HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >I Promised To Give Telangana State I Kept My Word Sonia Gandhi

Sonia Gandhi : ఇచ్చిన మాట నిలుపుకున్నాం.. తెలంగాణ ఏర్పాటు చేశాం : సోనియాగాంధీ

‘‘తెలంగాణ రాష్ట్రం ఇస్తానని 2004లో కరీంనగర్ సభ వేదికగా హామీ ఇచ్చాను.

  • Author : Pasha Date : 02-06-2024 - 12:02 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Sonia Gandhi
Sonia Gandhi

Sonia Gandhi : ‘‘తెలంగాణ రాష్ట్రం ఇస్తానని 2004లో కరీంనగర్ సభ వేదికగా హామీ ఇచ్చాను. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాను’’ అని  సోనియా గాంధీ తెలిపారు. ‘‘తెలంగాణ ఏర్పాటుకు నేను తీసుకున్న నిర్ణయం వల్ల మా పార్టీలో అసమ్మతి ఏర్పడింది. కొందరు నేతలు మా నిర్ణయాన్ని విభేదించి విడిపోయారు. అయినా మేం ఇచ్చిన మాటను తప్పలేదు. దాని నిలబెట్టుకున్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశాం’’ అని ఆమె తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join

ఇవాళ తెలంగాణ దశాబ్ది వేడుకల సందర్భంగా ఈమేరకు సోనియాగాంధీ(Sonia Gandhi) ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎందరో అమరవీరుల త్యాగఫలమని ఆమె చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తించిన తొలి జాతీయ పార్టీ తమదేనని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రగతికి కట్టుబడి ఉన్నామని సోనియా స్పష్టం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పార్టీ ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని వెల్లడించారు. తెలంగాణ ప్రజలకు శుభం జరగాలని మనసారా కోరుకుంటున్నట్లు ఆమె చెప్పారు.

Also Read : PM Modi : ‘తెలంగాణ’ దశాబ్ది వేడుకల వేళ తెలుగులో మోడీ ట్వీట్

రాహుల్ గాంధీ ఏమన్నారంటే.. 

తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. పదేళ్ల కిందట డాక్టర్ మన్మోహన్ సింగ్, సోనియాగాంధీ హయాంలో లక్షలాది మంది ఆకాంక్షలను నెరవేర్చేలా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన వారికి రాహుల్ గాంధీ నివాళులు అర్పించారు. అందరికీ న్యాయం, సమానత్వం, సాధికారత, ప్రజా తెలంగాణ సాకారం కోసం కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సందేశం

తెలంగాణ అవతరణ దినోత్సవం వేళ రాష్ట్ర ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సుసంపన్నమైన వారసత్వం, మిశ్రమ సంస్కృతికి నిలయమన్నారు. దేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హబ్‌గా తెలంగాణ అవతరించడం గొప్ప విషయమని కొనియాడారు.  తెలంగాణ రాష్ట్రం, ప్రజలు అభివృద్ధి చెందాలని దేశ అభివృద్ధికి తోడ్పడాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు. తెలంగాణ మరింతగా ప్రగతి సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

Also Read : Pithapuram : పిఠాపురంలో భారీ ఈవెంట్..ఏమన్నా ప్లానా..?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • congress
  • rahul gandhi
  • sonia gandhi
  • telangana
  • Telangana formation day

Related News

Promotions in the Endowments Department: EOs promoted to Grade-1.

Endowments Department: దేవాదాయ శాఖలో ప్రమోషన్లు.. ఈవోలకు గ్రేడ్‌‌-1గా ప్రమోషన్లు

తెలంగాణ దేవాదాయ శాఖలో సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న పదోన్నతుల ప్రక్రియకు ఎట్టకేలకు ముగింపు లభించింది. శాఖను మరింత బలోపేతం చేయడంలో భాగంగా గ్రేడ్-2 కార్యనిర్వహణ అధికారులుగా విధుల్లో ఉన్న 26 మంది అధికారులకు గ్రేడ్-1 అధికారులుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం నిర్వహించిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో అటవీ, ద

  • Massive robbery at Khammam Sonovision showroom

    Khammam: ఖమ్మం సోనోవిజన్ షోరూమ్‌లో భారీ దోపిడీ

  • The chicken curry that took the life of the father

    Chicken Curry: తండ్రి ప్రాణం తీసిన నాటుకోడి కూర

  • Amit Shah makes key remarks on alliances in Telangana.

    Amit Shah: తెలంగాణలో పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు

  • Heavy Rain Forecast for Telangana

    తెలంగాణను తాకిన నైరుతి రుతుపవనాలు

Latest News

  • Single: అబ్బాయిలు.. సోలోగా ఉండాలనుకుంటున్నారా? మీ ఆయుష్షు తగ్గినట్లే!

  • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

  • Amaravati Capital: జగన్‌పై మంత్రి నారాయణ ఫైర్

  • Nayeem Hasan: చటోగ్రామ్‌లో బంగ్లాదేశ్ క్రికెటర్ నయీం హసన్‌పై పోలీసులు దాడి.. రచ్చ రచ్చ

  • Vitamin D: విటమిన్ డి ఎక్కువగా తీసుకుంటే ప్రమాదం

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd