HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Malla Reddy Shocking Reaction To Cm Revanth Reddy

Malla Reddy: రేవంత్ రెడ్డి సీఎం అవుతాడని నాకెప్పుడో తెలుసు: మల్లారెడ్డి

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మల్లారెడ్డి పేరు వింటే ఎంటర్టైన్మెంట్ పదం గుర్తుకు వస్తుంది. వయసు మీద పడినా ఇంకా తాను కుర్రాడినేనని చెప్పుకుంటూ కిక్ ఇచ్చే డైలాగులతో యువతను ఆకట్టుకుంటాడు. పాలు అమ్మినా అనే ఒక్క డైలాగ్ ద్వారా పాపులారిటీ సంపాదించిన మల్లారెడ్డి ప్రస్తుతం రాజకీయంగా కష్టాలను ఎదుర్కొంటున్నాడు.

  • Author : Vamsi Chowdary Korata Date : 17-03-2024 - 1:28 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Malla Reddy
Malla Reddy

Malla Reddy: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మల్లారెడ్డి పేరు వింటే ఎంటర్టైన్మెంట్ పదం గుర్తుకు వస్తుంది. వయసు మీద పడినా ఇంకా తాను కుర్రాడినేనని చెప్పుకుంటూ కిక్ ఇచ్చే డైలాగులతో యువతను ఆకట్టుకుంటాడు. పాలు అమ్మినా అనే ఒక్క డైలాగ్ ద్వారా పాపులారిటీ సంపాదించిన మల్లారెడ్డి ప్రస్తుతం రాజకీయంగా కష్టాలను ఎదుర్కొంటున్నాడు.

రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం మల్లారెడ్డిని టార్గెట్ చేసింది. ఆయన అక్రమ కట్టడాలపై ఫోకస్ చేస్తూ అక్రమంగా నిర్మించిన భవనాలను తొలగించే కార్యక్రమం పెట్టుకుంది. ఈ నేపథ్యంలో మల్లారెడ్డి యూటర్న్ తీసుకున్నాడు. ఇటీవల కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ని కలిసిన ఆయన రాష్ట్ర పరిస్థితుల్ని డీకేకి వివరించారు. దీంతో మల్లారెడ్డి ఫ్యామిలీ కాంగ్రెస్ లోకి వెళ్తుందన్న వార్తలు వైరల్ గా మారాయి. అయితే తాను కేవలం డీకే శివకుమార్ని మర్యాదపూర్వకంగానే కలిశానని చెప్పుకున్నప్పటికీ మల్లన్న మనసులో మరో ఆలోచన ఉన్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వంలో లేకపోతే ఎం జరుగుతుందో మల్లన్నకు తెలియంది కాదు. ఈ క్రమంలో మల్లారెడ్డి మరియు అతని కుటుంబ సభ్యులు కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్దమైనట్లు సమాచారం. అందుకే గత కొద్దీ రోజులుగా సీఎం రేవంత్ రెడ్డిని పొగడ్తలతో ముంచెత్తుతున్నాడు.

2014లో బొల్లారంలోని తోట ముత్యాలమ్మ దేవాలయంలో ఓ కార్యక్రమం గురించి మల్లారెడ్డి గుర్తు చేసుకున్నారు. రేవంత్ రెడ్డి కచ్చితంగా సీఎం అవుతాడని ఆనాడే చెప్పినట్లు మల్లారెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోను మల్లారెడ్డి విడుదల చేశారు.రెడ్డిలల్ల సీఎం అయ్యే ఛాన్స్ రేవంత్ రెడ్డికి ఒక్కడికే ఉందని పదేండ్ల కిందటే చెప్పానని మల్లారెడ్డి చెప్పుకొచ్చాడు. మరోవైపు తన కొడుకు భద్రారెడ్డి మల్కాజ్‌గిరి ఎంపీ టికెట్‌ కోసం బీజేపీ, కాంగ్రెస్‌ల నుంచి ప్రయత్నాలు చేసిన మాట వాస్తవమేనని అన్నాడు.

తాను బీఆర్ఎస్ లోనే ఉంటానని, మరో పార్టీలో చేరేది లేదని స్పష్టం చేశారు. గతంలో రేవంత్‌ రెడ్డిపై తొడగొట్టి వార్నింగ్ ఇచ్చిన విషయాన్నీ ప్రస్తావిస్తూ అదంతా కేవలం రాజకీయపరంగా మాత్రమే అని.. ఎలాంటి వ్యక్తిగత విభేదాలు తమ మధ్య లేవని చెప్పారు. గతంలో అందరం తెలుగుదేశం పార్టీలో స్నేహంగా మెలిగేవారమని అన్నారు.

Also Read: Pawan Kalyan : పవన్‌ సినిమాటిక్‌ యడ్‌.. ప్రజల్లో ప్రభావం చూపుతుందా..?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • cm
  • CM Revanth Reddy
  • congress
  • friendship
  • Malla Reddy
  • Reddy
  • tdp
  • telangana

Related News

Pavan Kalyan (1)

JSP : హైద‌రాబాద్‌లో జ‌న‌సేన స‌భ‌కు పోలీసుల అనుమ‌తి నిరాక‌ర‌ణ‌

రేపు (జూన్ 2వ) గచ్చిబౌలిలోని సంధ్యా కన్వెన్షన్‌లో జరగాల్సిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నవ నిర్మాణ సంకల్ప సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. తెలంగాణ రాజకీయ రంగంలో పార్టీ ఉనికిని బలోపేతం చేసే లక్ష్యంతో జరుగుతున్న ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి హైదరాబాద్‌కు రానున్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 2,000 మంది పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొంటార

  • NRI TDP

    NRI TDP : డల్లాస్ లో నార్త్ అమెరికా ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాంకు ఘనసత్కారం

  • TDP

    TDP vs YCP : డైవర్షన్ రాజకీయాల కోసం విగ్రహాల ధ్వంసం – మంత్రి అన‌గాని

  • Heavy Rain Forecast for Telangana

    Weather Report: తెలంగాణకు భారీ వర్షసూచన

  • Mynampalli Rohith

    Jaggareddy : మెదక్‌కు డైనమిక్ నాయకుడు అవసరం.. రోహిత్‌పై జగ్గారెడ్డి ప్రశంసలు

Latest News

  • Cockroach Janata Party: భారత్‌కు రానున్న కాక్రోచ్‌ జనతా పార్టీ వ్యవస్థాపకుడు

  • Cm Vijay: నా కడుపులో బిడ్డ చావుకు సీఎం విజయే కారణం: సంచలన ఆరోపణలు చేసిన నటి

  • CBN : డీఎస్సీ నుంచి విగ్రహాల ఘటనల వరకు వైసీపీ కుట్ర‌ల‌పై సీఎం ఫైర్

  • Bluetooth Name: కొంప ముంచిన బ్లూటూత్‌.. విమానం యూటర్న్‌.. ఎమర్జెన్సీ ల్యాండింగ్

  • Nara Lokesh: విశాఖలో ఎయిర్ ట్రంక్ క్యాంపస్ ఏర్పాటు..! మంత్రి నారా లోకేష్

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd