HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Kalvakuntla Kavitha Arrested Taken To The Station By The Police

Kalvakuntla Kavitha : కల్వకుంట్ల కవిత అరెస్ట్..స్టేషన్‌కు తరలించిన పోలీసులు..!

  • Author : Vamsi Chowdary Korata Date : 28-11-2025 - 3:32 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kalvakuntla Kavitha
Kalvakuntla Kavitha

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కామారెడ్డిలోని అశోక్‌ నగర్ రైల్వే గేట్ వద్ద రైల్ రోకో నిర్వహించారు. ప్లకార్డులు పట్టుకుని ఆందోళన చేస్తున్న కవితను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఆమెను అరెస్ట్ చేసే క్రమంలో జరిగిన తోపులాటలో కవిత చేతికి స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం ఆమెను సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాంగ్రెస్, బీజేపీలు బీసీ రిజర్వేషన్ల అమలును అడ్డుకుంటున్నాయని, 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసే వరకు పోరాటం ఆగదని కవిత స్పష్టం చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అంశంపై నిరసన ప్రదర్శన ఉద్రిక్తతకు దారితీసింది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌తో రైల్వే ట్రాక్‌పై రైల్ రోకో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు, జాగృతి కార్యకర్తల మధ్య జరిగిన తోపులాటలో కవిత చేతికి స్వల్ప గాయాలయ్యాయి.. ఆ తర్వాత ఆమెను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ రైల్వే గేట్ వద్ద కవిత, తెలంగాణ జాగృతి నాయకులతో కలిసి రైలు పట్టాలపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలంటూ ప్లకార్డులు పట్టుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళన కారణంగా రైల్వే ట్రాక్‌పై అంతరాయం ఏర్పడటంతో.. కామారెడ్డి పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్) సిబ్బంది భారీగా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నిరసనకారులను ట్రాక్‌పై నుంచి తొలగించే ప్రయత్నం చేశారు. మొదట పోలీసులు కవితను సముదాయించే ప్రయత్నం చేసినప్పటికీ.. ఆమె వెనక్కి తగ్గకపోవడంతో, బలవంతంగా అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు.

కవితతో పాటు జాగృతి నాయకులను పోలీసులు అరెస్టు చేసే క్రమంలో పోలీసులు, జాగృతి కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో, పోలీసులు బలప్రయోగం చేసి కవితను అదుపులోకి తీసుకున్నారు. ఈ పెనుగులాటలోనే కవిత చేతికి స్వల్ప గాయమైంది. వెంటనే ఆమెను అరెస్టు చేసి, సమీపంలోని సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

పోలీసులు అరెస్టు చేసిన అనంతరం కవిత మాట్లాడుతూ.. 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలయ్యే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు తగిన ప్రాతినిధ్యం దక్కకుండా చేసేందుకు కాంగ్రెస్, బీజేపీలు కలిసి కుట్రలు చేస్తున్నాయని ఆమె తీవ్రంగా ఆరోపించారు.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు కేవలం 17 శాతం రిజర్వేషన్లతోనే పంచాయతీ ఎన్నికలకు వెళ్లడం బీసీలను మోసం చేయడమేనని ఆమె విమర్శించారు. అంతేకాకుండా.. ఎంపీలు, ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేస్తే 42 శాతం బీసీ బిల్లు అమలవుతుందని ఆమె పేర్కొన్నారు.

K.Kavitha was arrested in Kamareddy leading a Rail RoKo demanding a 42% reservation for Backward Classes #JagruthiJanamBaata pic.twitter.com/99ZlOErL42

— Jagruthi Janam Baata (@J_JanamBaata) November 28, 2025


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 42% BC reservation
  • jagruthi kavitha
  • kalvakuntla kavitha
  • Kalvakuntla kavitha Arrest
  • kamareddy
  • telangana

Related News

Engineering counselling in Telangana begins today.

TS EAPCET 2026: తెలంగాణలో నేటి నుంచి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్

తెలంగాణలో బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన మోస్ట్ అవేటెడ్ టీజీ ఎప్‌సెట్ 2026 మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ జూన్ 19వ తేదీ శుక్రవారం అంటే ఈరోజు నుంచే అధికారికంగా ప్రారంభమైంది. ఇంజినీరింగ్ సీటు సాధించాలనే లక్ష్యంతో ఉన్న విద్యార్థులు ఈ రోజు నుంచి ఆన్‌లైన్‌లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, తమకు అనుకూలమైన తేదీ, సమయాన్ని బట్టి ధ్రువపత్రాల పరిశీలన కోసం స్లాట్ బుక్ చేసుక

  • Alert for gas consumers: June 30 is the final deadline. These requirements must be met—otherwise, the connection will be disconnected.

    LPG Gas Subsidy: గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. జూన్ 30 వరకే డెడ్ లైన్.. ఇవి తప్పక పాటించాల్సిందే.. లేదంటే కనెక్షన్ కట్

  • Pawan Kalyan's tour in Telangana... Janasena chief to fulfill a young child's last wish.

    Pawan Kalyan: తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటన.. చిన్నారి చివరి కోరిక తీర్చనున్న జనసేనాని

  • AICC issues show-cause notice to Shabbir Ali.

    Shabbir Ali: షబ్బీర్‌అలీకి ఏఐసీసీ షోకాజ్ నోటీసులు

  • A techie who gave up the American dream... today, she is a role model for many farmers. So, who is Sanjana Reddy? What is this interesting story?

    Sanjana Reddy Inspiring Journey: అమెరికన్ కలను వదులుకున్న టెక్కీ… నేడు ఆమె ఎందరో రైతులకు ఆదర్శం.. ఇంతకీ సంజన రెడ్డి ఎవరు? ఏంటా ఇంట్రెస్టింగ్ స్టోరీ

Latest News

  • Shani Anugraham: శని పీడ తొలగిపోవాలంటే శనీశ్వరుడికి.. ఈ వస్తువు సమర్పించాల్సిందే!

  • Pista: ఈ సీజన్‌లో పిస్తా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు!

  • Pregnancy: పీరియడ్స్ టైం లో శృంగారంలో పాల్గొంటే ప్రెగ్నెన్సీ వచ్చినట్లేనా..?

  • Cm Vijay: కర్ణాటక ప్రభుత్వ ప్రతిపాదనకు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం

  • Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు షాక్

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd