KTR : 10 కేజీలు తగ్గిన కవిత.. నెక్ట్ వీక్ బెయిల్: కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
కవిత కి నెక్ట్ వీక్ బెయిల్ వస్తుంది అని కేటీఆర్ తెలిపారు . కవిత కు బీజేపీ ఎందుకు బెయిల్ ఇప్పిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.
- By Latha Suma Published Date - 03:05 PM, Fri - 9 August 24

KTR: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత(kavitha)ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన విషయం తెలిసిందే. ఇటీవలే డిఫాల్ట్ బెయిల్ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు. సీబీఐ కేసులో డిఫాల్ట్ బెయిల్ కోరారు. ముఖ్యంగా కవిత కేసులో పదేపదే వాయిదాలు కోరడంతో కవిత లాయర్లపై న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాజాగా మాజీ మంత్రి, కవిత సోదరుడు, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ కవిత హెల్త్ చాలా సిక్ అయ్యింది అని తెలిపారు. కవిత ఇప్పటి వరకు పది కేజీ ల బరువు తగ్గింది. కవిత బెయిల్ ప్రాసెస్ జరుగుతుంది. కవిత కి నెక్ట్ వీక్ బెయిల్ వస్తుంది అని కేటీఆర్ తెలిపారు . కవిత కు బీజేపీ ఎందుకు బెయిల్ ఇప్పిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు రవి ప్రకాష్ కి లీగల్ నోటీసు పంపిస్తామని.. బేస్ లెస్ వార్తలు వేస్తున్నారు. యూ ట్యూబ్ లో కూడా రాకుండా సస్పెండ్ చేయిస్తాం అన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
కాగా, ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టయి తీహార్ జైలులో ఉన్న కవితను కేటీఆర్ కలిశారు. మంగళవారం (ఆగస్టు 7) మాజీ మంత్రి హరీశ్‌రావుతో కలిసి కవితను కలిశారు. దాదాపు 15 నిమిషాల పాటు ఆమెతో మాట్లాడారు. ఈ సందర్భంగా కవిత ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు. మూడు రోజులుగా కేటీఆర్ ఢిల్లీలోనే మకాం వేశారు. ఆయనతో పాటు మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, గంగుల కమలాకర్‌లు కూడా ఉన్నారు. కేటీఆర్, హరీశ్ శనివారం రాత్రి ఢిల్లీకి చేరుకోగా, ఇతర నేతలు ఆదివారం వచ్చారు. అయితే ఢిల్లీలో కేటీఆర్, హరీష్ రావులు ఏం చేస్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు అనే విషయాలను మాత్రం గోప్యంగా ఉంచుతున్నారు. సోమవారం కవితతో భేటీ ఉంటుందని తొలుత వార్తలు వచ్చినా.. పార్టీ ఫిరాయించిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వ్యవహారంపై సుప్రీంకోర్టును ఆశ్రయించే అంశంపై కేటీఆర్, హరీశ్ తదితర నేతలు న్యాయ నిపుణులతో సమావేశమైనట్లు వార్తలు వచ్చాయి. పార్టీ. ఇక మంగళవారం ప్రొఫెసర్ జయశంకర్ జన్మదిన వేడుకలను బీఆర్‌ఎస్ నాయకుడి ఇంట్లో ఘనంగా నిర్వహించి వీడియో సందేశం పంపారు. మరోవైపు, X వేదికగా స్పందిస్తూ ప్రభుత్వంపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే.