HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Business
  • >Gold And Silver Prices Feb 25th 2026

Gold And Silver Prices Today : పసిడి ప్రియులకు బిగ్ షాక్..భారీగా పెరిగిన గోల్డ్ ధర

బంగారం ధరలు చుక్కలు చూపిస్తుంటే.. వెండి ధర మాత్రం కొనుగోలుదారులకు స్వల్ప ఊరటనిచ్చింది. అనూహ్యంగా ఒక్కరోజులోనే కేజీ వెండిపై రూ. 10,000 తగ్గడం విశేషం

  • Author : Sudheer Date : 25-02-2026 - 9:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Today Gold Silver Prices
Today Gold Silver Prices

Gold And Silver Prices Today : జనవరి నెల చివరలో కొంత తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు, ఫిబ్రవరి రెండో వారం నుండి మళ్ళీ పరుగులు పెడుతున్నాయి. ముఖ్యంగా గత వారం రోజులుగా పసిడి ధరలు అడ్డూఅదుపు లేకుండా పెరుగుతూ వినియోగదారులను బెంబేలెత్తిస్తున్నాయి. ఫిబ్రవరి 25న హైదరాబాద్ మార్కెట్‌లో 22 క్యారెట్ల బంగారం ధర తులం (10 గ్రాములు)పై మరో రూ. 400 పెరిగి రూ. 1,48,300 వద్ద స్థిరపడింది. అంతకుముందు రోజు ఏకంగా రూ. 1900 పెరగడం గమనార్హం. ఇలా వరుసగా పెరుగుతూ కేవలం వారం వ్యవధిలోనే తులం బంగారంపై సుమారు రూ. 8,000 మేర భారం పడటం సామాన్యులకు మింగుడుపడని విషయంగా మారింది.

24 క్యారెట్ల బంగారం రికార్డు ధరలు

కేవలం ఆభరణాల బంగారమే కాకుండా, స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర కూడా రికార్డు స్థాయికి చేరుకుంది. నేడు రూ. 430 పెరగడంతో హైదరాబాద్‌లో 10 గ్రాముల ధర రూ. 1,61,780 కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలు, డాలర్ విలువలో హెచ్చుతగ్గులు మరియు కేంద్ర బ్యాంకుల వద్ద పెరిగిన నిల్వలు ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. వరుసగా రూ. 2100, రూ. 1750 వంటి భారీ జంప్‌లు తీసుకోవడం చూస్తుంటే, పసిడి ధరలు త్వరలోనే మరిన్ని కొత్త గరిష్ఠాలను తాకేలా కనిపిస్తున్నాయి.

బంగారం ధరలు చుక్కలు చూపిస్తుంటే.. వెండి ధర మాత్రం కొనుగోలుదారులకు స్వల్ప ఊరటనిచ్చింది. అనూహ్యంగా ఒక్కరోజులోనే కేజీ వెండిపై రూ. 10,000 తగ్గడం విశేషం. ప్రస్తుతం హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ. 2.90 లక్షల వద్ద కొనసాగుతోంది. ఒకవైపు బంగారం పెరుగుతూ, మరోవైపు వెండి ధరలు క్రమంగా దిగి రావడం మార్కెట్‌లో విభిన్న పరిస్థితులను సృష్టిస్తోంది. పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తుండటంతో ధరలు ఇంకా పెరుగుతాయేమో అన్న భయంతో కొందరు, మరికొంత కాలం వేచి చూద్దామని ఇంకొందరు సందిగ్ధంలో పడ్డారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bullion market gold price today
  • gold
  • Gold And Silver Prices Today
  • Gold and Silver Rate Today Hyderabad
  • Gold Price Today
  • gold rate
  • Gold rate today Hyderabad
  • Indian bullion gold rate
  • silver price live
  • silver price today in India
  • silver rate today

Related News

Gold Silver Prices See Shar

Gold Rate Today : గోల్డ్ ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు

అత్యంత స్వచ్ఛమైన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 380 తగ్గి రూ. 1,52,460కి చేరుకుంది. అదేవిధంగా, సామాన్యులు ఎక్కువగా కొనుగోలు చేసే 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ. 350 తగ్గి రూ. 1,39,750 వద్ద కొనసాగుతోంది

    Latest News

    • IPL 2026 SRH vs CSK : 10 రన్స్ తేడాతో CSK పై SRH విజయం

    • IPL 2026 -RCB vs DC : ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో DC విజయం

    • NBK-Koratala Shiva : బాలకృష్ణ ను డైరెక్ట్ చేయబోతున్న కొరటాల ?

    • Ram : సొంతంగా కథ రాసుకున్న హీరో రామ్..మరి ఏ డైరెక్టర్ కు ఛాన్స్ ఇస్తాడో ?

    • Coke Studio India : కోక్ స్టూడియో నుండి బుల్లెయా వే సాంగ్

    Trending News

      • ఏసీ నడపడానికి ఎంత సోలార్ సామర్థ్యం ఉండాలి?

      • Punarvika: చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్‌ తెప్పించిన లోకేశ్‌

      • అక్షయ తృతీయ 2026.. లక్ష్మీ పూజ కోసం ఇంటిని ఎలా సిద్ధం చేయాలి?

      • నేడు ఢిల్లీతో ఆర్సీబీ ఢీ.. ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా కోహ్లీ?

      • ఎల్లుండి ఇరాన్- అమెరికా మధ్య చర్చలు?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd