Telangana: నవంబర్ 30న సెలవు ఇవ్వకపోతే కఠిన చర్యలు
తెలంగాణలోని అన్ని కంపెనీలకు నవంబర్ 30న సెలవు ప్రకటించడం తప్పనిసరి అని ఎన్నికల సంఘం మంగళవారం తెలిపింది. గతంలో 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల సమయంలో ఐటీ కంపెనీలు సహా కొన్ని ప్రైవేట్ సంస్థలు
- By Praveen Aluthuru Published Date - 05:43 PM, Tue - 28 November 23

Telangana: తెలంగాణలోని అన్ని కంపెనీలకు నవంబర్ 30న సెలవు ప్రకటించడం తప్పనిసరి అని ఎన్నికల సంఘం మంగళవారం తెలిపింది. గతంలో 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల సమయంలో ఐటీ కంపెనీలు సహా కొన్ని ప్రైవేట్ సంస్థలు తమ ఉద్యోగుల హక్కును వినియోగించుకునేందుకు సెలవు ప్రకటించలేదని ఫిర్యాదులు అందాయని ఈరోజు విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.నవంబర్ 30న సెలవు ఇవ్వని సంస్థలపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్ర కార్మిక కమిషనర్‌ను ఆదేశించింది. దీంతో రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కారణంగా తెలంగాణ ఉద్యోగులు, కార్మికులందరికీ నవంబర్ 30వ తేదీని ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 30న జరగనుండగా, డిసెంబర్ 3న కౌంటింగ్ జరగనుంది.
Also Read: Uttarkashi Tunnel Collapse: ఉత్తరకాశీ టన్నెల్ ప్రమాదం ఎలా జరిగింది? దాని కథేంటి ?