HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Ktr To Undertake A State Wide Padayatra Next Year

KTR: వచ్చే ఏడాది రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర కేటీఆర్

  • Author : Vamsi Chowdary Korata Date : 16-07-2026 - 10:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
KTR to undertake a state-wide padayatra next year.
KTR to undertake a state-wide padayatra next year.

భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (KTR) సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఆయన పాదయాత్ర చేపట్టబోతున్నట్లు స్వయంగా వెల్లడించారు. ఢిల్లీలో జరిగిన మీడియా చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ నాయకత్వంలోనే తాము ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. ఇదే సమయంలో అధికార కాంగ్రెస్ పార్టీపై, సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కన్నెపల్లి పంప్ హౌస్ అంశంపై ప్రభుత్వం రాజకీయం చేస్తోందని, ఉద్దేశపూర్వకంగానే నీరివ్వకుండా లక్షల ఎకరాల పంటలను ఎండబెట్టేస్తున్నారని ఆయన ఆరోపించారు. తమ పార్టీ పేరును వాడుకుంటూ కొందరు నష్టం కలిగించాలని చూస్తున్నారని, అలాంటి ప్రయత్నాలను అస్సలు సహించేది లేదని హెచ్చరించారు.

ఈ పాదయాత్ర ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడమే కాకుండా, ప్రజల్లో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకోవాలని బీఆర్‌ఎస్ భావిస్తోంది. అలాగే కేంద్ర మంత్రి బండి సంజయ్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవని కేటీఆర్ ఈ సందర్భంగా స్పష్టం చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ వ్యాప్తంగా సాగబోయే ఈ పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటూ, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా కేటీఆర్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. వచ్చే ఏడాది ప్రారంభం కానున్న ఈ యాత్ర రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తీసుకువస్తుందో వేచి చూడాలి.

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BRS Chief KCR
  • BRS MLA KTR
  • brs party
  • KTR Padayatra
  • telangana politics

Related News

CM Revanth Reddy's master plan for Telangana's development!

Revanth Reddy: తెలంగాణ అభివృద్ధికి.. సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్!

తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధిని కాంక్షిస్తూ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రాజకీయాలకు అతీతంగా ఒక కీలకమైన ముందడుగు వేశారు. ఎన్నికలు, రాజకీయం కేవలం పోలింగ్ వరకే పరిమితం కావాలని, రాష్ట్రాభివృద్ధి విషయంలో రాజకీయ పార్టీలన్నీ విభేదాలను పక్కనబెట్టి కలిసికట్టుగా పనిచేయాలని సీఎం పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం వద్ద సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న వివిధ

  • Harish Rao is in touch with the BJP: Revanth Reddy

    Harish Rao: బీజేపీతో టచ్‍లో హరీశ్ రావు : రేవంత్ రెడ్డి

  • Kavitha warns the Congress government.

    Kavitha: కాంగ్రెస్ ప్రభుత్వానికి కవిత వార్నింగ్

  • CM Revanth Reddy issues a strong warning to KTR.

    Cm Revanth: కేటీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Latest News

  • Bhagyanagaramloo Saradhi Prema : ‘భాగ్యనగరంలో సారథి ప్రేమ’ టాక్

  • New Zealand: న్యూజిలాండ్‌లో సునామీ హెచ్చరికలు..

  • Ice Cream: ఐస్‌క్రీమ్ ఎక్కువగా తింటున్నారా? క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది.. మ‌హిళ‌లు త‌ప్పనిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

  • Egg Price Hike: కొండెక్కిన గుడ్డు.. రికార్డు స్థాయికి కోడిగుడ్డు ధరలు

  • KTR: చంద్రబాబు పనితీరును కొనియాడిన కేటీఆర్‌

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd