Delhi Liquor Scam: కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ ఆగస్టు 5కి వాయిదా
ఢిల్లీ లిక్కర్ సీబీఐ కేసులో డిఫాల్ట్ బెయిల్ కోసం కవిత దాఖలు చేసిన పిటిషన్ విచారణ మరోసారి వాయిదా పడింది. సోమవారం ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగగా, విచారణను ఆగస్టు 5కి వాయిదా వేసింది.
- By Praveen Aluthuru Published Date - 06:41 PM, Mon - 22 July 24

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ కేసులో తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ మళ్ళీ వాయిదా పడింది. గత కొన్ని నెలలుగా ఆమె బెయిల్ పిటిషన్ పై విచారణ జరుపుతున్నప్పటికీ ఆమెకు బెయిల్ నిరాకరిస్తూ వస్తుంది కోర్టు. ఆమెపై ఈడీ, సీబీఐ కేసులు నమోదు చేయడంతో బెయిల్ క్లిష్టంగా మారింది. తాజాగా ఆమె బెయిల్ పిటిషన్ మళ్ళీ వాయిదా పడింది.
ఢిల్లీ లిక్కర్ సీబీఐ కేసులో డిఫాల్ట్ బెయిల్ కోసం కవిత దాఖలు చేసిన పిటిషన్ విచారణ మరోసారి వాయిదా పడింది. సోమవారం ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగగా, విచారణను ఆగస్టు 5కి వాయిదా వేసింది. 60 రోజుల గడువులోగా పూర్తి ఛార్జిషీటు దాఖలు చేయడంలో సీబీఐ విఫలమైందని వాదిస్తూ జూలై 8న కవిత న్యాయ బృందం పిటిషన్ వేసింది. అయితే విచారణ సందర్భంగా కవిత తరఫు న్యాయవాదులు 2024 ఏప్రిల్ 11న ఆమెను అరెస్టు చేయడం చట్ట విరుద్ధమని, జూన్ 7న సీబీఐ అసంపూర్తిగా ఛార్జ్ షీట్‌ను సమర్పించిందని ఆరోపించారు.
సీబీఐ ఛార్జిషీట్‌లోని వ్యత్యాసాలను కోర్టు గుర్తించి, దాని ఖచ్చితత్వంపై ఆందోళన వ్యక్తం చేసింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) 167(2) ప్రకారం కవిత డిఫాల్ట్ బెయిల్‌కు అర్హులు. ఎందుకంటే ఎదుర్కొన్న అభియోగాలకు ఏడేళ్ల జైలుశిక్ష, గరిష్టంగా 60 రోజుల కస్టడీకి అవకాశం ఉంటుంది. జూలై 6 నాటికి కవిత 86 రోజుల కస్టడీని పూర్తి చేసింది. తద్వారా ఆమె న్యాయ బృందం డిఫాల్ట్ బెయిల్ కోసం దాఖలు చేసింది. ఈ అంశంపై గతంలో చర్చలు జరిగినప్పటికీ, ఇప్పుడు కోర్టు తదుపరి విచారణ తేదీని ఆగస్టు 5కి నిర్ణయించింది.
Also Read: Lakshmi Devi: రోజు ఇలా చేస్తే చాలు.. లక్ష్మి అనుగ్రహం కలగడం ఖాయం?