Telangana Governor: తెలంగాణ కొత్త గవర్నర్‌గా జిష్ణు దేవ్ వర్మ..!
తెలంగాణ గవర్నర్‌గా జిష్ణు దేవ్‌వర్మను భారత రాష్ట్రపతి శనివారం నియమించారు. జార్ఖండ్‌తో పాటు తెలంగాణకు అదనపు బాధ్యతలు నిర్వహించిన సీపీ రాధాకృష్ణన్‌ను మహారాష్ట్ర గవర్నర్‌గా నియమించారు.
- By Gopichand Published Date - 08:46 AM, Sun - 28 July 24

Telangana Governor: తెలంగాణకు కొత్త గవర్నర్ వచ్చారు. రాధాకృష్ణన్ స్థానంలో జిష్ణు దేవ్ వర్మను తెలంగాణ గవర్నర్‌గా (Telangana Governor) నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ గవర్నర్‌గా జిష్ణు దేవ్‌వర్మను భారత రాష్ట్రపతి శనివారం నియమించారు. జార్ఖండ్‌తో పాటు తెలంగాణకు అదనపు బాధ్యతలు నిర్వహించిన సీపీ రాధాకృష్ణన్‌ను మహారాష్ట్ర గవర్నర్‌గా నియమించారు. బీజేపీ సీనియర్ నేత జిష్ణు దేవ్ వర్మ గతంలో త్రిపుర ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. వీరిద్దరితో పాటు హరిభౌ కిసన్‌రావ్ బాగ్డేను రాజస్థాన్ గవర్నర్‌గా నియమించగా, ఓం ప్రకాష్ మాథుర్‌ను సిక్కిం గవర్నర్‌గా నియమించారు. సంతోష్ కుమార్ గంగ్వార్ జార్ఖండ్ గవర్నర్‌గా, రామెన్ డేకా ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా నియమితులయ్యారు.
C. H. విజయశంకర్ మేఘాలయకు కొత్త గవర్నర్‌గా వ్యవహరిస్తారు. ప్రస్తుతం అస్సాం గవర్నర్‌గా ఉన్న గులాబ్ చంద్ కటారియా పంజాబ్ గవర్నర్‌గా, చండీగఢ్ కేంద్ర పాలిత ప్రాంత నిర్వాహకుడిగా నియమితులయ్యారు. సిక్కిం గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య అస్సాం గవర్నర్‌గా నియమితులయ్యారు. మణిపూర్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.
Also Read: Breast Cancer: మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉందో.. లేదో? నిమిషంలో తెలుసుకోవచ్చు.. ఎలాగంటే..?
జిష్ణు దేవ్ వర్మ 1957 ఆగష్టు 15న జన్మించారు. అంతేకాదు త్రిపుర రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. 2018- 2023 డిప్యూటీ సీఎంగా బాధ్యతలు అందించారు. గతంలో బాడ్మింటన్ అసోషియేషన్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు చేపట్టారు. జిష్ణు దేవ్ వర్మది త్రిపుర రాజ కుటుంబానికి చెందినవారని తెలుస్తోంది. రామ జన్మభూమి ఉద్యమ సమయంలో పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో అంటే 1990లో బీజేపీలో చేరారు. ఈ క్రమంలోనే ఆయనకు తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు ఇచ్చి బీజేపీ అధిష్టానం తగిన ప్రాధాన్యత ఇచ్చిందని పార్టీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే మొన్నటివరకు తెలంగాణకు గవర్నర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహించిన సీపీ రాధాకృష్ణన్‌ను మహారాష్ట్రకు బదిలీ చేసింది ప్రభుత్వం. ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్న రమేష్ బైస్‌ను గవర్నర్ పదవి నుంచి తప్పించింది.
We’re now on WhatsApp. Click to Join.