Jubilee Hills Car Accident : జూబ్లీహిల్స్ లో కారు బీభత్సం..
- Author : Sudheer
Date : 31-01-2024 - 10:09 IST
Published By : Hashtagu Telugu Desk
హైదరాబాద్ (Hyderabad) మహానగరంలో ప్రయాణం అంటే కత్తిమీద సాములాంటిది. ఏ వైపు నుండి మృతువు ఏ రూపంలో వస్తుందో తెలియదు..కేవలం హైదరాబాద్ లోనే కాదు ప్రస్తుతం ఏ రోడ్లపై చూసిన అదే పరిస్థితి. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ , మద్యం , నిద్ర మత్తులో డ్రైవ్ చేయడం వల్ల నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇంట్లో నుండి బయటకు వెళ్లిన వ్యక్తి తిరిగి ఇంటికి వచ్చేవరకు అందరికి టెన్షనే. ప్రతి రోజు పదుల సంఖ్యలో ప్రమాదాలు జరుగుతూ అమాయకపు వ్యక్తుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి.
We’re now on WhatsApp. Click to Join.
తాజాగా బుధువారం హైదరాబాద్ జూబ్లీహిల్స్ (Jubilee Hills)లో కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో ఓ కారు..రెండు బైకులను ఢీ కొట్టి ఆపకుండా వెళ్లిపోయింది. దీంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఓ బైకుపై అన్నా చెల్లెల్లు..మరో వాహనదారుడికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఈ ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం వీరికి మాదాపూర్ మెడికవర్ హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నారు. కృష్ణా కృష్ణానగర్ కి చెందిన అన్నా చెల్లెల్లు ఉదయ్ , స్వీటీ లుగా పోలీసులు గుర్తించారు. వీరు ద్విచక్ర వాహనం మీద కలిసి వెళ్తున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36 సెంట్రో గ్రాండీ దగ్గరకు రాగానే.. పక్కనే వేరొక బైక్ పై వెళ్తున్న మరొక వ్యక్తిని.. వెనుక నుంచి వచ్చిన వైట్ కలర్ స్పోర్ట్స్ కార్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ హెల్మెట్ కార్ కి వేలాడుతున్నా పట్టించుకోకుండా వెళ్లిపోయింది కారు. దీంతో రెండు బైకులపై వెళ్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో హిట్ అండ్ రన్
2 ద్విచక్ర వాహనాలను ఢీకొట్టిన వైట్ కలర్ డెకో స్పోర్ట్స్ కార్.. ముగ్గురు పరిస్థితి విషమం.
2 ద్విచక్ర వాహనాల పై వున్న ముగ్గురు వ్యక్తులు… అన్న, చెల్లిలకు, మరొక వాహనదారునికి గాయాలు.
గాయపడిన ముగ్గురిని పోలీస్ సహాయంతో… pic.twitter.com/3Gj39Pm7rv
— Telugu Scribe (@TeluguScribe) January 31, 2024
Read Also : YCP 5th List : వైసీపీ ఐదో జాబితా విడుదల..ఎవరికీ పదవి దక్కిందంటే..