Crypto Scam In Telangana : రూ.100 కోట్ల క్రిప్టో కరెన్సీ స్కాం.. కుర్రిమెల రమేశ్‌గౌడ్ ఏం చేశాడంటే ?
జీబీఆర్ కాయిన్‌లలో(Crypto Scam In Telangana) పెట్టుబడి పెడితే భారీగా లాభాలు వస్తాయని ప్రజలను నమ్మించాడు.
- By Pasha Published Date - 09:23 AM, Tue - 14 January 25

Crypto Scam In Telangana : స్యామ్ బ్యాంక్‌మన్ ఫ్రైడ్(sam bankman-fried) అమెరికాలో భారీ క్రిప్టో కరెన్సీ స్కాం చేశాడు. అదే రీతిలో జరిగిన క్రిప్టో కరెన్సీ స్కాం ఒకటి తెలంగాణలో ఆలస్యంగా వెలుగుచూసింది. కుర్రిమెల రమేశ్‌గౌడ్ అనే వ్యక్తి ఈ కుంభకోణానికి పాల్పడ్డాడు. ‘జీబీఆర్ కాయిన్’ పేరిట ప్రజలకు కుచ్చుటోపీ పెట్టాడు.
Also Read :Cockfights Race : బరి.. హోరాహోరీ.. ఏపీలో ఒక్కరోజే రూ.330 కోట్ల కోడిపందేలు
కుర్రిమెల రమేశ్‌గౌడ్ చేసిన క్రిప్టో స్కాంపై ప్రస్తుతం తెలంగాణ సీఐడీ దర్యాప్తు చేస్తోంది. ఇప్పటివరకు దర్యాప్తులో పలు కీలక వివరాలను సీఐడీ గుర్తించింది. అవేంటో చూద్దాం..
- జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం నెల్లుట్లకు చెందిన రమేశ్‌గౌడ్ కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌కు చేరుకున్నాడు.
- రమేశ్‌గౌడ్ తొలుత ట్రావెల్స్, గంధం మొక్కల వ్యాపారం చేశాడు.
- తదుపరిగా జీబీఆర్ కాయిన్ పేరిట క్రిప్టో కరెన్సీ స్కాంకు కుర్రిమెల రమేశ్‌గౌడ్ తెర తీశాడు.
- జీబీఆర్ కాయిన్‌లలో(Crypto Scam In Telangana) పెట్టుబడి పెడితే భారీగా లాభాలు వస్తాయని ప్రజలను నమ్మించాడు.
- ఈక్రమంలో సింగపూర్, దుబాయ్‌లలోనూ మీటింగ్‌లను ఏర్పాటు చేశాడు. ఆ సమావేశాలు కేంద్రంగా పెట్టుబడులు సేకరించాడు. వాటిని జీబీఆర్ కాయిన్‌లలో పెట్టుబడి పెడతానని నమ్మించాడు.
- అయితే కుర్రిమెల రమేశ్‌గౌడ్ ఆ డబ్బులతో క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టలేదు.
- జీబీఆర్ కాయిన్ పేరిట ఒక నకిలీ వెబ్‌సైట్‌ను తయారు చేసి అందులో డబ్బులు పెట్టుబడిగా పెట్టినట్లు లెక్కలను క్రియేట్ చేశాడు. వాటినే తన పెట్టుబడిదారులకు చూపించాడు.
- ఆ నకిలీ వెబ్‌సైటులోకి లాగిన్ అయ్యేందుకు ప్రతీ పెట్టుబడిదారుడికి ఒక యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లను అందించాడు. వారు ఆ వెబ్‌సైటులోకి లాగిన్ కాగానే పెట్టుబడి వివరాలు, లాభాల వివరాలు కనిపించేలా ఏర్పాట్లు చేశాడు.
- కొన్ని రోజుల పాటు ఆ వెబ్‌సైటులో కనిపించే పెట్టుబడుల నుంచి డబ్బులను ఉపసంహరించుకునే అవకాశాన్ని రమేశ్ గౌడ్ కల్పించాడు. తద్వారా తనపై నమ్మకాన్ని పెంచుకున్నాడు.
- తన సంస్థలో చేరిన వారి ద్వారా మరికొంత మందిని చేర్పించుకున్నాడు. ఈవిధంగా ఛైన్ సిస్టమ్‌లో వ్యాపారం చేయడంపై మన దేశంలో బ్యాన్ ఉంది.
- చివరకు రూ.100 కోట్ల దాకా పెట్టుబడులు జమ అయిన వెంటనే వ్యాపారం ఆపేశాడు. వెబ్‌సైట్ హ్యాక్ అయిందని బుకాయించాడు. పెట్టుబడి పెట్టిన వాళ్లను కలవడం ఆపేశాడు.
- కరీంనగర్‌కు చెందిన మనోజ్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదుతో రమేశ్‌గౌడ్‌ను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు.