TS : టీడీపీలోకి కాసాని జ్ఞానేశ్వర్ ..!!
తెలంగాణ ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ టీడీపీలో చేరారు.
- By hashtagu Published Date - 04:17 AM, Sat - 15 October 22

తెలంగాణ ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ టీడీపీలో చేరారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబునాయుడు సమక్షంలో ఆయన నివాసంలో కాసాని జ్ఞానేశ్వర్ జ్ఞానేశ్వర్ తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయనకు చంద్రబాబు నాయుడు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాసాని 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో కాసాని ఓడిపోయారు. గతంలో ఆయన ఎమ్మెల్సీగా పనిచేశారు. రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ గానూ పనిచేశారు.