HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >If Bjp Loves Women It Should Pass Womens Bill Kavitha

Kavitha Deeksha: మహిళలపై చిత్తశుద్ది ఉంటే.. వెంటనే బిల్లు పాస్ చేయాలి: కవిత

బీజేపీకి పూర్తి మెజార్టీ ఉందన్న మహిళా బిల్లు ఆమోదం పొందే వరకు కొనసాగుతుందని కవిత చెప్పారు.

  • Author : Balu J Date : 10-03-2023 - 2:53 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kavitha
Kavitha

మహిళలు పరిపాలనలో భాగస్వామ్యం కావాలని, అన్ని రంగాల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌దే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పించే మహిళా రిజర్వేషన్‌ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి ఆమోదించాలనే డిమాండ్‌ తో ఢిల్లీ (Delhi)లోని జంతర్ మంతర్ వద్ద బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) దీక్ష చేపట్టారు. ఉదయం 10గంటలకు ప్రారంభమైన ఈ దీక్షకు భారీగా మహిళా నేతలు తరలి వచ్చారు. సాయంత్రం 4 వరకు కవిత ఇక్కడ నిరాహార దీక్ష చేస్తారు. దీక్ష ప్రారంభోత్సవానికి సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

కవిత (MLC Kavitha) దీక్షకు 18 రాజకీయ పార్టీలు సంఘీభావం తెలిపాయి. దీక్ష ప్రారంభం కాగానే బీఆర్ఎస్ సహా ఇతర పార్టీల మహిళా నేతలు కవిత వద్దకు వచ్చి సంఘీభావం తెలిపారు. ఆమెతోపాటు కూర్చుని ప్లకార్డులు చేతబట్టుకుని నినాదాలు చేశారు. పార్లమెంట్ లో మహిళా బిల్లు ప్రవేశ పెట్టాల్సిందేనని డిమాండ్ చేశారు మహిళా నేతలు. బీజేపీకి నిజంగా మహిళలపై ప్రేమ, మహిళా బిల్లు ఆమోదంపై చిత్తశుద్ధి ఉంటే.. పార్లమెంట్‌ లో మహిళా బిల్లు ఆమోదం పొందే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు కవిత (MLC Kavitha).

బీజేపీ (BJP)కి పార్లమెంట్‌ లో పూర్తి మెజార్టీ ఉందన్న ఆమె, మహిళా బిల్లు ఆమోదం పొందే వరకు తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. తమ బాధ్యత మేరకు ఒత్తిడి తెస్తున్నామని, బీజేపీకి హామీ నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేశారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఉభయ సభల్లో మెజార్టీ ఉన్నప్పటికీ బిల్లుని ఎందుకు ఆమోదించడంలేదని సూటిగా ప్రశ్నిస్తున్నారు మహిళా నేతలు.

Also Read: Sreeleela With Balakrishna: బాలకృష్ణ చేయి పట్టుకున్న శ్రీలీల.. NBK 108లోకి ఎంట్రీ


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BRS MLC
  • delhi
  • kavitha
  • reservation
  • women

Related News

Kavitha Bc Bandh

కవిత దూకుడు, బిఆర్ఎస్ శ్రేణుల్లో చెమటలు

2028 అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా , సీఎం గా గెలుస్తా అంటూ కవిత సవాళ్లు విసరడం , బిఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు , ఆరోపణలు చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అంతే కాదు కవిత దూకుడు బిఆర్ఎస్ లో కొత్త టెన్షన్ మొదలైంది.

  • Delhi cracks down on old vehicles... warning with heavy fines

    ఢిల్లీలో పాత వాహనాలపై ఉక్కుపాదం..భారీ జరిమానాలతో హెచ్చరిక

  • Petrol

    ఢిల్లీలో ఈ స‌ర్టిఫికేట్ ఉంటేనే పెట్రోల్‌!

Latest News

  • సరికొత్త అవతారంలో ‘రెనో డస్టర్’.. 2026 రిపబ్లిక్ డే రోజున గ్రాండ్ ఎంట్రీ!

  • టీ-20 ప్రపంచ కప్ 2026.. టీమిండియా ఓపెనింగ్ జోడీ ఎవరు?

  • రోజూ బ్రష్ చేస్తున్నారా? ప్లాస్టిక్ బ్రష్‌లు, టూత్‌పేస్ట్‌ల గురించి నిపుణుల హెచ్చరిక!

  • ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీకి చెక్.. కేంద్ర ప్రభుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం!

  • విజయ్ హజారే ట్రోఫీ.. 15 ఏళ్ల తర్వాత కోహ్లీ, ఏడేళ్ల త‌ర్వాత రోహిత్‌!

Trending News

    • 2025లో క్రీడా ప్రపంచాన్ని కుదిపేసిన బ్రేకప్‌లు!

    • జాతీయ గణిత దినోత్సవం..డిసెంబరు 22న దేశవ్యాప్తంగా గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ పుట్టినరోజు సందర్భంగా ఈ జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటారు.

    • 2026 రిలేషన్‌షిప్ టిప్స్.. భాగస్వామి జీవితాన్ని మార్చే నిర్ణ‌యాలీవే!

    • బుర్జ్ ఖలీఫా రికార్డు గల్లంతు.. త్వరలో ప్రపంచంలోనే ఎత్తైన భవనంగా జెడ్డా టవర్!

    • క్రెడిట్ కార్డ్ బిజినెస్.. బ్యాంకులు ఎందుకు అంతగా ఆఫర్లు ఇస్తాయి? అసలు లాభం ఎవరికి?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd