HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Minister Seethakka Review Of Arogya Lakshmi Scheme

Arogya Lakshmi Scheme: ఆరోగ్య ల‌క్ష్మీ ప‌థ‌కంపై మంత్రి సీత‌క్క స‌మీక్ష

గ‌ర్భిణీలు, బాలింత‌ల‌కు పోష‌కాహరం అందించే ల‌క్ష్యంతో ప్ర‌భుత్వం ఆరోగ్య ల‌క్ష్మీ ప‌థ‌కాన్ని అమలు చేస్తుంది. ఇందులో బాగంగా ప్ర‌తి రోజ 200 ఎంఎల్ పాల‌ను గ‌ర్భిణీలు, బాలింత‌ల‌కు అంగ‌న్ వాడీ కేంద్రాల ద్వారా పంపిణి చేస్తారు.

  • Author : Gopi Date : 30-11-2024 - 7:06 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Arogya Lakshmi Scheme
Arogya Lakshmi Scheme

Arogya Lakshmi Scheme: అంగ‌న్ వాడీ కేంద్రాలకు చేసే పాల స‌ర‌ఫ‌రాలో ఎటువంటి గ్యాప్స్ లేకుండా ప‌టిష్ట చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మ‌హిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్ట‌ర్ ద‌న‌స‌రి అన‌సూయ సీత‌క్క ఆదేశాలు జారీచేశారు. మారు మూల ప్రాంతాల్లోని అంగ‌న్వాడీ కేంద్రాల‌ను స‌కాలంలో పాల స‌ర‌ఫ‌రా జ‌ర‌గాల్సిందేన‌ని స్ప‌ష్టం చేశారు. పోష‌కాహ‌ర తెలంగాణ ల‌క్ష్యంగా ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ఆరోగ్య ల‌క్ష్మీ ప‌థ‌కం (Arogya Lakshmi Scheme)పై మంత్రి సీత‌క్క శ‌నివారం నాడు స‌చివాలయంలో త‌న చాంబ‌ర్‌లో స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. అంగ‌న్వాడీ కేంద్రాలకు జ‌రుగుతున్న‌ పాల స‌ప్లై పై మ‌హిళా శిశు సంక్షేమ శాఖ కార్య‌ద‌ర్శి అనితా రామ‌చంద్ర‌న్, డైరెక్ట‌ర్ కాంతి వెస్లీ, ఇత‌ర ఉన్న‌తాధికారుల‌తో క‌లిసి మంత్రి సీత‌క్క స‌మీక్షించారు.

గ‌ర్భిణీలు, బాలింత‌ల‌కు పోష‌కాహరం అందించే ల‌క్ష్యంతో ప్ర‌భుత్వం ఆరోగ్య ల‌క్ష్మీ ప‌థ‌కాన్ని అమలు చేస్తుంది. ఇందులో బాగంగా ప్ర‌తి రోజ 200 ఎంఎల్ పాల‌ను గ‌ర్భిణీలు, బాలింత‌ల‌కు అంగ‌న్ వాడీ కేంద్రాల ద్వారా పంపిణి చేస్తారు. ప్ర‌భుత్వ విజ‌య డెయిరీ టెట్రా ప్యాకెట్ల‌ అంగ‌న్ వాడీ కేంద్రాల‌కు స‌ప్లై చేస్తుంది. గ‌త డిసెంబ‌ర్ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు 1.67 కోట్ల లీట‌ర్ల స‌ర‌ఫ‌రా కోసం ఆర్డ‌ర్ చేయ‌గా.. 1.56 కోటి లీట‌ర్ల పాల‌ను విజ‌యా డెయిరీ స‌ర‌ఫ‌రా చేయ‌గలిగింది. అంటే 94 శాతం మేర స‌ప్లై చేయ‌గ‌లిగింది. అయితే కొన్ని అంగ‌న్ వాడీ సెంట‌ర్ల‌కు స‌కాలంలో పాలు స‌ప్లై కాక‌పోవ‌డం ప‌ట్ల మంత్రి సీత‌క్క సీరియ‌స్ అయ్యారు.

అంగన్వాడీ కేంద్రాలకు ప్ర‌భుత్వం కోరినంత మేర పాలు సరఫరా చేయగలరా? లేదా?..అంత సామ‌ర్ధ్యం ఉందా? లేదా? స‌రిపోయినంత స‌ప్లై చేసే శ‌క్తి లేక‌పోతే..మీ ఇండెంట్ ను త‌గ్గించి ఇత‌ర సంస్థ‌ల ద్వారా స‌ప్లై చేసుకోవాలా అని విజ‌య డెయిరీ ప్ర‌తినిధుల‌ను మంత్రి సీత‌క్క‌ ప్ర‌శ్నించారు. మ‌రో మూడు నెల‌ల పాటు అవ‌కాశం ఇస్తామ‌ని..పాల స‌ర‌ఫ‌రా సంతృప్తిక‌రంగా లేక‌పోతే ప్ర‌భుత్వం క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకోవాల్సి వ‌స్తుందని హెచ్చ‌రించారు. ప్ర‌భుత్వ విజ‌య డెయిరీ రైతుల నుంచి పాల‌ను సేక‌రిస్తుంద‌ని… అందుకే రైతుల ప్ర‌యోజ‌నాలు కాపాడేందుకు విజ‌య డెయిరీ నుంచి పాల‌ను కొనుగోలు చేస్తున్నామ‌ని గుర్తు చేశారు.

Also Read: Bangladesh Hindus : బంగ్లాదేశ్ హిందువులకు అండగా నిలవండి.. మోడీ సర్కారుకు ఆర్ఎస్ఎస్ పిలుపు

రైతుల ప్ర‌యోజ‌నాలను కాపాడటంతో పాటు త‌మ‌కు గ‌ర్భిణీలు, బాలింత‌లు, చిన్నారుల సంరక్ష‌ణ అంతే ముఖ్య‌మ‌ని మంత్రి సీత‌క్క స్ప‌ష్టం చేసారు. అందుకే అంగ‌న్ వాడీ కేంద్రాల‌కు జ‌రిగే పాల స‌ప్లై లో ఏలాంటి గ్యాప్స్ లేకుండా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆదేశాలు జారీ చేసారు. ఆరోగ్య తెలంగాణ‌, పోష‌కాహార తెలంగాణ నిర్మాణ‌మే ల‌క్ష్యంగా త‌మ ప్ర‌భుత్వం ప‌నిచేస్తుందని.. ఆ ల‌క్ష్యాన్ని చేరుకునే దిశ‌గా ప‌నిచేయాల‌ని ఆదేశించారు.

అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా అయ్యే పాల నాణ్యతను స్వ‌యంగా రుచి చూసి మంత్రి సీత‌క్క ప‌రిశీలించారు. పాల నాణ్య‌త ప‌ట్ల సంతృప్తి వ్య‌క్త ప‌రిచారు. ప్ర‌స్తుతం లీట‌ర్ టెట్రా ప్యాక్ ను రూ.57 కి విజ‌య డెయిరీ స‌ర‌ఫ‌రా చేస్తుంది. ధ‌ర‌ల‌ను స‌వ‌రించాల‌ని విజ‌యా డెయిరీ ప్ర‌తిపాదించ‌గా.. మంత్రి తిర‌స్క‌రించారు. మూడు నెల‌ల పాటు ఏలాంటి గ్యాప్స్ లేకుండా పాల‌ను స‌ర‌ఫ‌రా చేసిన త‌ర్వాత మ‌రో సారి స‌మీక్షించి ధ‌ర‌ల పెంపుపై నిర్ణ‌యం తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు మంత్రి సీత‌క్క‌.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Arogya Lakshmi Scheme
  • CM Revanth Reddy
  • Congress Govt
  • Minister Seethakka
  • Seethakka Review
  • telangana
  • telangana news
  • telugu news

Related News

Ntr Statue Ammerpet

NTR : అమీర్‌పేట్ చౌరస్తాలో నేడు ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ.. ముఖ్య అతిధిగా సీఎం రేవంత్ రెడ్డి

తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని అమీర్‌పేట్ చౌరస్తాలో ఆయన విగ్రహాన్ని నేడు ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సీఎం రేవంత్ రెడ్డి హాజ‌రుకానున్నారు. సీఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజ‌రుకానున్నారు. ఇటు టీడీపీ నాయకులు, సినీ ప్రము

  • Ntrs Birth Anniversary Junior Ntr Kalyan Ram Ntr Ghat Hyderabad Ntr

    NTR : ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఘాట్ వద్ద నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్

  • Transfers

    Telangana : రాష్ట్ర రెవెన్యూ శాఖలో భారీ మార్పులు.. 12 మంది అధికారుల బదిలీ

  • Ev Bus

    EV Bus : కాలుష్యానికి చెక్.. నగర రోడ్లపైకి 60 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు

  • Cm Revanth Reddy

    Telangana : కొత్త డిజైన్లతో ఇందిరమ్మ చీరలు.. లబ్ధిదారులకు త్వరలో అందుబాటులోకి

Latest News

  • Food Safety : మదీనగూడలో ఫుడ్ సేఫ్టీ దాడులు.. గిస్మత్ జైల్ మండీకి షోకాజ్ నోటీసు

  • Hawala Cash : దేవగిరి ఎక్స్‌ప్రెస్‌లో భారీ నగదు పట్టివేత.. హ‌వాలా డ‌బ్బుగా పోలీసుల అనుమానాం

  • IPL 2026 : సూర్యవంశీ విధ్వంసం.. క్వాలిఫయర్-2లోకి దూసుకెళ్లిన రాజస్థాన్ రాయల్స్

  • BYST : ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!

  • BRS : కేటీఆర్, హరీష్ రావు తమ కార్యకర్తలకు బోధిస్తున్న సిద్ధాంతం ఇదేనా?.. తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

    • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

    • Oil Crisis: సంక్షోభం రాబోతుంది.. ‘రెడ్‌ జోన్‌’లోకి చమురు మార్కెట్‌

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd