Ponnam Prabhakar : రాజకీయాలకు అతీతంగా హైదరాబాద్ అభివృద్ధి చేసుకుందాం: మంత్రి పొన్నం
డ్రగ్స్ ఫ్రీ సిటీ కి తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. కొన్ని మెడికల్ షాపులలో డ్రగ్స్ సంబంధిత ఔషధాలు బయటపడుతున్నాయన్న ఎమ్మెల్యేల పిర్యాదు తో అలాంటివి ఏం ఉన్న తక్షణమే సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు.
- By Latha Suma Published Date - 08:09 PM, Mon - 22 July 24

Minister Ponnam Prabhakar: హైదరాబాద్ నగర ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా శాసన సభ బడ్జెట్ సమావేశాల్లోపు నగర అభివృద్ధి పలు నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలు ,బడ్జెట్ లో నగరానికి కావాల్సిన అవసరాల పై హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ గారి అధ్యక్షతన హైదరాబాద్ జిల్లా అభివృద్ధి పై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నగర ఎమ్మెల్యేలు శ్రీ గణేష్,కాలేరు వెంకటేష్,ముఠా గోపాల్, ఎంఐఎం ఎమ్మేల్యేలు మహమ్మద్ ముబిన్, కౌసర్ మోహినుద్ధిన్, అబ్దుల్లా బలాల , మాజిద్ హుస్సేన్ ,జాఫర్ హుస్సేన్ ఎమ్మెల్సీలు బలమురి వెంకట్ , ప్రభాకర్ రావు, మీర్జా రియాజ్ ఉల్ హుస్సేన్ ఎఫండి ,మీర్జా రహమాన్ , తదితరులు పాల్గొన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
శాసన సభ బడ్జెట్ సమావేశాల్లోపు రాజకీయాలకు అతీతంగా నగర ఎమ్మేల్యేలు ,ఎమ్మెల్సీలతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు ,ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని కలిసి నగర అభివృద్ధికి కావాల్సిన అవసరాలు , పెండింగ్ బిల్లులు , నగరంలో జరుగుతున్న ఎస్ఆర్డిపి, ఎస్ఎన్డిపి పనుల పురోగతి తదితర అంశాలపై విజ్ఞప్తి చేయాలని సమావేశంలో చర్చించారు. నగరంలో డెంగ్యూ కేసులు రాకుండా వైద్యాధికారులు జాగ్రత్త చర్యలు చేపట్టాలని నీళ్ళు నిల్వ ఉండకుండా జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జీహెచ్ఎంసీ ,హెచ్ఎండిఎ,వాటర్ వర్క్స్ , ఎలక్ట్రిసిటీ పలు సమస్యలు , పెండింగ్ బిల్స్, ప్రస్తుతం వర్క్స్ కి అవసరమైన నిధులు హైదరాబాద్ అవసరాలు ఇవి అనే విధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతామని తెలిపారు.
Read Also: Nadendla Manohar : జనసేన డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా నాదెండ్ల మనోహర్
డ్రగ్స్ ఫ్రీ సిటీ కి తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. కొన్ని మెడికల్ షాపులలో డ్రగ్స్ సంబంధిత ఔషధాలు బయటపడుతున్నాయన్న ఎమ్మెల్యేల పిర్యాదు తో అలాంటివి ఏం ఉన్న తక్షణమే సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. నగరంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ పై తీసుకుంటున్న చర్యలు ,లా అండ్ ఆర్డర్ పై హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి ని అడిగి తెలుసుకున్నారు. నగరంలో గురుకులాలు ,ప్రభుత్వ హాస్టల్ లు , స్కూల్ లు తదితర వాటిపై ఎమ్మేల్యేలు అధికారులు తనిఖీ చేపట్టాలని కోరారు. అప్పుడే విద్యార్థులకు ఒక భరోసా ఇవ్వగలమని సూచించారు.. నగరంలో స్కూల్ లలో ఉన్న పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. పాఠశాలలో తాగు నీటి సమస్యలు లేకుండా చూడాలని హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అధికారులను ఆదేశించారు. అన్నిటినీ క్రోడీకరించి హైదరాబాద్ అభివృద్ధి పై ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ బ్రాండ్ ఇమెజ్ తగ్గకుండా మరింత పెంచేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
Read Also: Delhi Liquor Scam: కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ ఆగస్టు 5కి వాయిదా
సమీక్షా సమావేశంలో భాగంగా నగర ఎమ్మెల్యేలు నియోజకవర్గ సమస్యల పై మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చారు. వాటన్నిటిపై వెంటనే అధికారులతో మాట్లాడి అక్కడ తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశించారు. కంటోన్మెంట్ లో నీటి ఇబ్బందులు తీవ్రంగా ఉన్నాయని ఎమ్మెల్యే శ్రీ గణేష్ మంత్రి గారి దృష్టికి తీసుకురాగా దానిని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ఇతర అంశాలపై ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి సమస్యలు పరిష్కారం చేసుకుందామని హామీ ఇచ్చారు.. అధికారులు వారి డిపార్ట్మెంట్ లలో తీసుకుంటున్న చర్యలపై సమావేశంలో చర్చించారు జీహెచ్ఎంసీ ,హైదరాబాద్ లా అండ్ ఆర్డర్,వాటర్ వర్క్స్, ఎలక్ట్రిసిటీ తదితర అంశాలపై అధికారులు చర్చించారు. ఈ సమావేశానికి పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ,జీహెచ్ ఎంసీ కమిషనర్ అమ్రాపాలి , హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురశెట్టి ,HWMS అశోక్ రెడ్డి , CDPCLMD ముస్తఫా ,అడిషనల్ సీపీ లా అండ్ ఆర్డర్ vs మాన్ ,అడిషనల్ సీపీ ట్రాఫిక్ విశ్వ ప్రసాద్ ,సెంట్రల్ జోన్ డీసీపీ అక్షన్ష్ యాదవ్ వివిధ విభాగాల అధికారులు హాజరయ్యారు.