Independence Day 2023: ప్రతి ఇంటిపై జెండా ఎగరాలి: కిషన్ రెడ్డి
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను పురస్కరించుకుని రానున్న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలు తమ ఇళ్లలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.
- By Praveen Aluthuru Published Date - 02:10 PM, Mon - 14 August 23

Independence Day 2023: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను పురస్కరించుకుని స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలు తమ ఇళ్లలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. హర్ ఘర్ తిరంగ ఉద్యమంలో భాగంగా సోమ, మంగళవారాల్లో జరిగే బైక్ ర్యాలీలో పాల్గొనాలని ప్రజలను కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సలహా మేరకు ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ‘హర్ ఘర్ తిరంగ’ కార్యక్రమం చేపట్టబడింది. ప్రజలందరూ స్వచ్ఛందంగా తమ ఇళ్లపై జెండాలను ఎగురవేయాలని కిషన్ రెడ్డి చెప్పారు.ప్రజలందరూ తమ ఇళ్లపై జెండా ఎగురవేసి మన దేశ ఐక్యత మరియు సమగ్రతలో భాగం కావాలని కోరారు.
‘హర్ ఘర్ తిరంగ’ ఉద్యమంలో పాల్గొనాల్సిందిగా ప్రధాని మోదీ భారత ప్రజలను కోరారు. దేశంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముందు ప్రధాని తన సోషల్ మీడియా ప్రొఫైల్ చిత్రాన్ని మార్చారు. ప్రస్తుతం మోడీ ప్రొఫైల్ ఫోటో భారత జెండాని పెట్టారు. భారత జెండా స్వాతంత్య్ర స్ఫూర్తికి, జాతీయ ఐక్యతకు ప్రతీక అని, ‘హర్ ఘర్ తిరంగా’ వెబ్‌సైట్ (https://hargartiranga.com)లో జాతీయ జెండా ఉన్న తమ ఫొటోలను అప్‌లోడ్ చేయాలని ప్రజలను కోరారు.
Also Read: Independence Day 2023: ఎర్రకోటలో ప్రధాని మోడీతో మరో ఇద్దరు మహిళలు