JEE Main 2025 Exam: ప్రారంభమైన జేఈఈ మెయిన్ పరీక్షలు.. తెలుగు రాష్ట్రాల నుంచి 1.5 లక్షల మంది
JEE Main 2025 Exam: ఈ పరీక్షలు జనవరి 22, 23, 24, 28, 29 తేదీల్లో పేపర్-1 కోసం జరుగుతాయి. ఇక, చివరి రోజు జనవరి 30న బీఆర్క్, బీ ప్లానింగ్ కోర్సుల కోసం పేపర్ 2 పరీక్ష జరగనుంది. ఈ రెండు పేపర్లకు దేశవ్యాప్తంగా దాదాపు 12 లక్షల మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే.. ఒక్క తెలుగు రాష్ట్రాల నుంచే సుమారు 1.5 లక్షల మంది ఈ పరీక్షకు హాజరవుతున్నారు.
- By Kavya Krishna Published Date - 10:31 AM, Wed - 22 January 25

JEE Main 2025 Exam: 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీ, బీటెక్, ఎన్‌ఐటీలలో బీఈ కోర్సుల్లో ప్రవేశానికి అర్హత కల్పించే జేఈఈ మెయిన్ 2025 తొలివిడత ఆన్‌లైన్ పరీక్షలు బుధవారం (జనవరి 22) నుంచి ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలు జనవరి 22, 23, 24, 28, 29 తేదీల్లో పేపర్-1 కోసం జరుగుతాయి. ఇక, చివరి రోజు జనవరి 30న బీఆర్క్, బీ ప్లానింగ్ కోర్సుల కోసం పేపర్ 2 పరీక్ష జరగనుంది. ఈ రెండు పేపర్లకు దేశవ్యాప్తంగా దాదాపు 12 లక్షల మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే.. ఒక్క తెలుగు రాష్ట్రాల నుంచే సుమారు 1.5 లక్షల మంది ఈ పరీక్షకు హాజరవుతున్నారు.
Congress Schemes: అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు -భట్టి విక్రమార్క
ప్రతి రోజు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్ పరీక్షలు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో సెషన్ పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్షల కోసం దేశవ్యాప్తంగానే కాకుండా.. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాలు, పట్టణాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో జేఈఈ మెయిన్ 2025 రెండో విడత పరీక్షలు జరుగుతాయి. రెండు విడతలలో వచ్చిన ఉత్తమ స్కోర్ ఆధారంగా తుది ర్యాంకులు కేటాయిస్తారు.
జేఈఈ మెయిన్‌లో కనీస మార్కులు సాధించిన తొలి 2.5 లక్షల మంది అభ్యర్థులను జేఈఈ ఆడ్వాన్స్‌డ్ పరీక్షకు అనుమతిస్తారు. జేఈఈ ఆడ్వాన్స్‌డ్ పరీక్ష మే 18న జరగనుంది. జేఈఈ మెయిన్ ర్యాంకులతో ఎన్‌ఐటీలు, అడ్వాన్స్‌డ్ ర్యాంకులతో ఐఐటీల్లో సీట్లు అందిపుచ్చుకోవచ్చు.
ప్రస్తుతం, దేశంలో 31 ఎన్‌ఐటీలు, 23 ఐఐటీలు, 10 ట్రిపుల్‌ఐటీలు , ఇతర విద్యాసంస్థల్లో కలిపి దాదాపు 1,03,100 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది సీట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, ప్రతి 100 మందిలో నాలుగుగురికే సీట్లు దక్కే అవకాశం ఉంది.
మరిన్ని మార్పులతో, తెలంగాణ రాష్ట్రంలో 2025-26 విద్యాసంవత్సరం నుంచి కొత్త బీఏ కోర్సు, ‘డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ స్టడీస్’ ప్రారంభమవుతుంది. ఈ కోర్సు ప్రవేశపెడుతున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. సిలబస్ తయారీ పనులు జరుగుతున్నాయి , దరఖాస్తులు త్వరలో కాలేజీల నుంచి ఆహ్వానించబడతాయని ఆయన చెప్పారు. రక్షణ రంగంలో పెద్దఎత్తున ఉద్యోగావకాశాలు ఉన్నందున ఈ కోర్సును ప్రవేశపెడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Priyanka Chopra : చిలుకూరు బాలాజీని దర్శించుకున్న ప్రియాంక చోప్రా