Bhagyanagaramloo Saradhi Prema : ‘భాగ్యనగరంలో సారథి ప్రేమ’ టాక్
యూట్యూబ్‌లో మంచి ఆదరణ పొందుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. యువత భావోద్వేగాలు, ప్రేమ, స్నేహం, జీవిత పోరాటాలను హృదయానికి హత్తుకునేలా చూపించిన ఈ చిత్రం కొత్త ప్రతిభను ప్రోత్సహించాలనుకునే ప్రతి సినీ అభిమాని
- Author : Sudheer
Date : 16-07-2026 - 9:53 IST
Published By : Hashtagu Telugu Desk
Bhagyanagaramloo Saradhi Prema: పెద్ద నిర్మాణ సంస్థల అండ, స్టార్ బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా.. ప్రతిభ, పట్టుదల, కష్టపడే తత్వం ఉంటే మంచి సినిమా తీయొచ్చని మరోసారి నిరూపించింది ‘భాగ్యనగరంలో సారథి ప్రేమ’ చిత్రం. బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న యువ దర్శకుడు రంగుభుక్త రాము తన కలను నిజం చేసుకునేందుకు దాదాపు ఏడాదిన్నర పాటు శ్రమించి ఈ సినిమాను తెరకెక్కించారు. అలాగే నిర్మాతలు అంగా రెడ్డి భరత్ రెడ్డి, వాల్దాస్ భరత్ గౌడ్ కూడా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ఈ ప్రాజెక్ట్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ చిత్రంలో ప్రిన్స్ వంశీ, నిక్కీ చారి ప్రధాన పాత్రల్లో నటించగా, ఐవీడీ సాయి ప్రత్యేక పాత్రలో కనిపించారు. నితిన్, చోటు, వినయ్, రాజా, హరి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి రామయ్య చెంబోలు కథను అందించగా, శ్రావణ్ కుప్పిలి సంభాషణలతో పాటు అసిస్టెంట్ డైరెక్టర్‌గా బాధ్యతలను నిర్వహించారు.
ఈ సినిమాకు సంగీత దర్శకుడు సంపత్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పవన్ కొంబత్తుల రాసిన సాహిత్యం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ప్రవీణ్ కోమటి సినిమాటోగ్రఫీ, భాను అసిస్టెంట్ డీవోపీగా చేసిన పని, గీవన్ జీఆర్ ఎడిటింగ్ సినిమాకు మరింత నాణ్యతను తీసుకొచ్చాయి. హైదరాబాద్‌లో అనేక సవాళ్ల మధ్య కేవలం 10 రోజుల్లోనే గంటా 10 నిమిషాల నిడివితో ఈ చిత్రాన్ని పూర్తి చేయడం విశేషం. సినిమా అవుట్‌పుట్‌పై నమ్మకంతో ప్రసాద్ ల్యాబ్స్‌లో ప్రత్యేక ప్రదర్శన నిర్వహించగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. అనంతరం యువ హీరో ఆనంద్ దేవరకొండ చేతుల మీదుగా ఈ చిత్రాన్ని యూట్యూబ్‌లో విడుదల చేశారు. ప్రస్తుతం ‘భాగ్యనగరంలో సారథి ప్రేమ’ యూట్యూబ్‌లో మంచి ఆదరణ పొందుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. యువత భావోద్వేగాలు, ప్రేమ, స్నేహం, జీవిత పోరాటాలను హృదయానికి హత్తుకునేలా చూపించిన ఈ చిత్రం కొత్త ప్రతిభను ప్రోత్సహించాలనుకునే ప్రతి సినీ అభిమాని తప్పక చూడాల్సిన చిత్రంగా నిలుస్తోంది. ఈ సందర్భంగా నిర్మాతలు అంగా రెడ్డి భరత్ రెడ్డి, వాల్దాస్ భరత్ గౌడ్ మాట్లాడుతూ.. కొత్త ప్రతిభను ప్రోత్సహించడమే తమ లక్ష్యమని, రాబోయే ఐదు నుంచి పది సంవత్సరాల్లో మరెన్నో మంచి చిత్రాలను నిర్మిస్తూ BR Productionsను నాణ్యమైన సినిమాలకు చిరునామాగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.