HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Man Brutally Murdered In Siddipet Dist

Murdered: పేకాటలో ఘర్షణ.. వ్యక్తి దారుణ హత్య

పేకాడుతున్న వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణలో ఒక వ్యక్తిని, మరో వ్యక్తి దారుణంగా హత్య చేసిన సంఘటన

  • Author : Gopi Date : 24-11-2022 - 10:11 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Son Killed Father
Crime Scene

పేకాడుతున్న వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణలో ఒక వ్యక్తిని, మరో వ్యక్తి దారుణంగా హత్య చేసిన సంఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం తిమ్మాపూర్ గ్రామంలో బుధవారం రాత్రి 10 గంటలకు చోటుచేసుకుంది. దుబ్బాక సీఐ మున్నూరు కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. తిమ్మాపూర్ గ్రామానికి చెందిన జోరబొంతుల నాగరాజు (36) అనే వ్యక్తి గ్రామంలో కూలీ పని చేస్తూ, భార్యా పిల్లలతో జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం తన ఇంటి నుంచి ద్విచక్రవాహనంపై గ్రామంలోని పల్లె ప్రకృతి వనం వద్దకు వెళ్లి దానబోయిన రామచంద్రం అలియాస్ స్వామి, గడ్డం శ్రీను, నిరటి బాలయ్య అనే ముగ్గురు వ్యక్తులతో పల్లె ప్రకృతి వనం లోపల పేకాట ఆడుతున్నారు.

అప్పటికే వీరంతా మద్యం తీసుకున్నారు. కొంత సమయం తర్వాత అక్కడి నుంచి నీరటి బాలయ్య వెళ్లిపోయాడు. ఈ క్రమంలో పేకాట ఆడుతున్న ముగ్గురు వ్యక్తుల మధ్య వివాదం తలెత్తడంతో నాగరాజును, దానబోయిన రామచంద్రం అనే వ్యక్తి అక్కడున్న కర్రతో తలపై పలుమార్లు బలంగా బాధడంతో నాగరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం రామచంద్రం అక్కడి నుంచి పరారు కాగా.. గడ్డం శ్రీను జరిగిన విషయం గ్రామస్తులకు తెలిపి పారిపోయాడు. వెంటనే గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు.

అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం దుబ్బాక వంద పడకల ఆసుపత్రికి తరలించారు. కర్రతో కొట్టి చంపి పారిపోయిన వ్యక్తి, సహకరించిన మరో వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మృతుని భార్య బాలలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సిఐ తెలిపారు. ఘటన స్థలాన్ని సిద్దిపేట ఏసిపి చల్లా దేవారెడ్డి , సీఐ కృష్ణ, ఎస్ఐ మహేందర్ పరిశీలించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Brutally Murdered
  • crime
  • crime news
  • siddipet
  • telangana

Related News

Asaduddin Owaisi

Asaduddin Owaisi : యూసీసీ, నమాజ్ వివాదంపై ఒవైసీ ఘాటు స్పందన

దేశవ్యాప్తంగా ముస్లింలపై జరుగుతున్న దాడులు, వివక్షాత్మక చర్యలను ఖండిస్తూ అస‌దుద్దీన్ ఓవైసీకీలక వ్యాఖ్యలు చేశారు. రోడ్లపై నమాజ్ చేయడాన్ని తప్పుపడుతున్న వారు అదే ప్రమాణాన్ని అన్ని మతాల వీధి వేడుకలకూ వర్తింపజేయాలని ఆయన అన్నారు. హైదరాబాద్‌లోని ఏఐఎంఐఎం ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సభలో మాట్లాడిన ఒవైసీ.. దేశంలో ముస్లింలను రెండో తరగతి పౌరులుగా మార్చే ప్రయత్నాలు జరుగ

  • Cm Revanth

    Telangana : ఉద్యోగులకు ఇచ్చిన హామీ నెరవేర్చిన రేవంత్ ప్రభుత్వం

  • Ministers

    Telangana : ధాన్యం సేకరణ జాప్యంపై మీడియా ప్రశ్నలు.. దాట‌వేస్తూ వాకౌట్ చేసిన మంత్రులు

  • Arrest

    Advocate Murder Case : హైదరాబాద్ న్యాయవాది హత్య కేసులో ఏడుగురు అరెస్ట్

  • Hydraa

    HYDRAA : హైడ్రా ‘ఈగిల్ టీమ్’లో ట్రాన్స్‌జెండర్లకు చోటు

Latest News

  • Krishna Jayashankar : బాడీ షేమింగ్ నుంచి బంగారు పతకం వరకు.. కృష్ణ జయశంకర్ సరికొత్త చరిత్ర!

  • Telangana : గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నామినేషన్లపై సుప్రీంకోర్టులో విచారణ

  • Karnataka : కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్? నేడు సీఎల్పీ కీలక సమావేశం

  • BJP : గ్రేట‌ర్ ఎన్నిక‌ల ఓట్ల కోస‌మే ఎన్టీఆర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌.. కాంగ్రెస్‌పై టీబీజేపీ చీఫ్ ఫైర్‌

  • Vaibhav : శతకం మిస్సైనా చరిత్ర సృష్టించిన వైభవ్.. ఐపీఎల్‌లో పలు రికార్డులు బద్దలు

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd