HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Telangana
  • >Kcrs Speech At The Brs Silver Jubilee Meeting Without Targeting The Bjp Why

KCR Vs BJP : కాంగ్రెస్‌ విలన్ ఐతే.. బీజేపీ ఫ్రెండా ? కేసీఆర్ మాటలకు అర్థాలే వేరులే!

తెలంగాణ రాష్ట్రం సంగతి అలా ఉంచితే.. కనీసం బీఆర్ఎస్(KCR Vs BJP) పార్టీకి నిజమైన విలన్ ఎవరు ? అనే ప్రశ్నకు సమాధానం బీజేపీ.

  • By Pasha Published Date - 02:04 PM, Tue - 29 April 25
  • daily-hunt
Kcr Speech Kcr Vs Bjp Brs Silver Jubilee Meeting Congress Telangana

KCR Vs BJP : ‘‘తెలంగాణకు ఆనాడైనా, ఈనాడైనా, ఏనాడైనా నంబర్‌ వన్‌ విలన్‌ కాంగ్రెస్‌ పార్టీయే’’ అని ఇటీవలే బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ విమర్శించారు. ఈ విమర్శలో నిజమెంత అంటే.. దాదాపుగా నూటికి నూరు శాతం నిజం లేదని చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కారణమైన పార్టీ కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ చొరవ చూపకుంటే తెలంగాణ ఏర్పడకపోయేది. అలాంటి గొప్ప చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని తెలంగాణకు విలన్‌గా చెప్పడం ద్వారా రాజకీయ పబ్బం గడుపుకునే ప్రయత్నాన్ని కేసీఆర్ చేశారని రాజకీయ పండితులు అంటున్నారు.

Also Read :Target PoK : పీఓకే‌పైనే భారత్ గురి.. ఉగ్రవాద లాంచ్ ప్యాడ్‌లే లక్ష్యం

బీఆర్ఎస్‌కు నిజమైన విలన్ ఎవరు ? 

తెలంగాణ రాష్ట్రం సంగతి అలా ఉంచితే.. కనీసం బీఆర్ఎస్(KCR Vs BJP) పార్టీకి నిజమైన విలన్ ఎవరు ? అనే ప్రశ్నకు సమాధానం బీజేపీ. ‘‘కేంద్రంలోని బీజేపీ సర్కారు రాజకీయ దురుద్దేశంతో కక్షగట్టి నన్ను ఢిల్లీ లిక్కర్ స్కాంలోకి లాగింది. అందుకే నేను కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీల విచారణను ఎదుర్కోవాల్సి వచ్చింది’’ అని గతంలో పలుమార్లు బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత చెప్పుకొచ్చారు.  ప్రస్తుతం ఈ కేసు వ్యవహారం గౌరవనీయ కోర్టు పరిధిలో ఉన్నందున ఎవరూ ఎక్కువగా మాట్లాడటం సరికాదు. ఈనేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో బీజేపీని సూటిగా కేసీఆర్ పల్లెత్తు మాట కూడా అనకపోవడం గమనార్హం. అంతటితో ఆగకుండా గౌరవపూర్వక రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీని విలన్‌గా అభివర్ణించడం నీచ రాజకీయాలకు నిదర్శనం.

Also Read :WhatsApp Update : యాప్‌తో పనిలేదు.. ఇక వాట్సాప్ వెబ్‌ నుంచీ కాల్స్‌

బీఆర్ఎస్ డౌన్.. బీజేపీ ఓట్ల శాతం అప్ 

వాస్తవానికి తెలంగాణలో బీఆర్ఎస్ పతనంతో ఎదుగుతున్న పార్టీ బీజేపీయే. గత అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఈవిషయం నిరూపితమైంది. అయినా కేసీఆర్ ఆ లెక్కలన్నీ పట్టించుకోకుండా తాత్కాలిక ప్రయోజనాల కోసం ఏకపక్ష విమర్శలకు దిగడం సరికాదని రాజకీయ పండితులు అంటున్నారు. 2023 నవంబరులో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 14 శాతం ఓటింగ్‌‌ను సాధించి 8 ఎమ్మెల్యే సీట్లను కైవసం చేసుకుంది. ఇక లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్‌‌ను ఏకంగా 21.08 శాతం మేర పెంచుకుంది. ఆ పార్టీ ఓటింగ్ శాతం మొత్తంగా 35.08 శాతానికి చేరుకుంది. దీంతో రాష్ట్రంలోని 8 లోక్‌సభ స్థానాలు బీజేపీ ఖాతాలోకి వెళ్లాయి. తెలంగాణలో ఇంత భారీ సంఖ్యలో బీజేపీ ఎన్నడూ ఎంపీ సీట్లను గెల్చుకోలేదు. బీజేపీ ఎంపీలుగా గెల్చిన వారిలో అత్యధికులు బీఆర్ఎస్ నుంచి జంపైన నేతలే. బీఆర్ఎస్ మునకకు కారణమవుతున్న బీజేపీని వదిలేసి.. స్వయంశక్తితో ముందుకు సాగుతున్న కాంగ్రెస్‌ను కేసీఆర్ టార్గెట్‌గా చేసుకోవడాన్ని అందరూ తప్పుపడుతున్నారు. అయితే వచ్చే  ఎన్నికల నాటికి బీజేపీతో జట్టు కట్టే ఆలోచనలు బీఆర్ఎస్‌ బాస్ మదిలో ఉండొచ్చని పలువురు పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఆ విషయాన్ని ఇప్పుడే సూటిగా చెప్పలేక.. కాంగ్రెసే నంబర్ 1 విలన్ అని పరోక్షంగా కేసీఆర్ చెప్పి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • brs
  • BRS Silver Jubilee
  • congress
  • kcr
  • KCR Speech
  • KCR Vs BJP
  • telangana

Related News

Heavy Rains

Alert : 13న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు!

Alert : ఆంధ్రప్రదేశ్ మాదిరిగానే తెలంగాణలో కూడా ఈ అల్పపీడనం తీవ్ర ప్రభావం చూపనుంది. ముఖ్యంగా సెప్టెంబర్ 13 తర్వాత వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉంది

  • Kavitha Comments Harish

    Kavitha Vs Harish : నాపై చేసిన ఆరోపణలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నా..కవిత కు ఇన్ డైరెక్ట్ కౌంటర్ ఇచ్చిన హరీశ్

  • Cbi Director

    CBI : హైదరాబాద్ కు సీబీఐ డైరెక్టర్.. కారణం అదేనా..?

  • Hyderabad

    Hyderabad: గ్రేటర్‌లో నిమజ్జనానికి సర్వం సన్నద్ధం!

  • Harish Rao

    Harish Rao: లండ‌న్‌లో జ‌రిగిన మీట్ అండ్ గ్రీట్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న హ‌రీష్ రావు!

Latest News

  • South: ఏఐడీఎంకెలో ఉత్కంఠ.. పళణి స్వామి కీలక నిర్ణయాలు

  • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

  • Viral : రూ.10 వేల కోట్ల ఆస్తి ఫుట్‌బాల్‌ స్టార్‌కి రాసిచ్చిన బిలియనీర్‌

  • Coolie : వచ్చేస్తోంది.. ‘కూలీ’ ఇప్పుడు ఏ ఓటీటీలో అంటే..?

  • Ganesh Visarjan : 16 కిలో మీటర్లు సాగనున్న బాలాపూర్‌ గణేష్‌ శోభాయాత్ర..

Trending News

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd