HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Massive Fire Breaks Out In Crackers Shop At Rajendra Nagar

Fire Breaks Out in Crackers Shop : రాజేంద్ర నగర్‌లోని క్రాకర్స్ షాప్ లో భారీ అగ్నిప్రమాదం

రాత్రి వేళ దుకాణాల్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు

  • Author : Sudheer Date : 11-11-2023 - 10:03 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Fire Accident At Sun City
Fire Accident At Sun City

హైదరాబాద్ రాజేంద్ర నగర్ (Rajendra Nagar) లోని సన్‌సిటీ (Sun City) వద్ద క్రాకర్స్‌ షాపు (Crackers Shop)లో భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) చోటుచేసుకుంది. పక్కనే ఉన్న ఫుడ్‌ కోర్టుకు మంటలు వ్యాపించడంతో.. అందులోని గ్యాస్ సిలిండర్ పేలడం తో పెను ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పక్కనే ఉన్న మరో మూడు షాఫులకు కూడా ఈ మంటలు విస్తరించాయి. 4 ఫైరింజన్లతో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది..మంటలను అదుపు చేస్తున్నారు. రాత్రి వేళ దుకాణాల్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఇదిలా ఉండగా అగ్ని ప్రమాదానికి గురైన టపాసుల షాప్ కు ఇప్పటివరకు అధికారులు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని.. బండ్లగూడ జాగిర్ మున్సిపల్ సిబ్బంది,పోలీసులు తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

మరోపక్క దేశ వ్యాప్తంగా దీపావళి (Diwali) వేడుకలు మొదలయ్యాయి. జాతి, కుల, మత, వర్గ విభేదాలకు అతీతంగా అంత సమైక్యంగా జరుపుకునే పండుగే దీపావళి. నరకాసురుడనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి (Diwali Celebrations) చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. అలాగే లంకలోని రావణుడిని సంహరించి శ్రీరాముడు సతీసమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినపుడు కూడా ప్రజలు ఆనందోత్సవాల మధ్య దీపావళిని జరుపుకున్నారని రామాయణం చెపుతోంది. చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు.

కుటుంబ సభ్యులంతా క్రాకర్స్ కాలుస్తూ దీపావళి జరుపుకుంటుంటారు. కాకపోతే క్రాకర్స్ పేల్చేటప్పుడు చాల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తునప్పటికీ కొంతమంది అశ్రద్ధ వహిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. ముఖ్యంగా బాణా సంచా షాప్స్ లలో అనేక జాగ్రత్తలు వహిచాల్సి ఉంటుంది. ఏ చిన్న పొరపాటు జరిగిన పెను ప్రమాదానికి దారి తీస్తుంది.

Read Also : Rishabh Pant: వచ్చే ఐపీఎల్ కు రిషబ్ పంత్ రెడీ: సౌరవ్ గంగూలీ


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Crackers shop
  • Fire Accident
  • hyderabad

Related News

Shivapratap Shukla Appointed As Telangana New Governor

నేడు హైదరాబాద్‌కు కొత్తగవర్నర్ రాక.. స్వాగతం పలకనున్న సీఎం రేవంత్ రెడ్డి

Telangana New Governor  తెలంగాణ రాజకీయ యవనికపై కొత్త మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్ర నూతన గవర్నర్‌ శివప్రతాప్ శుక్లా నేడు భాగ్యనగరంలో అడుగుపెట్టనున్నారు. గతంలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా పనిచేసిన ఆయన, ఇప్పుడు తెలంగాణలో బాధ్యతలు చేపట్టబోతున్నారు. కాసేపట్లో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్న శుక్లాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు ఘనంగా స్వాగతం

  • Fish In Beer Bottle

    మద్యం ప్రియుడికి షాక్..బీర్ బాటిల్‌లో చేప పిల్ల కలకలం

  • Ghmc

    జీహెచ్ఎంసీలో పన్నులు ఎగ్గొట్టిన వారి జాబితా సిద్దం.. త్వరలో వీరి ఆస్తులు సీజ్..!

  • Kuktapally Nallacheruvu

    Hyderabad : మరో రెండు చెరువులకు పునరుజ్జీవం పోసిన హైడ్రా !!

  • Motorists Queue For Petrol

    యుద్ధం ఎఫెక్ట్ : హైదరాబాద్ లో పెట్రోల్ కోసం బారులు తీరిన వాహనదారులు

Latest News

  • మార్షల్ ఆర్ట్స్‌తో పవన్ ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేసిన శ్రీయా రెడ్డి

  • Janganana 2027: ఏపీలో మే 1 నుంచి హౌస్ లిస్టింగ్

  • Open Offer : మావోయిస్టులకు కొత్తగూడెం ఎమ్మెల్యే ఓపెన్ ఆఫర్ !!

  • Kavitha : కాంగ్రెస్ సర్కార్ తీరుపై కవిత ఆగ్రహం

  • OTT : OTT ప్రేక్షకులకు ఈ వారం పండగే !!

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd