఈ ఘటన పెద్దకొత్తపల్లి మండలం కార్పాముల గ్రామంలో చోటుచేసుకుంది. ఈ వింత జననానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైర

  • Territorial Army Recruitment

    మాజీ సైనికులకు గుడ్ న్యూస్‌!

  • Twins Same Marks in Intermediate Results 2026

    ఇంటర్ ఫలితాల్లో ఒకే మార్కులు సాధించిన కవలలు

  • Kalvakuntla Kavitha Warning

    Kalvakuntla Kavitha: తెలంగాణకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోం: కల్వకుంట్ల కవిత

  • Telangana Government Good N

    Disabled People : దివ్యాంగులకు తెలంగాణ సర్కార్ శుభవార్త

Latest News

  • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

  • లాస్ ఏంజెలెస్‌లో మహిళ అరెస్ట్.. ఇరాన్‌కు అక్రమంగా డ్రోన్ సప్లయ్.

  • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

  • Dwacra Womens : డ్వాక్రా మహిళలకు గొప్ప శుభవార్త తెలిపిన ఏపీ సర్కార్ !

  • Emergency Landing : విమానంలో సాంకేతిక సమస్య.. భయంతో వెక్కి వెక్కి ఏడ్చిన ప్రయాణికులు

Trending News

    • HBDOneAndOnlyCBN : చంద్రబాబుకు భువనేశ్వరి ఎమోషనల్ బర్త్ డే విషెస్

    • సీజ్‌ఫైర్‌పై నీలినీడలు?

    • గల్ఫ్ దేశాల్లో కొనసాగుతున్న ఉత్కంఠ.. హోర్ముజ్ జలసంధికి పొంచి ఉన్న ముప్పు!

    • ఏసీ నడపడానికి ఎంత సోలార్ సామర్థ్యం ఉండాలి?

    • Punarvika: చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్‌ తెప్పించిన లోకేశ్‌

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd