HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >It Is A Privilege To Serve The People Of The State Deputy Cm Pawan

Pawan Kalyan: రాష్ట్ర ప్రజలకు సేవలు అందించే భాగ్యం కలిగింది: డిప్యూటీ సీఎం పవన్

  • Author : Balu J Date : 15-06-2024 - 11:32 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pawan Kalyan (7)
Pawan Kalyan (7)

Pawan Kalyan:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా నేను నిర్వర్తించబోయే శాఖలు నా మనసుకు, జనసేన మూల సిద్ధాంతాలకు చాలా దగ్గరగా ఉన్నాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ‘‘ఈ బాధ్యతలు సంతోషం కలిగిస్తున్నాయి. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ, శాస్త్ర సాంకేతిక.. ఈ శాఖలన్నీ ప్రజలకు ప్రత్యక్షంగా ఉపయోగపడేవి, ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరకు చేర్చేవిగా నేను భావిస్తున్నాను. 2008 నుంచి ప్రత్యక్ష రాజకీయాలలో ఉన్న నేను ఉభయ తెలుగు రాష్ట్రాలలో విస్తృతంగా పర్యటించి ఉన్నాను. 2019 ఎన్నికలకు ముందు ప్రజా పోరాట యాత్రను ప్రజల సమస్యల అవగాహన, మౌలిక సదుపాయాల కల్పనపై అధ్యయనం కోసమే తలపెట్టాను. చాలా లోతుగా ఆనాడు స్వయంగా పరిశీలన జరిపాను. ముఖ్యంగా రాష్ట్రంలోని ప్రతీ ప్రాంత సమస్యలపై బలమైన అవగాహన ఏర్పడింది’’ అని అన్నారు.

‘‘విశాఖ మన్యంలో పర్యటిస్తున్నపుడు కురిడి అనే గిరిజన గ్రామానికి వెళ్ళాను. ఆ గ్రామ ఆడపడుచులు గుక్కెడు నీళ్ళ కోసం తాము పడుతున్న అవస్థలను చెబుతూ, అక్కడి బావిలో కలుషితమైపోయిన నీటిని చూపించారు. ఆ ప్రాంతంలోనే తోటవలస గ్రామానికి వెళ్లినప్పుడు తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఆ ఊరివాళ్ళు వివరించారు. గోదావరి జిల్లాలకు వెళ్లినప్పుడు పలు మత్యకార గ్రామాలవాసులు తాగు నీటి కోసం ఎన్నిప్రయాసలుపడుతున్నామో చెప్పారు. గ్రామీణ అభివృద్ధి – దేశాభివృద్ధి అనే నినాదం నామమాత్రంగా మిగిలిపోవడాన్ని గమనించాను. గుక్కెడు మంచి నీరు కోసం మైళ్ళ దూరం వెళ్లి ప్రయాసతో బిందెడు నీరు తెచ్చుకుంటున్న ఆడపడుచుల అవస్థలు చూసాను. కాలుష్యమయమైన జల వనరులనే తాగు నీరుగా తప్పని పరిస్థితులలో వాడుకుంటున్న పల్లెవాసులను గమనించాను’’ అని పవన్ అన్నారు.

గతేడాది గ్రామ సర్పంచులతో జనసేన కేంద్ర కార్యాలయంలో చర్చాగోష్టి నిర్వహించాము. పార్టీలకు అతీతంగా వందలమంది సర్పంచులు పాల్గొన్నారు. నాటి రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీల నిధులను ఏ విధంగా మళ్లించేసిందీ వివరిస్తూ తాము నిధులు, అధికారాలు లేక ఏ విధంగా చేష్టలుడిగిపోయి ఉన్నామో చెప్పారు. స్థానిక సంస్థల చట్టాలు, విధులు, నిధుల వినియోగంపై సాధికారత కలిగిన శ్రీ చెల్లప్ప గారు, డా.ఈడిగ వెంకటేష్ గారు లాంటి మేధావులు, ఆచార్యులతో కూడా ఆ రోజు చర్చించాము. ఉపాధి హామీ నిధులను సద్వినియోగం చేసుకోవడం, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జల్ జీవన్ మిషన్ ద్వారా పల్లెలకు రక్షిత తాగు నీరు అందించి ప్రజల దాహార్తి తీర్చేందుకు కృషి చేస్తాను.

‘‘వృక్షో రక్షతి రక్షితః అనే సూక్తి నా మదిలో ఎప్పుడూ మారుమోగుతుంటుంది. ఒక్క వృక్షాన్ని రక్షించుకుంటేనే మానవ కోటికి ఎంతో మేలు కలుగుతున్నప్పుడు.. మరి లక్షలాది వృక్షాలను తన గర్భాన నిలుపుకున్న అడవి తల్లిని కంటికి రెప్పలా కాపాడుకుంటే ఎంతో మేలు కలుగుతుంది. అడవుల విధ్వంసమే కరువు కాటకాలకు హేతువు. అటువంటి అడవులను కంటికి రెప్పలా కాపాడతాము. ఎర్రచందనం, అటవీ సంపద అక్రమ రవాణాపై ఉక్కు పాదం మోపుతాము. అడవుల వినాశనానికి పాల్పడినా, ప్రయత్నించినా ఎంతటి వారైనా సరే కటకటాల వెనక్కు వెళ్ళవలసిందే. సామాజిక వనాలను పెంచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. తీర ప్రాంతాల్లో మడ అడవుల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. శాస్త్ర, సాంకేతిక విభాగాలు మానవాళి శ్రేయస్సుకు, లోక కళ్యాణానికి అత్యంత అవశ్యం’’ అని పవన్ కళ్యాన్ అన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap people
  • ap political
  • Pawan Kalyan

Related News

Ustaad Bhagat Singh Tiket P

Ustaad Bhagat Singh : తెలంగాణ లో సాధారణ టికెట్ ధరలతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’

తెలంగాణలో 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాకు సంబంధించి ఆన్‌లైన్ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అయితే, ఫ్యాన్స్‌కు మరియు సామాన్య ప్రేక్షకులకు ఊరటనిచ్చే అంశం

  • Ustaad Bhagat Singh Trailer

    ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ ట్రైల‌ర్ వ‌చ్చేసిందోచ్‌!!

  • Janasena 13th Formation Day

    Janasena Formation Day : ‘జనసేన’కు 13 ఏళ్లు.. సామాన్యుడి గొంతుక నుంచి డిప్యూటీ సీఎం వరకు.. ఒక చారిత్రక ప్రయాణం!

Latest News

  • Telangana Assembly Session : ఫ్రీ కరెంట్ పై భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు

  • Pure Power’s Newest Showroom : విజయనగరంలో ప్యూర్ పవర్ సరికొత్త షోరూమ్ ఓపెనింగ్

  • SBI LIfe: హైదరాబాద్‌లో ఎస్‌బీఐ లైఫ్ 59వ శాఖ ప్రారంభం

  • Renu Desai : రేణూ దేశాయ్ పై అసభ్య పోస్టులు.. ఇద్దరి అరెస్ట్

  • Gas Shortage : గ్యాస్ కొరతతో తిరుమలలో పలు దుకాణాలు మూసివేత!

Trending News

    • మీరు సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయాల‌ని చూస్తున్నారా?

    • వరల్డ్ కప్ 2027.. వెస్టిండీస్‌కు చోటు క‌ష్ట‌మే?!

    • స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుకు కొత్త కెప్టెన్‌?!

    • పంజాబ్ కింగ్స్‌కు ఆందోళ‌న‌గా మారిన స్టార్ ప్లేయ‌ర్స్‌?!

    • ఐపీఎల్‌కు ముందు సూర్య‌వంశీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd