HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
Telugu
  • English
  • हिंदी
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat
  • Trending
  • # IPL 2023
  • # Sri Rama Navami 2023
  • # Pavan Kalyan
  • # Movie Reviews

  • Telugu News
  • ⁄Telangana
  • ⁄Kavitha Ed Investigation Concluded Notices To Come Again On 16

Kavitha vs ED: ముగిసిన కవిత ఈడీ విచారణ, 16న మళ్లీ రావాలని నోటీసులు

ఢిల్లీ. లిక్కర్ స్కామ్ లో కవిత విచారణ ముగిసింది. మరోసారి ఈ నెల 16 విచారణకు రావాలని కవితకు నోటీస్ లు ఇచ్చారు. దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన

  • By CS Rao Published Date - 08:48 PM, Sat - 11 March 23
Kavitha vs ED: ముగిసిన కవిత ఈడీ విచారణ, 16న మళ్లీ రావాలని నోటీసులు

ఢిల్లీ. లిక్కర్ స్కామ్ లో కవిత (Kavitha) విచారణ ముగిసింది. మరోసారి ఈ నెల 16 విచారణకు రావాలని కవితకు నోటీస్ లు ఇచ్చారు. దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ విచారణ ముగియడంతో బీ ఆర్ ఎస్ క్యాడర్ కు ఉపశమనం తాత్కాలికంగా లభించింది. విచారణ ముగిసిన తరువాత ఢిల్లీ లోని తండ్రి కేసీఆర్ నివాసానికి వెళ్లారు. ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రారంభమైన క్వశ్చన్ అవర్ రాత్రి 8 గంటల వరకూ జరిగింది. మొత్తం 9 గంటలపాటు కవితను ఈడీ అధికారులు విచారించారు. సాయంత్రం 5.30 గంటలకే విచారణ ముగియాల్సి ఉండగా, అనూహ్యంగా రాత్రి వరకు కొనసాగించారు. రూల్ ప్రకారం మహిళలను సాయంత్రం 6 వరకు మాత్రమే విచారించాల్సి ఉన్నా, సమయం దాటినా కవితను ఈడీ బయటకు పంపలేదు. ఈడీ వైఖరితో బీఆర్‌ఎస్ శ్రేణులు ఆందోళనలో పడ్డాయి. అయితే.. కవిత బయటికి రాగానే, బీఆర్ఎస్ శ్రేణులు హ్యాపీగా ఫీలయ్యి ఈలలు, కేకలు, నినాదాలతో హోరెత్తించాయి.

ఈడీ ఆఫీసు దగ్గర పోలీసులు హై అలర్ట్ ప్రకటించడం, మీడియాను, బీఆర్ఎస్ కేడర్‌ను ఈడీ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో లేకుండా పోలీసులు దూరంగా పంపారు. దీంతో కవిత (Kavitha) బయటికి రాగానే అరెస్ట్ చేస్తారని ఢిల్లీలో వార్తలు చక్కర్లు కొట్టాయి. కార్యాలయం దగ్గర వాతావరణాన్ని చూసిన బీఆర్ఎస్ కార్యకర్తలు, మంత్రులు ఒకింత టెన్షన్‌ పడ్డారు.

ఆమెను ఎలా ప్రశ్నించి ఉండొచ్చు అనే ఊహాగానాలు బయటకు వస్తున్నాయి.

  1. ఢిల్లీ మద్యం పాలసీలో మార్పులు చేసింది మీరేనా..?
  2. ఈ మార్పులు చేర్పులు వెనుక ఎవరెవరి పాత్ర ఉంది.. మనీష్ సిసోడియాతో పరిచయం ఎలా ఏర్పడింది?
  3. ఢిల్లీ గవర్నమెంట్‌కు సౌత్‌గ్రూప్‌నకు మధ్యవర్తి మీరేనా..?
  4. ఢిల్లీ మద్యం వ్యాపారంతో మీకున్న సంబంధమేంటి..?
  5. లిక్కర్ స్కామ్‌లో మీ పాత్ర ఉందా.. లేదా..?
  6. అరుణ్ రామచంద్ర పిళ్లై మీకు బినామీనా కాదా..?
  7. మీ ప్రతినిధని పిళ్లై చెప్పిన దాంట్లో నిజమెంత..?
  8. పిళ్లైకు మీకు మధ్య ఆర్థిక లావాదేవీలు ఏమైనా జరిగాయా..?
  9. రామచంద్రతో వ్యాపారం చేస్తే నాతో చేసినట్లే అని మీరు చెప్పలేదా?
  10. సౌత్‌గ్రూప్‌తో మీకున్న సంబంధాలేంటి.?
  11. ఛార్టెడ్ ఫ్లైట్‌లో వెళ్లి రూ. 130 కోట్లు లంచం ఇచ్చారా..?
  12. 130 కోట్లు డబ్బు ఎక్కడ్నుంచి వచ్చింది.. ఎవరిచ్చారు..?
  13. ఛార్డెడ్ ఫ్లైట్ మీకు ఎవరు సమకూర్చారు..?
  14. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని ఎప్పుడైనా కలిశారా..?
  15. ఫేస్‌టైమ్‌లో మీరు సమీర్ మహేంద్రుతో మాట్లాడారా.. లేదా..?
  16. శరత్ చంద్రారెడ్డిని ఎన్నిసార్లు కలిశారు..?
  17. శరత్ చంద్రాతో తరుచూ మాట్లాడాల్సిన అవసరం ఏంటి..?
  18. ఆధారాలు మాయం చేసేందుకు సెల్‌ఫోన్లు ధ్వంసం చేశారా..?
  19. సెల్‌ఫోన్లు ఎందుకు ధ్వంసం చేశారు..?
  20. గోరంట్ల బుచ్చిబాబుకు మీకున్న సంబంధమేంటి..?

ఇలాంటి ప్రశ్నలతో పాటు పలు అనుబంధ ప్రశ్నలను కవితను (Kavitha) ఈడీ అడిగిందని వినికిడి.

ఇవాళ జరిగిన విచారణ మొత్తంలో కవిత మొబైల్ ఫోన్లు ధ్వంసం చేస్తున్నట్లు వచ్చిన ఆరోపణలు, స్కామ్‌లో సౌత్ గ్రూప్ పాత్రపై విచారించారని సమాచారం. అంతేకాకుండా అరుణ్ పిళ్లై రిమాండ్ రిపోర్ట్ ఆధారంగా కవితపై ప్రశ్నల వర్షం కురిపించారని తెలుస్తోంది. మాజీ ఆడిటర్ బుచ్చిబాబు వాట్సాప్ చాట్ ఆధారంగా కూడా ప్రశ్నలు అడిగారని సమాచారం. కవిత-పిళ్లై ఇద్దర్నీ కాన్‌‌ఫ్రాంటేషన్ ఇంటరాగేషన్ ద్వారా అధికారులు విచారించారట. కవితతో పాటు మొత్తం 9 మందిని ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మనీష్ సిసోడియా, కవిత, అరుణ్ రామచంద్రన్ పిళ్ళై, దినేష్ అరోరా, బుచ్చిబాబు, సిసోడియా మాజీ కార్యదర్శి అరవింద్, ఎక్సైజ్ శాఖ మాజీ అధికారులు కుల్దీప్ సింగ్, నరేంద్ర సింగ్‌లను విడివిడిగా, కలిపి ఈడీ ప్రశ్నించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మళ్లీ 16న ఏమి జరుగుతుంది? అనేది చూడాలి.

జాయింట్‌ డైరెక్టర్‌ స్థాయి అధికారి నేతృత్వంలో పీఎంఎల్‌ఏ50(2) ప్రకారం అనుమానితురాలిగా ఈడీ అధికారులు కవిత స్టేట్‌మెంట్‌ రికార్డు చేస్తున్నట్టు సమచారం. కవిత మాజీ ఆడిటర్‌ బుచ్చిబాబు, విజయ్‌ నాయర్‌, మనీష్‌ సిసోదియా స్టేట్‌మెంట్‌ల ఆధారంగా ఎమ్మెల్సీ కవితను ఈడీ ప్రశ్నిస్తోంది. అరుణ్‌ పిళ్లైతో కలిపి కవితను విచారిస్తున్నట్టు సమాచారం. ఆధారాలు ధ్వంసం చేయడం, డిజిటల్‌ ఆధారాలు లభించకుండా చేశారని, హైదరాబాద్‌లో జరిగిన సమావేశాలపై ప్రధానంగా ఈడీ ఆరా తీసినట్టు తెలుస్తోంది. కేజ్రీవాల్‌, సిసోదియాతో జరిగిన భేటీలపై కూడా ప్రశ్నించినట్టు తెలుస్తోంది.

కవిత ఈడీ విచారణ గంటల తరబడి కొనసాగడంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. భారాస శ్రేణులు ఈడీ కార్యాలయానికి చేరుకోకుండా దిల్లీ పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. కవిత ఈడీ విచారణ నేపథ్యంలో మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు దిల్లీలోనే ఉన్నారు.

Also Read:  Pokémon Pheromosa: కొత్త బొద్దింక జాతి గుర్తింపు.. “పోకీమాన్ ఫెరోమోసా” గా నామకరణం

Telegram Channel

Tags  

  • brs
  • case
  • cbi
  • delhi
  • ED
  • hyderabad
  • investigation
  • kavitha
  • kcr
  • liquor
  • scam
  • telangana
https://d31dai02dmgobf.cloudfront.net/wp-content/uploads/2022/03/divis-ad.jpeg

Related News

Power Strike: మెరుపు సమ్మెకు సిద్ధమవుతున్న విద్యుత్ ఉద్యోగులు.. డెడ్ లైన్ ఫిక్స్!

Power Strike: మెరుపు సమ్మెకు సిద్ధమవుతున్న విద్యుత్ ఉద్యోగులు.. డెడ్ లైన్ ఫిక్స్!

విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు మరో మెరుపు సమ్మెకు సిద్ధమవుతున్నారు.

  • Hyderabad Police: సెలబ్రిటీల ఫొటోలు మార్ఫింగ్ చేసి ట్రోల్ చేస్తే జైలుకే

    Hyderabad Police: సెలబ్రిటీల ఫొటోలు మార్ఫింగ్ చేసి ట్రోల్ చేస్తే జైలుకే

  • TSPSC: అభ్యర్థులకు అలర్ట్.. ఏఈఈ పరీక్ష కొత్త తేదీలు ప్రకటించిన TSPSC

    TSPSC: అభ్యర్థులకు అలర్ట్.. ఏఈఈ పరీక్ష కొత్త తేదీలు ప్రకటించిన TSPSC

  • Hyderabad: శ్రీరామనవమి శోభాయాత్ర.. మసీద్, దర్గాలకు క్లాత్ చుట్టేసి?

    Hyderabad: శ్రీరామనవమి శోభాయాత్ర.. మసీద్, దర్గాలకు క్లాత్ చుట్టేసి?

  • Rajasingh: ఉగ్రవాద సంస్థ నాపై కుట్రకు పాల్పడుతోంది: రాజాసింగ్.

    Rajasingh: ఉగ్రవాద సంస్థ నాపై కుట్రకు పాల్పడుతోంది: రాజాసింగ్.

Latest News

  • Jagan plan : మూడోసారి క్యాబినెట్ ప్ర‌క్షాళ‌న‌,సీనియ‌ర్ల‌కు ఛాన్స్ ?

  • Philippine Ferry Fire: ఫిలిప్పీన్స్ ఫెర్రీలో భారీ అగ్నిప్రమాదం.. 31 మంది మృతి

  • Jagan Delhi : ముగిసిన జ‌గ‌న్ ఢిల్లీ చ‌క్కర్లు, అసెంబ్లీ ర‌ద్దు?

  • Bird Flu: చిలీలో కలకలం.. మనుషుల్లో మొట్టమొదటి బర్డ్ ఫ్లూ కేసు..!

  • America:అమెరికాలోని కేతుంకిలో ఢీకొన్న రెండు ఆర్మీ హెలికాప్టర్లు. 6గురు సైనికులు మృతి

Trending

    • Business Idea : మీ ఊరిలో ఖాళీ స్థలం ఉందా, ఈ పండ్ల తోటతో నెలకు రూ. 1 లక్ష పక్కా…పెట్టుబడి అవసరం లేదు…!

    • Kuno National Park: 70 ఏళ్ల తరువాత జరిగిన అద్భుతం..4గురు పిల్లలకు తల్లి అయిన సియా..అసలు కథ ఇదే..

    • UPI Payment is Free: అంతా ఏప్రిల్ ఫూల్…యూపీఐ చార్జీల విషయంలో జరిగింది ఇదే…

    • UPI Payments: ఇకపై UPI ద్వారా పేమెంట్స్ చేస్తే మన జేబులు ఖాళీ అవ్వాల్సిందే..!

    • ISRO Recruitment 2023: నిరుద్యోగులకు గుడ్‎న్యూస్ ఇస్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..జీతం రూ. 40వేలకే పైనే

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: