Kavitha : కవితకు షాక్.. బెయిల్ ఇవ్వొద్దన్న సీబీఐ
- By Latha Suma Published Date - 02:48 PM, Mon - 22 April 24

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్(Delhi liquor scam)లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు(BRS MLC Kavitha) అయి తీహార్ జైలో ఉన్న విషయం తెలిసిందే. అయితే కవిత సీబీఐ(CBI) అరెస్టుపై వేసిన బెయిల్ పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును మే 2కు వాయిదా వేసింది. కాసేపటి క్రితమే లిక్కర్ స్కామ్‌లో సీబీఐ అరెస్ట్‌లో కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ జరుగగా… కవిత తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. మహిళగా కవిత బెయిల్‌కు అర్హురాలన్నారు. అరెస్ట్ నుంచి విచారణ వరకు ఎటువంటి మెటీరియల్ లేదన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఆధారాలు లేకుండానే అరెస్ట్ చేశారని కోర్టుకు తెలిపారు. ఈడి కస్టడీలో ఉన్నామని.. సీబిఐ ఎందుకు అరెస్ట్ చేసిందని లాయర్ ప్రశ్నించారు. అరెస్ట్ చెయ్యాల్సిన అవసరం లేదన్నారు. పార్టీకి స్టార్ క్యాంపైనర్ అని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నామని… రూలింగ్‌లో ఉన్నప్పుడే ఏం చెయ్యలేకపోయామన్నారు. చిదంబరం జడ్జిమెంట్ కవిత విషయంలో సరిపోతుందన్నారు. ఏడేళ్ల లోపల పడే శిక్ష ఆధారాలకు అరెస్ట్ అవసరం లేదన్నారు. అరెస్టుకు సరైన కారణాలు లేవని కవిత తరపున లాయర్లు వాదనలు వినిపించారు.
Read Also: RR vs MI Prediction: ఐపీఎల్ లో మరో హైఓల్టేజ్ మ్యాచ్.. ఎవరి సత్తా ఎంత?
అయితే కవితకు బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ (CBI) వాదనలు వినిపించింది. కవిత ప్రభావితం చేయగలుగుతారని.. లిక్కర్ కేసులో కవిత కీలక వ్యక్తిగా ఉన్నారని సీబీఐ తరపు న్యాయవాదలు కోర్టుకు వెల్లడించారు. ఇరువురి వాదనలు విన్న జడ్జి కావేరి బవేజ తీర్పును మే 2కు వాయిదా వేశారు. మరికొద్దిసేపట్లో ఈడీ కేసులో కవిత బెయిల్ పిటిషన్‌పై వాదనలు ప్రారంభంకానున్నాయి.