ROR Act 2024 : త్వరలోనే ROR చట్టాన్ని తీసుకురాబోతున్నాం: మంత్రి పొంగులేటి
ROR Act 2024 : పదేళ్లుగా భూమి ఉన్న రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని తెలిపారు. భూమి ఉన్న ప్రతి ఒక్క ఆసామికి భరోసా ఇవ్వాలనేదే తమ ఆలోచన అని అన్నారు. ఈ నెలాఖరులోగా కొత్త ROR చట్టాన్ని అమలు చేస్తామని చెప్పారు.
- By Latha Suma Published Date - 05:33 PM, Sun - 6 October 24

Minister Ponguleti Srinivas Reddy : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం ఎంసీఆర్ హెచ్ఆర్డీలో రాష్ట్రంలోని డిప్యూటీ కలెక్టర్లు, 257 రెవెన్యూ డిపార్ట్ మెంట్ అధికారులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. త్వరలో ROR చట్టం 2024 చట్టం తీసుకురాబోతున్నామని… ఈ చట్టం దేశంలో ఆదర్శంగా ఉండబోతుందని వెల్లడించారు. పదేళ్లుగా భూమి ఉన్న రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని తెలిపారు. భూమి ఉన్న ప్రతి ఒక్క ఆసామికి భరోసా ఇవ్వాలనేదే తమ ఆలోచన అని అన్నారు. ఈ నెలాఖరులోగా కొత్త ROR చట్టాన్ని అమలు చేస్తామని చెప్పారు. ఈ మేరకు అధికారులకు పలు సూచనలు చేశారు. ‘970 ఎమ్మార్వోలతో సమావేశం కూడా అయ్యాం అన్నారు.
గత 10 ఏళ్లుగా అనేకమంది భూమి ఉన్న రైతులు అనేక ఇబ్బందులు పడ్డారు. ఈ చట్టం దేశంలో ఆదర్శంగా ఉండబోతుంది. అధికారుల సూచనలు తీసుకుంటున్నాం. 10,900 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ప్రతి రెవెన్యూ విలేజ్ కి రెవెన్యూ అధికారిని నియమించాలని అధికారులు కోరుతున్నారు. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశం అయ్యి ఇంకా అనేక అంశాలపై చర్చిస్తాం. కొత్త మండలాలను, కొత్త జిల్లాలను అనౌన్స్ చేశారు. కానీ వాటికి కనీసం ఆఫీసులు లేవు. వాటికి ఆఫీసులను ఆర్థిక వెసులుబాటును చూసుకుని ఏర్పాటు చేయబోతున్నాం. ఇందిరమ్మ రాజ్యంలో ఆర్ఓఆర్ చట్టం-2024 తీసుకురాబోతున్నాం. భూములు ఉన్న ప్రతి ఒక్క ఆసామికి భరోసా ఇవ్వాలనేదే మా ఆలోచన. మంచి పాలన రాబోయే రోజుల్లో అందిస్తాం’ అంటూ మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.